అన్వేషించండి

Mahindra Car Demand: మహీంద్రా SUV కోసం 3 నెలలైనా ఆగుతున్నారుగానీ వేరే కారు కొనడం లేదు - ఏంటి దీని స్పెషాలిటీ?

2025 Mahindra Scorpio N: మహీంద్రా స్కార్పియో N ను కోరుకుంటున్న వాళ్ల సంఖ్య నిరంతరం పెరగడం వల్ల, ఈ బండి డిమాండ్‌ కూడా అదే స్థాయిలో పెరుగుతోంది.

Mahindra Scorpio N Waiting Period: మన దేశంలో మహీంద్రా స్కార్పియో N కు ఉన్న పాపులారిటీది వేరే లెవెల్‌. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ SUVకి డిమాండ్‌ ఎప్పుడు చూసినా పీక్‌ స్టేజ్‌లో ఉంటుంది. ఇప్పుడు, ఈ బండి కోసం వెయిటింగ్‌ పిరియడ్‌ 1.5 నెలల నుంచి 3.5 నెలల వరకు (వేరియంట్‌ను బట్టి) ఉంది.

మహీంద్రా స్కార్పియో N Z2 వేరియంట్‌ కావాలంటే 1.5 నుంచి 2 నెలలు, Z4 వేరియంట్ కోసం 2 నుంచి 2.5 నెలలు, Z6 కోసం 2.5 నుంచి 3 నెలలు & Z8 వేరియంట్ కోసం 3 నుంచి 3.5 నెలలు ఎదురు చూడాల్సి వస్తోంది.

మహీంద్రా స్కార్పియో N బడ్జెట్
కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం & పెరుగుతున్న డిమాండ్ కారణంగా, ఈ వెయిటింగ్‌ పిరియడ్‌ మరింత పెరగవచ్చు. స్కార్పియో N ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 25.15 లక్షల వరకు ఉంటుంది. వేరియంట్ & ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌ను బట్టి ఈ రేటు మారుతుంది. 

ఇంజిన్ & పనితీరు ఎలా ఉంది?
ఈ SUV రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తోంది. 

మొదటిది 2.0-లీటర్ mStallion టర్బో-పెట్రోల్ ఇంజిన్. ఇది 203 PS పవర్‌ను, 370 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది - 16.5 kmpl నుంచి 18.5 kmpl  వరకు మైలేజీ ఇస్తుంది. 

రెండోది 2.2-లీటర్ mHawk డీజిల్ ఇంజన్. ఇది బేస్ ట్రిమ్‌లో 132 PS పవర్‌ను, & హయ్యర్‌ ట్రిమ్‌లో 175 PS పవర్‌ను, 300 Nm నుంచి 400 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. డీజిల్ వేరియంట్ 12.12 kmpl నుంచి 15.94 kmpl మైలేజీ ఇవ్వగలదు. ఇంకా.. 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్స్‌లోనూ ఈ బండిని కొనవచ్చు. డీజిల్ మోడల్ 4x4 ఆప్షన్‌లోనూ లభిస్తుంది, ఇది ఆఫ్-రోడింగ్‌ రైడ్‌కు సదా సిద్ధంగా ఉంటుంది.

లక్షణాలు & సాంకేతికత
మహీంద్రా స్కార్పియో N ను మోడర్న్‌ టెక్నాలజీ & కంఫర్టబుల్‌ ఫీచర్లకు నిలయంగా చూడాలి. ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇచ్చే 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ క్యాబిన్‌లో ఉంది. సోనీ 12-స్పీకర్ సౌండ్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ & 6-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటి ప్రీమియం ఫీచర్లను ఈ SUVలో యాడ్‌ చేశారు.

భద్రత విషయంలో నో టెన్షన్‌
స్కార్పియో N భద్రత పరంగానూ బలంగా ఉంది. దీనికి గ్లోబల్ NCAP ద్వారా "5-స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్" లభించింది. ప్రయాణీకుల భద్రత కోసం ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ (EBD), యాంటీ-లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ABS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ హోల్డ్ & హిల్ డీసెంట్ కంట్రోల్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్‌ & టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

సైజ్‌ & స్పేస్‌
స్కార్పియో N పొడవు 4662 mm, కర్బ్ వెయిట్‌ 1885 కిలోలు. గరిష్ట వేగం గంటకు 240 km. ఇది 6 & 7-సీట్ల కాన్ఫిగరేషన్స్‌లో అందుబాటులో ఉంది కాబట్టి ఒక పెద్ద కుటుంబానికి సరిపోయే SUV అవుతుంది. స్పేస్‌, రైడ్ క్వాలిటీ & స్ట్రాంగ్‌ లుక్స్‌తో ఇది Tata Harrier & Safari వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhimavaram Temples: సంక్రాంతికి భీమవరం వెళ్తున్నారా? అయితే తప్పక చూడాల్సినవి ఇవే
సంక్రాంతికి భీమవరం వెళ్తున్నారా? అయితే తప్పక చూడాల్సినవి ఇవే
PM Modi New Office: త్వరలోనే కొత్త ఆఫీస్‌లోకి ప్రధానమంత్రి మోదీ! ఇంటి చిరునామా కూడా మారుతుందా?
త్వరలోనే కొత్త ఆఫీస్‌లోకి ప్రధానమంత్రి మోదీ! ఇంటి చిరునామా కూడా మారుతుందా?
Pushpa 2 Japan Release : జపాన్‌లో పుష్ప రాజ్ ఎంట్రీ - 'పుష్ప కున్రిన్' రిలీజ్ ఎప్పుడంటే?
జపాన్‌లో పుష్ప రాజ్ ఎంట్రీ - 'పుష్ప కున్రిన్' రిలీజ్ ఎప్పుడంటే?
Hyderabad Crime News: ఇక్కడితోనైనా ఆగుతుందా? చైనా మాంజా ప్రమాదాలు ఇంకెన్ని చూడాలి !
ఇక్కడితోనైనా ఆగుతుందా? చైనా మాంజా ప్రమాదాలు ఇంకెన్ని చూడాలి !

వీడియోలు

Rohit Sharma Records Ind vs NZ ODI | క్రిస్ గేల్ రికార్డును అధిగమించిన హిట్‌మ్యాన్
RCB vs UP WPL 2026 | ఆర్సీబీ సూపర్ విక్టరీ
Washington Sundar Ruled Out | గాయంతో బాధ‌ప‌డుతున్న వాషింగ్ట‌న్ సుంద‌ర్
Devdutt Padikkal record in Vijay Hazare Trophy | దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డు
Haimendorf 39th Death Anniversary | ఆదివాసీల ఆత్మబంధువు పేరు భావి తరాలకు నిలిచిపోయేలా చేస్తాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhimavaram Temples: సంక్రాంతికి భీమవరం వెళ్తున్నారా? అయితే తప్పక చూడాల్సినవి ఇవే
సంక్రాంతికి భీమవరం వెళ్తున్నారా? అయితే తప్పక చూడాల్సినవి ఇవే
PM Modi New Office: త్వరలోనే కొత్త ఆఫీస్‌లోకి ప్రధానమంత్రి మోదీ! ఇంటి చిరునామా కూడా మారుతుందా?
త్వరలోనే కొత్త ఆఫీస్‌లోకి ప్రధానమంత్రి మోదీ! ఇంటి చిరునామా కూడా మారుతుందా?
Pushpa 2 Japan Release : జపాన్‌లో పుష్ప రాజ్ ఎంట్రీ - 'పుష్ప కున్రిన్' రిలీజ్ ఎప్పుడంటే?
జపాన్‌లో పుష్ప రాజ్ ఎంట్రీ - 'పుష్ప కున్రిన్' రిలీజ్ ఎప్పుడంటే?
Hyderabad Crime News: ఇక్కడితోనైనా ఆగుతుందా? చైనా మాంజా ప్రమాదాలు ఇంకెన్ని చూడాలి !
ఇక్కడితోనైనా ఆగుతుందా? చైనా మాంజా ప్రమాదాలు ఇంకెన్ని చూడాలి !
Adilabad Latest News: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16న పర్యటించనున్న ముఖ్యమంత్రి! సదర్మాట్ బ్యారేజి, చనాక-కోరాట ప్రాజెక్టు  ప్రారంభోత్సవం!
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16న పర్యటించనున్న ముఖ్యమంత్రి! సదర్మాట్ బ్యారేజి, చనాక-కోరాట ప్రాజెక్టు  ప్రారంభోత్సవం!
T20 World Cup: భారత్‌లోనే T20 ప్రపంచ కప్ ఆడాలి.. బంగ్లాదేశ్‌కు మరో దారి లేద్న ఐసీసీ!
భారత్‌లోనే T20 ప్రపంచ కప్ ఆడాలి.. బంగ్లాదేశ్‌కు మరో దారి లేద్న ఐసీసీ!
Toronto gold heist: ఇది రియల్ థూమ్ - కెనడా విమానంలో 400 కేజీల బంగారం లూఠీ - దొంగ ఇండియనే!
ఇది రియల్ థూమ్ - కెనడా విమానంలో 400 కేజీల బంగారం లూఠీ - దొంగ ఇండియనే!
The Raja Saab Collections : ప్రభాస్ ది రాజా సాబ్ కలెక్షన్స్ - నాలుగు రోజుల్లోనే 200 కోట్ల క్లబ్‌లో డార్లింగ్ హారర్ ఫాంటసీ
ప్రభాస్ ది రాజా సాబ్ కలెక్షన్స్ - నాలుగు రోజుల్లోనే 200 కోట్ల క్లబ్‌లో డార్లింగ్ హారర్ ఫాంటసీ
Embed widget