అన్వేషించండి

కొత్త లుక్‌, తక్కువ ధర, 14 అంగుళాల టచ్‌స్క్రీన్‌: 2026 MG Hector ఫేస్‌లిఫ్ట్‌లో చాలా కొత్తదనం!

2026 MG హెక్టర్‌ ఫేస్‌లిఫ్ట్‌ ఇండియాలో రూ.11.99 లక్షల నుంచే లాంచ్‌ అయింది. కొత్త గ్రిల్‌, 14 అంగుళాల టచ్‌స్క్రీన్‌, అప్‌డేటెడ్‌ ఫీచర్లతో హెక్టర్‌ ప్లస్‌ ధరలు కూడా వెల్లడయ్యాయి.

2026 MG Hector Facelift Price Features: MG మోటార్‌ ఇండియా, తన పాపులర్‌ మిడ్‌-సైజ్‌ SUVకి మరోసారి అప్‌డేట్‌ ఇచ్చింది. 2026 MG హెక్టర్‌ ఫేస్‌లిఫ్ట్‌ను అధికారికంగా లాంచ్‌ చేసింది. ప్రారంభ ధరను రూ.11.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా ప్రకటించింది, ఇది పరిచయ ఆఫర్‌. ఔగోయింగ్‌ మోడల్‌తో పోలిస్తే ఇది దాదాపు రూ.2.1 లక్షలు తక్కువ కావడం విశేషం. MG Hector Plus 7-seater ధర రూ.17.29 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే 6-seater వేరియంట్ల ధరలను ఇంకా ప్రకటించలేదు.

వేరియంట్ల వారీగా ధరలు:

వేరియంట్‌
హెక్టర్‌ ధర (రూ. లక్షల్లో)
హెక్టర్‌ ప్లస్‌ ధర (రూ. లక్షల్లో)
Style MT
 
11.99
వర్తించదు
Select Pro MT
 
13.99
వర్తించదు
Smart Pro MT
 
14.99
వర్తించదు
Smart Pro CVT
 
16.29
వర్తించదు
Sharp Pro MT
 
16.79
17.29
Sharp Pro CVT
 
18.09
18.59
Savvy Pro CVT
 
18.99
19.49

ఎక్స్‌టీరియర్‌ అప్‌డేట్స్‌: గ్రిల్‌, అలాయ్‌ వీల్స్‌ కొత్తగా

2026 హెక్టర్‌లో ముందు భాగం స్వల్పంగా మారినా, ఫ్రెష్‌గా కనిపిస్తుంది. భారీ గ్రిల్‌ సైజ్‌ మార్చకపోయినా, ఇప్పుడు డైమండ్‌ ప్యాటర్న్‌ స్థానంలో హనీకాంబ్‌ డిజైన్‌ స్లాట్స్‌ వచ్చాయి. లోయర్‌ ఎయిర్‌ డ్యామ్‌ కూడా కొత్త డిజైన్‌తో కనిపిస్తుంది. 18 అంగుళాల అలాయ్‌ వీల్స్‌, వెనుక బంపర్‌ రీడిజైన్‌ చేశారు. అయితే స్ప్లిట్‌ హెడ్‌ల్యాంప్స్‌, వెనుక వైపు టెయిల్‌ ల్యాంప్స్‌ను కలిపే LED లైట్‌ స్ట్రిప్‌ వంటి అంశాలను కొనసాగించారు.

కలర్‌ ఆప్షన్లలో... కొత్తగా సెలడాన్‌ బ్లూ, పెర్ల్‌ వైట్‌ రంగులను జోడించారు. ఇప్పటికే ఉన్న అరోరా సిల్వర్‌, స్టారీ బ్లాక్‌, గ్లేజ్‌ రెడ్‌తో కలిపి మొత్తం 5 కలర్‌ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

ఇంటీరియర్‌, ఫీచర్లు: 14 అంగుళాల టచ్‌స్క్రీన్‌ హైలైట్‌

కొత్త 5-సీటర్‌ హెక్టర్‌లో డ్యూయల్‌-టోన్‌ ఐస్‌ గ్రే ఇంటీరియర్‌ ఇచ్చారు. 6, 7-సీటర్‌ హెక్టర్‌ ప్లస్‌ వేరియంట్లలో డ్యూయల్‌-టోన్‌ ట్యాన్‌ కేబిన్‌ కనిపిస్తుంది. ఇందులో ప్రధాన ఆకర్షణ పోర్ట్రెయిట్‌ స్టైల్‌ 14 అంగుళాల టచ్‌స్క్రీన్‌. ఇందులో MG అందిస్తున్న iSwipe టచ్‌ జెశ్చర్‌ కంట్రోల్‌ టెక్నాలజీ ద్వారా రెండు వేళ్లతో క్లైమేట్‌ కంట్రోల్‌, మూడు వేళ్లతో ఆడియో సిస్టమ్‌ను కంట్రోల్‌ చేయవచ్చు.

ఇతర ఫీచర్లలో... 7 అంగుళాల డ్రైవర్‌ డిస్‌ప్లే, వెంటిలేటెడ్‌ ముందు సీట్లు, డ్రైవర్‌ సీటుకు 6-వే పవర్‌ అడ్జస్ట్‌మెంట్‌, వైర్‌లెస్‌ ఆపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో, పానోరమిక్‌ సన్‌రూఫ్‌, అంబియంట్‌ లైట్స్‌, PM 2.5 ఎయిర్‌ ఫిల్టర్‌, పుష్‌ బటన్‌ స్టార్ట్‌/స్టాప్‌, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు కొనసాగుతాయి.

ఇంజిన్‌ ఆప్షన్లు: మెకానికల్‌ మార్పుల్లేవు

కొత్త హెక్టర్‌, హెక్టర్‌ ప్లస్‌ మోడళ్లలో పాత మోడళ్లలోని ఇంజిన్లనే కొనసాగిస్తున్నారు. పెట్రోల్‌ వేరియంట్లలో.. 1.5 లీటర్‌ నాలుగు సిలిండర్ల ఇంజిన్‌, 143 హెచ్‌పీ శక్తి, 250 ఎన్‌ఎం టార్క్‌ ఇస్తుంది. ఇది 6-స్పీడ్‌ మాన్యువల్‌ లేదా CVT గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది.

డీజిల్‌ వేరియంట్‌లో 2.0 లీటర్‌ ఇంజిన్‌, 170 హెచ్‌పీ, 350 ఎన్‌ఎం టార్క్‌ ఇస్తుంది. ప్రస్తుతం డీజిల్‌ ధరలను ప్రకటించలేదు. ఆటోమేటిక్‌ డీజిల్‌ వస్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఏయే కార్లతో పోటీ?

2026 MG హెక్టర్‌ ఫేస్‌లిఫ్ట్‌...  Tata Harrier, Jeep Compass వంటి SUVలకు పోటీగా నిలుస్తుంది. ఇక హెక్టర్‌ ప్లస్‌... Mahindra XUV 7XO, Hyundai Alcazar, Tata Safari వంటి 7-సీటర్‌ SUVలతో పోటీ పడనుంది.

మొత్తంగా చూస్తే... తక్కువ ప్రారంభ ధర, కొత్త డిజైన్‌ టచ్‌లు, పెద్ద టచ్‌స్క్రీన్‌, ఫీచర్లతో 2026 MG హెక్టర్‌ ఫేస్‌లిఫ్ట్‌ తెలుగు రాష్ట్రాల కుటుంబాలకు ఆకర్షణీయమైన SUV ఎంపికగా నిలుస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Hatao Lungi Bajao Pungi: ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
Telangana Latest News: తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
Advertisement

వీడియోలు

Haimendorf 39th Death Anniversary | ఆదివాసీల ఆత్మబంధువు పేరు భావి తరాలకు నిలిచిపోయేలా చేస్తాం | ABP Desam
Sophie Devine All Rounder Show | DCW vs GGTW మ్యాచ్ లో సోఫీ డివైన్ ఆశ్చర్యపరిచే ప్రదర్శన | ABP Desam
Ind vs NZ First ODI Highlights | మొదటి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం | ABP Desam
Virat Kohli 71st PoTM Award | తన తల్లితో అనుబంధాన్ని, సచిన్ పై ప్రేమను మరో సారి చాటిన కోహ్లీ | ABP Desam
Virat Kohli Reached Second Place | సంగక్కరను దాటేసి...సచిన్ తర్వాతి స్థానంలో విరాట్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Hatao Lungi Bajao Pungi: ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
Telangana Latest News: తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
Virat Kohli:విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్ ట్రోఫీలను ఎక్కడ ఉంచుతాడో తెలుసా? సీక్రెట్ చెప్పిన ఛేజ్‌ మాస్టర్!
విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్ ట్రోఫీలను ఎక్కడ ఉంచుతాడో తెలుసా? సీక్రెట్ చెప్పిన ఛేజ్‌ మాస్టర్!
Kishan Reddy: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
AP CM Chandrababu: పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
Guntur Latest News:గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే ఆగ్రహం
గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే ఆగ్రహం
Embed widget