అన్వేషించండి

Mahindra Thar Facelift 2026: న‌యా లుక్‌లో రాబోతున్న కొత్త మహీంద్రా థార్: అదిరిపోయే ఫీచర్లు, సూప‌ర్బ్ స్టైలింగ్!

Mahindra Thar Facelift 2026: మహీంద్రా థార్ 3-డోర్ వెర్షన్ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్‌తో రానుంది. థార్ రాక్స్ నుంచి ప్రేరణ పొందిన డిజైన్, ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మహీంద్రా థార్ 2026: నూతన డిజైన్, ప్రీమియం ఫీచర్లతో రానుంది.
  • ఫేస్‌లిఫ్ట్ థార్: సర్క్యులర్ LED హెడ్‌ల్యాంప్‌లు, C-ఆకారపు DRLలు వస్తాయి.
  • కొత్త థార్: వెంటిలేటెడ్ సీట్లు, పెద్ద టచ్‌స్క్రీన్‌తో లగ్జరీ క్యాబిన్.
  • ఇంజిన్, ట్రాన్స్‌మిషన్: 4x4, RWD ఆప్షన్లతో డీజిల్, పెట్రోల్ ఇంజిన్లు.

Mahindra Thar Facelift 2026: లైఫ్ స్టైల్ ఎస్‌యూవీ విభాగంలో రారాజుగా వెలుగుతున్న మహీంద్రా థార్ ఇప్పుడు సరికొత్త మిడ్-లైఫ్ అప్‌డేట్‌కు సిద్ధమవుతోంది. తాజాగా బయటకు వచ్చిన స్పై షాట్స్ ప్రకారం, 3-డోర్ థార్ తన ప్లాగ్ షిప్ 'థార్ రాక్స్' (Thar Roxx) స్టైలింగ్ ను అందిపుచ్చుకోబోతోంది. టెస్ట్ మ్యూల్ పైన ఉన్న కవర్లు లోపలి  వివరాలను దాచే ప్రయత్నం చేసినా, భవిష్యత్తులో ఈ మోడల్ ఎలా ఉండబోతుందో స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది.

బయటి డిజైన్ లో మార్పులు

కొత్త థార్ తన క్లాసిక్ బాక్సీ రూపాన్ని అలాగే ఉంచుకున్నప్పటికీ, ఎక్స్‌టీరియర్ లో కొన్ని మేజర్ మార్పులు జరిగాయి. ముఖ్యంగా ముందు భాగంలో సర్క్యులర్ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, రాక్స్ మోడల్‌ను పోలి ఉండే సి-షేప్ (C-shaped) ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు ఉన్న ట్రెడిషనల్ ఏడు-స్లాట్ల గ్రిల్‌కు బదులుగా, ఇప్పుడు డబుల్-స్టాక్డ్ ఆరు-స్లాట్ల గ్రిల్ అమర్చారు. ఇది కారుకు మరింత మోడ్రన్ లుక్ ఇస్తుంది. రాక్స్ నుండి ఇన్స్పైర్ అయిన‌ 19-అంగుళాల అలాయ్ వీల్స్, వెనుక వైపు రివైజ్డ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్ సిగ్నేచర్ దీని ప్రత్యేకతను చాటుతాయి.

లగ్జరీ ఇంటీరియర్, ఫీచర్లు

క్యాబిన్ లోపలి భాగం గురించి అధికారిక వివరాలు తెలియకపోయినా, రాక్స్ స్థాయి ఫినిషింగ్ ఉంటుందని ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఫ్రంట్ పవర్ విండోస్, ఆటో-డిమ్మింగ్ రియర్ వ్యూ మిర్రర్ వంటి సౌకర్యాలు ఇందులో ఉండే అవకాశం ఉంది. వీటితో పాటు పవర్-ఫోల్డింగ్ ఓఆర్‌వీఎంలు (ORVMs), పుష్-బటన్ స్టార్ట్‌తో కూడిన కీలెన్ ఎంట్రీ, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వంటి ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లో కూడా భారీ మార్పులు జరగనున్నాయి. పెద్ద టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో కూడిన అడ్వాన్స్‌డ్ లేఅవుట్ వచ్చే ఛాన్స్ ఉంది.

ఇంజిన్, పవర్ వివరాలు

మెకానికల్ పరంగా చూస్తే, ప్రస్తుత పవర్‌ట్రైన్ ఆప్షన్లనే మహీంద్రా కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఇందులో 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్, 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంటాయి. ఇవి మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి. ఆఫ్-రోడ్ ప్రియుల కోసం 4x4 పవర్‌ట్రైన్ తో పాటు రోజువారీ వాడకానికి అనువైన ఆర్‌డబ్ల్యూడీ (RWD) ఆప్షన్లను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. త్వరలోనే ఈ సరికొత్త థార్ ఇండియన్ రోడ్లపై సందడి చేయనుంది.

Frequently Asked Questions

2026 మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్‌లో ఎలాంటి డిజైన్ మార్పులు ఉన్నాయి?

కొత్త థార్‌లో సర్క్యులర్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, సి-షేప్ ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, డబుల్-స్టాక్డ్ ఆరు-స్లాట్ల గ్రిల్‌తో పాటు 19-అంగుళాల అలాయ్ వీల్స్, రివైజ్డ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు ఉంటాయి.

థార్ ఫేస్‌లిఫ్ట్‌లో ఎలాంటి ఇంటీరియర్ ఫీచర్లు ఆశించవచ్చు?

వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఫ్రంట్ పవర్ విండోస్, ఆటో-డిమ్మింగ్ రియర్ వ్యూ మిర్రర్, పవర్-ఫోల్డింగ్ ORVMలు, కీలెన్ ఎంట్రీ, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వంటి సౌకర్యాలు ఉండే అవకాశం ఉంది.

కొత్త మహీంద్రా థార్‌లో ఏ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి?

ప్రస్తుత 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్, 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు కొనసాగే అవకాశం ఉంది. ఇవి మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో లభిస్తాయి.

థార్ ఫేస్‌లిఫ్ట్‌లో 4x4 తో పాటు ఇతర డ్రైవ్‌ట్రైన్ ఆప్షన్లు ఉంటాయా?

ఆఫ్-రోడ్ ప్రియుల కోసం 4x4 పవర్‌ట్రైన్ తో పాటు, రోజువారీ వాడకానికి అనువైన ఆర్‌డబ్ల్యూడీ (RWD) ఆప్షన్లను కూడా కంపెనీ ఆఫర్ చేయనుంది.

టాప్ హెడ్ లైన్స్

కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!
మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?
మహీంద్రా కొత్త కారు BE 07 ఇంటీరియర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది - ఫోటోలు లీక్!
E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
E20 పెట్రోల్‌ కలుషిత ఇంధనమేనా? దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలింది?
Ducati Monster V2 vs Triumph Street Triple 765 RS - 111hp vs 130hp.. ధర, పవర్, టార్క్‌లో ఏది బెస్ట్?
ట్రయంఫ్‌ స్ట్రీట్‌ ట్రిపుల్‌ 765 RS vs డుకాటి మాన్‌స్టర్‌ V2 - రేటు రూ.1 లక్ష తక్కువైనా 'పవర్‌'లో అదరగొడుతోంది!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget