7-Seater Cars Under 10 Lakhs: 10 లక్షల రూపాయల్లో వచ్చే 7 సీటర్ కార్లు ఇవే
7-Seater Cars Under 10 Lakhs: పెద్ద పెద్ద కార్ల కోసం చూస్తున్న వాళ్ల కోసం మారుతి, మహీంద్రా, రెనో వంటి బ్రాండ్లలోనే మంచి కార్లు వస్తున్నాయి. లేటెస్టు మోడళ్లు మీకు లభించనున్నాయి.

7-seater car in India: ఒకప్పుడు చిన్న చిన్న కార్లు కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపే వాళ్లు. ఈ మధ్య కాలంలో చాలా విశాలంగా ఉండే కార్లు ఎక్కువ అమ్ముడవుతున్నాయి. కుటుమంతా కలిసి వెళ్లేందుకు వీలుగా ఉండేకార్ల కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కావాల్సిన బడ్జెట్‌లోనే ఇలాంటి పెద్ద కార్లు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. మరికొందరికి పెద్ద పెద్ద కార్లు కొనాలనే ఆశ ఉన్నప్పటికీ బడ్జెట్ తట్టుకోలేక చిన్న కార్లతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇలాంటి వారి కోసం లోబడ్జెట్‌లో ఉన్న పెద్ద కార్ల గురించి సమాచారాన్ని మీకు అందిస్తున్నాం.
బడ్జెట్ 10 లక్షల రూపాయలు పెడితే మంచి 7-సీటర్ కారు కొనుగోలు చేసుకోవచ్చు. మారుతి, మహీంద్రా, రెనో కార్లు ఈ ధరల్లో వస్తున్నాయి. ఈ బ్రాండ్ల విశాలమైన స్థలం ఉన్న 7-సీటర్ కార్లు ఉత్పత్తి చేస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.
మారుతి ఎర్టిగా (Maruti Ertiga)
మారుతి ఎర్టిగా 7-సీటర్ కారు. మారుతి సుజుకి కంపెనీకి చెందిన ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర 8.84 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది మరియు దాని టాప్ మోడల్ ధర 13.13 లక్షల రూపాయల వరకు ఉంటుంది. మారుతి ఎర్టిగా పెట్రోల్, CNG పవర్‌ట్రెయిన్ ఎంపికలతో వస్తుంది. ఈ కారుకు సంబంధించి మొత్తం తొమ్మిది వేరియంట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి, వీటిలో ఏడు పెట్రోల్ వేరియంట్లు అయితే రెండు CNG వేరియంట్లు ఉన్నాయి.
మారుతికి చెందిన ఈ కారులో K15C స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ వల్ల 6,000 rpm వద్ద 75.8 kW టార్క్ లభిస్తుంది. 4,300 rpm వద్ద 139 Nm టార్క్ ఉత్పత్తి అవుతుంది. కారు ఇంజన్‌తో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ జోడించారు. .
మహీంద్రా బొలెరో (Mahindra Bolero)
మహీంద్రా బొలెరో కూడా పెద్ద కారు. ఇది 7-సీటర్ సబ్ కాంపాక్ట్ SUV. మహీంద్రా బొలెరో కారు ఎక్స్-షోరూమ్ ధర 9.79 లక్షల రూపాయల నుంచి ప్రారంభమై 10.91 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఈ కారులో mHAWK 75 BSVI ఇంజన్ ఉంది. కారులో ఉన్న ఈ ఇంజన్ నుంచి 55.9 kW టార్క్ లభిస్తుంది. 210 Nm పీక్ టార్క్ ఉత్పత్తి అవుతుంది.
మహీంద్రా బొలెరో ప్రీమియం క్యాబిన్ స్థలంతో వస్తుంది. ఈ కారులో భద్రత కోసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఈ కారు మూడు రంగుల్లో లభిస్తుంది. డైమండ్ వైట్, డిశాట్ సిల్వర్, లేక్‌సైడ్ బ్రౌన్. ఈ కారులో మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించారు. కారులో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంది. మహీంద్రాగ్రూప్‌కు చెందిన ఈ కారులో డిజిటల్ ఇన్ఫర్మేషన్ క్లస్టర్ కూడా ఉంది.
రెనో ట్రైబర్ (Renault Triber)
రెనో ట్రైబర్ ఒక అల్ట్రా మాడ్యులర్ 7-సీటర్ కారు. ఈ కారు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌తో వస్తుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర 6.09 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఈ 7-సీటర్ కారు ఎక్స్-షోరూమ్ ధర 8.74 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది.
రెనో కంపెనీకి చెందిన ఈ కారులో 625 లీటర్ల బూట్-స్థలం లభిస్తుంది. కారులో 23 లీటర్ల ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంది. కారులో 20.32-సెంటీమీటర్ల టచ్‌స్క్రీన్ ఉంది. ఈ కారులో 17.78-సెంటీమీటర్ల TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఇది దేశంలో అమ్ముడయ్యే అత్యంత చౌకైన 7-సీటర్ కారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

