కేవలం రూ.6 లక్షల్లోనే కొనగలిగే 10 కార్లు ఇవే - మారుతిని ఎవరూ కొట్టలేరబ్బా!
రూ.10 లక్షల లోపు భారత మార్కెట్‌లో లభిస్తున్న అత్యంత చౌకైన 10 కార్ల వివరాలు ఇవే. ధరలు, మైలేజ్, వేరియంట్లు తెలుసుకుని మీ బడ్జెట్‌కు సరిపోయే కారు ఎంచుకోండి.

Cheapest Cars Under 10 Lakh: భారత కార్ మార్కెట్‌లో ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ ఎప్పటి నుంచో కీలక పాత్ర పోషిస్తోంది. మొదటిసారి కారు కొనుగోలు చేసేవారు, చిన్న కుటుంబాలు, రోజువారీ అవసరాలకు ఉపయోగపడే కారు కోసం చూసేవారు ఎక్కువగా ఈ సెగ్మెంట్ వైపే మొగ్గు చూపుతుంటారు. 2025 సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం GST రేట్లలో మార్పులు చేయడం ఎంట్రీ లెవల్ కార్ కొనుగోలుదారులకు మరింత ఊరట ఇచ్చింది. దీంతో బడ్జెట్ కార్ల సెగ్మెంట్‌లో డిమాండ్ మళ్లీ పెరిగింది.
ఇప్పుడు భారత మార్కెట్‌లో అమ్మకంలో ఉన్న అత్యంత చౌకైన 10 కార్లు ఇవే. వీటిలో మారుతి సుజుకి బ్రాండ్ ఆధిపత్యం మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది.
10. Hyundai Grand i10 Nios
ఈ లిస్ట్‌లో 10వ స్థానంలో ఉన్నది హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్. స్టైలిష్ డిజైన్, కంఫర్ట్ ఫీచర్లతో ఈ కారు పట్టణ వినియోగానికి బాగా సరిపోతుంది.
ధర (ఎక్స్-షోరూమ్): రూ.5.47 లక్షల నుంచి రూ.7.92 లక్షల వరకు
మైలేజ్ (ARAI): MT – 16 kmpl | AMT – 18 kmpl
9. Maruti Suzuki Ignis
యూత్ ఫ్రెండ్లీ డిజైన్, నమ్మకమైన ఇంజిన్‌తో ఇగ్నిస్ మంచి ఎంపికగా నిలుస్తోంది.
ధర (ఎక్స్-షోరూమ్): రూ.5.35 లక్షల నుంచి రూ.7.55 లక్షల వరకు
మైలేజ్: MT/AMT – 20.89 kmpl
8. Maruti Suzuki Eeco
కుటుంబ అవసరాలు, చిన్న వ్యాపారాల కోసం ఎక్కువగా కొనుగోలు చేసే మోడల్ ఇదే.
ధర (ఎక్స్-షోరూమ్): రూ.5.21 లక్షల నుంచి రూ.6.36 లక్షల వరకు
మైలేజ్: పెట్రోల్ – 19.71 kmpl | CNG – 26.78 km/kg
7. Maruti Suzuki Wagon R
ఎక్కువ హెడ్‌రూమ్, మంచి మైలేజ్‌తో వాగన్ ఆర్ ఎప్పటికీ ఫేవరెట్.
ధర (ఎక్స్-షోరూమ్): రూ.4.99 లక్షల నుంచి రూ.6.95 లక్షల వరకు
మైలేజ్: పెట్రోల్ – 23 నుంచి 25 kmpl వరకు | CNG – 34.05 km/kg
6. Citroen C3
యూరోపియన్ టచ్‌తో కంఫర్ట్ రైడ్‌ను ఇష్టపడేవారికి సిట్రోయెన్ C3 మంచి ఎంపిక.
ధర (ఎక్స్-షోరూమ్): రూ.4.8 లక్షల నుంచి రూ.9.05 లక్షల వరకు
మైలేజ్: 19.3 kmpl వరకు
5. Maruti Celerio
ఈ సెగ్మెంట్‌లో అత్యుత్తమ మైలేజ్ ఇచ్చే కార్లలో సెలెరియో ముందుంటుంది.
ధర (ఎక్స్-షోరూమ్): రూ.4.7 లక్షల నుంచి రూ.6.73 లక్షల వరకు
మైలేజ్: AMT – 26.68 kmpl | CNG – 34.43 km/kg
4. Tata Tiago
సేఫ్టీకి ప్రాధాన్యం ఇచ్చే వారికి టియాగో సరైన ఎంపిక.
ధర (ఎక్స్-షోరూమ్): రూ.4.57 లక్షల నుంచి రూ.7.82 లక్షల వరకు
మైలేజ్: పెట్రోల్ – 19 kmpl | CNG – 28.06 km/kg
3. Renault Kwid
SUV స్పూర్తితో రూపొందించిన డిజైన్, తక్కువ ధరే క్విడ్ ప్రధాన బలం.
ధర (ఎక్స్-షోరూమ్): రూ.4.3 లక్షల నుంచి రూ.5.99 లక్షల వరకు
మైలేజ్: AMT – 22.5 kmpl
2. Maruti Suzuki Alto K10
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి.
ధర (ఎక్స్-షోరూమ్): రూ.3.7 లక్షల నుంచి రూ.5.45 లక్షల వరకు
మైలేజ్: పెట్రోల్ – 24.9 kmpl | CNG – 33.40 km/kg
1. Maruti Suzuki S-Presso
భారత మార్కెట్‌లో ప్రస్తుతం లభిస్తున్న అత్యంత చౌక కారు ఇదే.
ధర (ఎక్స్-షోరూమ్): రూ.3.5 లక్షల నుంచి రూ.5.25 లక్షల వరకు
మైలేజ్: AMT – 25.3 kmpl | CNG – 32.73 km/kg
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















