అన్వేషించండి

కియా సెల్టోస్‌ కొత్త జనరేషన్‌నా? టాటా సియెరా రీఎంట్రీనా? టాప్‌ మోడల్‌ ఫీచర్లలో ఏది హెవీ వెయిట్‌?

2026 కియా సెల్టోస్‌ & కొత్త టాటా సియెరా టాప్‌ ట్రిమ్‌లలో - ఫీచర్ల పరంగా ఏ కారు ముందుంది? ట్రిపుల్‌ స్క్రీన్‌ సెటప్‌ నుంచి సేఫ్టీ, కంఫర్ట్‌, టెక్నాలజీ వరకు అన్నింటినీ వివరంగా ఇక్కడ తెలుసుకోండి.

Kia Seltos Top Variant Features: ఇండియాలో, మిడ్‌సైజ్‌ SUV సెగ్మెంట్‌లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పుడు ఈ సెగ్మెంట్‌లో రెండు హాట్‌ సెల్లింగ్‌ మోడళ్లు ఉన్నాయి - 2026 కియా సెల్టోస్‌ కొత్త జనరేషన్ & కొత్త టాటా సియెరా. ఈ రెండూ టాప్‌ ట్రిమ్‌లలో ఫీచర్లు గట్టిగానే ఇస్తున్నాయి. అయితే, యూజర్ల దృష్టిలో చూసుకుంటే ఏ కారు టాప్‌ వేరియంట్‌ ఎక్కువ విలువను ఇస్తుంది?.

ఎక్స్‌టీరియర్‌ డిజైన్‌ & లైటింగ్‌ ఫీచర్లు

రెండు SUVలు పూర్తిగా LED లైటింగ్‌ సెటప్‌తో వస్తాయి. అయితే టాటా సియెరాలో రియర్‌ ఫాగ్‌ లాంప్స్‌, అన్ని డోర్లలో పుడ్ల్‌ లైట్స్‌ ఉంటాయి, ఇవి సెల్టోస్‌ 2026 మోడల్‌లో లేవు.

వీల్స్‌ విషయానికి వస్తే... సియెరాలో 19-అంగుళాల అల్లాయ్స్‌ ఉన్నాయి, సెల్టోస్‌కు 18-అంగుళాల అల్లాయ్స్‌ ఇచ్చారు. అంటే రోడ్‌ ప్రెజెన్స్‌లో సియెరాకే ఒక పాయింట్‌ ఎక్కువ.

కానీ, సెల్టోస్‌లో ఉన్న ప్రత్యేక ఫీచర్‌ ఏమిటంటే - ORVM (బయటి అద్దం) అడ్జస్ట్‌మెంట్‌ డ్రైవర్‌ సీట్‌ మెమరీ ఫంక్షన్‌తో సింక్‌ అవుతుంది. సియెరాలో సీట్‌ మెమరీ ఉన్నా, అది ORVMలకు కనెక్ట్‌ కాదు.

ఇంటీరియర్‌, స్క్రీన్‌లు & టెక్నాలజీ

రెండు SUVలు ట్రిపుల్‌-స్క్రీన్‌ లేఅవుట్‌తో వస్తాయి.

సియెరా: 12.3-అంగుళాల ఇన్‌ఫోటైన్‌మెంట్‌, 12.3-అంగుళాల ప్యాసింజర్‌ డిస్‌ప్లే, 10.25-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌.

సెల్టోస్‌: 12.3-అంగుళాల ఇన్‌ఫోటైన్‌మెంట్‌, 12.3-అంగుళాల డ్రైవర్‌ డిస్‌ప్లే, మధ్యలో 5-అంగుళాల క్లైమేట్‌ కంట్రోల్‌ స్క్రీన్‌.

స్క్రీన్‌ల పరంగా చూస్తే ప్యాసింజర్‌ డిస్‌ప్లే ఉన్న సియెరా మరింత ప్రీమియంగా కనిపిస్తుంది.

సెల్టోస్‌లో HUD (Head-Up Display) టాప్‌ మోడల్‌లో స్టాండర్డ్‌గా ఇస్తున్నారు. అయితే, సియెరాలో HUD కేవలం లోయర్‌ ట్రిమ్‌లలో మాత్రమే ఉంటుంది, ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే.

డ్రైవర్‌ సీట్‌ అడ్జస్ట్‌మెంట్‌ విషయానికి వచ్చేసరికి, సెల్టోస్‌ ఆప్షన్లు కొంచెం ఎక్కువ. సియెరాలో కూడా మంచి రేంజ్‌ ఉన్నందున రోజువారీ వాడకానికి ఇది పెద్ద లోటు అనిపించదు.

సియెరా ఆడియో సిస్టమ్‌లో స్పీకర్లు ఎక్కువ, ఇది మ్యూజిక్‌ లవర్స్‌ కోసం పెద్ద హైలైట్‌. అదనంగా ఎయిర్‌ ప్యూరిఫియర్‌, కూల్డ్‌ గ్లౌవ్‌ బాక్స్‌ కూడా సియెరాలో స్టాండర్డ్‌. ఇవి రెండూ సెల్టోస్‌ టాప్‌ ట్రిమ్‌లో లేవు.

డ్రైవ్ మోడ్స్‌, కంఫర్ట్‌

రెండు టాప్‌ ట్రిమ్‌లూ డ్రైవ్‌ & టెరైన్‌ మోడ్‌లతో వస్తాయి. అయితే సెల్టోస్‌లో డ్రైవ్‌ మోడ్స్‌ ఆప్షన్లు ఎక్కువ. 

ప్యాడిల్‌ షిఫ్టర్లు, అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌, ఐడిల్‌ స్టార్ట్‌/స్టాప్‌ - ఇవి రెండు SUVల్లో స్టాండర్డ్‌గానే ఉన్నాయి.

సేఫ్టీ విషయంలో రెండింటికీ:

6 ఎయిర్‌బ్యాగ్స్‌

360-డిగ్రీ కెమెరా

ఫ్రంట్‌, రియర్‌ పార్కింగ్‌ సెన్సర్లు

ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌

అంటే సేఫ్టీ లెవల్లో రెండూ దాదాపు సమానమే.

ఏ ట్రిమ్‌ ఎంచుకోవాలి?
ధరలు ఇంకా ప్రకటించలేదు కాబట్టి తుది నిర్ణయం చెప్పడం ఇప్పుడే కష్టం. కానీ కాగితాల మీద చూసుకుంటే... ప్యాసింజర్‌ డిస్‌ప్లే, కూల్డ్‌ గ్లౌవ్‌ బాక్స్‌, ఎయిర్‌ ప్యూరిఫియర్‌, ఎక్కువ స్పీకర్లు వల్ల సియెరా టాప్‌ ట్రిమ్‌ కొంచెం అడ్వాంటేజ్‌లో ఉంది. సెల్టోస్‌ పూర్తిగా వెనుకబడలేదు - HUD, అధిక సీట్‌ అడ్జస్ట్‌మెంట్‌, అగ్రెసివ్‌ డిజైన్‌ వంటివి దీనికి ప్లస్‌. ఫీచర్ల పరంగా మాత్రమే చూస్తే సియెరా కొంచెం ముందంజలోనే ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?
MG Windsor EVతో 17,500 కి.మీ. ప్రయాణం.. లాంగ్ జర్నీ సమయంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు!
MG Windsor EV రివ్యూ.. 17,500 కి.మీ. ప్రయాణించాక ఈ ఎలక్ట్రిక్ కారులో కనిపించిన ప్లస్‌లు, మైనస్‌లు!
కొత్త బైక్ కొనేవాళ్లకు అదిరిపోయే అప్‌డేట్.. క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్‌తో వచ్చిన Xtreme 250R Carbon
దసరా కానుకగా Hero Xtreme 250R Carbon.. TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో కొత్త బైక్ లాంచ్‌

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Keerthy Suresh : లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
కొత్త బైక్ కొనేవాళ్లకు అదిరిపోయే అప్‌డేట్.. క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్‌తో వచ్చిన Xtreme 250R Carbon
దసరా కానుకగా Hero Xtreme 250R Carbon.. TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో కొత్త బైక్ లాంచ్‌
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Embed widget