2024 Kawasaki Z900: ఈ బైక్ కొనాలంటే రూ.10 లక్షలు పెట్టాల్సిందే - సూపర్ బైక్ లాంచ్ చేసిన కవాసకి!
New Kawasaki Z900: కవాసకి జెడ్900 కొత్త బైక్ మార్కెట్లో లాంచ్ అయింది. దీని ఎక్స్ షోరూం ధర రూ.9.29 లక్షలుగా ఉంది.
2024 Kawasaki Z900 Launched: కవాసకి భారతదేశంలో రూ. 9.29 లక్షల (ఎక్స్ షోరూమ్) ధరతో అప్‌డేట్ జెడ్900 బైక్‌ను విడుదల చేసింది. 2023 మోడల్‌తో పోలిస్తే ఈ బైక్‌లో పెద్దగా మార్పులు లేవు. కానీ దీని ధర ఇప్పుడు రూ.9,000 పెరిగింది.
కవాసకి జెడ్900 ఇంజిన్ ఇలా...
కవాసకి జెడ్900లో లిక్విడ్ కూల్డ్ 948 సీసీ ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్ యూనిట్‌ను అందించారు. ఈ ఇంజిన్ 9,500 ఆర్పీఎం వద్ద 125 హెచ్‌పీ, 7,700 ఆర్పీఎం వద్ద 98.6 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మృదువైన ఇంజన్ అసిస్ట్, స్లిప్ క్లచ్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది. అయినప్పటికీ ఇందులో బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ అందించలేదు. ముఖ్యంగా ఈ సెగ్మెంట్‌లోని చాలా మోడళ్లలో ఈ ఫీచర్ ఉన్నప్పటికీ జెడ్900 ఇప్పటికీ ఎలక్ట్రానిక్స్‌కు బదులుగా ఓల్డ్ స్కూల్ కేబుల్ థ్రోటెల్‌ను ఉపయోగిస్తుంది.
హార్డ్‌వేర్ ఎలా ఉంది?
ఈ కవాసకి మోడల్‌లో ఫోర్ సిలిండర్ ఇంజిన్‌ను స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్‌లో అమర్చారు. ఇది సస్పెన్షన్ కోసం యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్క్, మోనోషాక్ రియర్ యూనిట్‌ను పొందుతుంది. దీన్ని ప్రీలోడ్, రీబౌండ్ రెండింటికీ ఉపయోగించవచ్చు. బ్రేకింగ్ విషయానికి వస్తే... ముందు భాగంలో 300 మిల్లీమీటర్ ట్విన్ డిస్క్‌లు అందించారు. వెనుకవైపు సింగిల్ 250 మిల్లీమీటర్ డిస్క్ యూనిట్ ఉంది.
ఫీచర్లు ఇలా...
కవాసకి ట్విన్ కలర్ టీఎఫ్‌టీ డాష్‌ని 'రైడియాలజీ' యాప్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌కి లింక్ చేయవచ్చు. నోటిఫికేషన్‌లు, నావిగేషన్ అలర్ట్‌లను స్వీకరించడానికి ఉపయోగించవచ్చు. రెండు పవర్ మోడ్‌లు, మూడు రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ కోసం మూడు లెవల్స్, నాన్ స్విచబుల్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌తో పాటు దీన్ని ఎలక్ట్రానిక్స్ సూట్‌గా మార్చాయి.
ధర ఎంత? పోటీ వేటితో?
రూ. 9.29 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో కవాసకి జెడ్900 ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ (రూ. 10.17 లక్షలు)తో పోటీ పడుతోంది. ముంబైలో కవాసకి ఆన్ రోడ్ ధర రూ. 12.72 లక్షలు, తేలికైన, ఎక్కువ మొబిలిటీ ఎనేబుల్డ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ ధర రూ. 12.36 లక్షలుగా ఉంది. ఎందుకంటే 1000 సీసీ కవాసకి... 765 సీసీ ట్రయంఫ్ కంటే భిన్నమైన పన్ను పరిధిలోకి వస్తుంది.
మరోవైపు మహీంద్రా తన ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్‌ను మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఇది రానున్న కొన్ని వారాల్లో భారతీయ మార్కెట్లోకి రానుంది. ఈ ప్రధాన అప్‌డేటెడ్ మోడల్‌ను పరిచయం చేయడానికి ముందు, ఇప్పటికే ఉన్న ఎక్స్‌యూవీ300 లైనప్‌ను "ర్యాంప్ డౌన్" చేయనున్నట్లు మహీంద్రా ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ఎక్స్‌యూవీ300 లైనప్ డిమాండ్‌కు అనుగుణంగా సర్దుబాటు చేయనున్నారన్న మాట. ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీలో ప్రస్తుతం 16 పెట్రోల్, తొమ్మిది డీజిల్ వేరియంట్‌లు ఉన్నాయి. ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ వేరియంట్లు, పవర్‌ట్రెయిన్ లైనప్ గురించి సమాచారం ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులో లేదు. ప్రస్తుతం ఉన్న ఎక్స్‌యూవీ300 బుకింగ్ కెపాసిటీ కాస్త తగ్గనుందని కంపెనీ ప్రకటించింది. ఇందులో ప్రస్తుతం తక్కువ వేరియంట్లే అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌యూవీ300, ఎక్స్‌యూవీ400 ఈవీలు ప్రస్తుతం 9,000 కంటే తక్కువ పెండింగ్ బుకింగ్‌లను కలిగి ఉండటం విశేషం. ఇవి అప్‌డేట్ చేసిన ఎస్‌యూవీ వచ్చే సమయానికి క్లియర్ అవుతాయని అంచనా.