అన్వేషించండి

నిద్ర లేవగానే అద్దంలో చూసుకుంటున్నారా? ఇక అంతే సంగతులు!

ఉదయం నిద్రలేవగానే అద్దంలో చూసుకుని మురిసిపోతున్నారా? అది అంత మంచిది కాదు.

ఏమూడ్ లో నిద్ర లేస్తామనే దాని మీద ఆరోజు ఎలా గడుస్తుందనేది ఆధారపడి ఉంటుంది. అందుకే శుభ సమయంలో నిద్ర లేవాలని అంటారు. వీలైతే బ్రహ్మీ ముహూర్తంలో నిద్ర లేస్తే మరీ మంచిది. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి అలా అంత ఉదయాన్నే నిద్రలేచే అవకాశం చాలా మందికి ఉండడం లేదు. అటువంటప్పుడు కనీసం కొన్ని మంచి అలవాట్లు చేసుకోవడం వల్ల జీవితం సాఫీగా గడిపేందుకు అవకాశం ఉంటుందే తప్ప పెద్ద నష్టం లేదు. కొన్ని సులభమైన నియమాలే పాటించడంలో పెద్దగా ఇబ్బంది లేనపుడు పాటించడం మంచిదే కదా.  అటువంటి కొన్ని మంచి అలవాట్ల గురించి తెలుసుకుందాం.

రోజు మంచి శకునంతో ప్రారంభం అయిందంటే ఆరోజు శుభంగా గడుస్తుందని నమ్ముతాం అందరం. ఆరోజు అనుకున్న పనులన్నీ పూర్తిచెయ్యగలమన్న నమ్మకం వస్తుంది. అయితే కొన్ని పనులు పొద్దున్నే చెయ్యడం లేదా కొన్ని వస్తువులు ఎదురుపడడం అపశకునంగా భావిస్తారు. అలాంటివి జరిగినపుడు అశుభం జరుగుతుందని నమ్ముతారు.  

అద్దంలో చూడడం

ఉదయం లేవగానే అద్దం చూసుకోకూడదు. కొంత మందికి ఈ అలవాటు ఉంటుంది. లేవగానే తలదువ్వుకోవడం వంటివి చేస్తుంటారు. ఇలా చెయ్యకూడదు. ఇందువల్ల నెగెటివిటీ పెరుగుతుంది. లేచి కళ్లు తెరవగానే అరచేతులు చూసుకోవడం మంచి అలవాటు. తర్వాత ముఖం కడుకున్న తర్వాత అద్దం చూసుకొని తలదువ్వుకోవాలి.

ఎంగిలి పాత్రలు

పొద్దున్న లేవగానే ఎంగిలి పాత్రల మీద దృష్టి పడడం అసలు మంచిది కాదు. చాలా మంది రాత్రి బాగా పొద్దు పోయిందనో లేక అలసి పోయామనో రాత్రి భోజనం తర్వాత పాత్రలు శుభ్రం చేసుకోవడం లేదా వాషింగ్ కి పెట్టుకోవడం చెయ్యరు. అది ఎంత మాత్రమూ మంచిది కాదు.  అందుకే రాత్రి తప్పని సరిగా కిచెన్ శుభ్రం చేసుకుని పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎంగిలి పాత్రలు ఉదయాన్నే చూడడం నెగెటివిటిని ప్రేరేపిస్తుంది. ఆరోజు వ్యర్థం అవుతుంది.

చెడిపోయిన గడియారం

నిద్ర లేవగానే పనిచేయని గడియారం వైపు చూడడం కూడా అంత మంచిది కాదు. నిజానికి చెడిపోయిన గడియారం పెట్టుకోవడం కూడా వాస్తు దోషంగా పరిగణిస్తారు. చెడిపోయిన గడియారాలు ఇంట్లో ఉంటే అభివృధ్ది ప్రతిబంధకాలుగా వాస్తు వివరిస్తుంది. అటువంటి గడియారాలను ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో పెట్టుకోవద్దు. కాబట్టి ఇంట్లో అనుకోకుండా గడియారం చెడిపోతే దాన్ని తిరగేసి పెట్టడం మంచిది.

 క్రూరమృగాలు

ఇంట్లో సింహాలు, పులుల వంటి హింసాత్మక జంతువుల చిత్రాలు లేదా బొమ్మలు పెట్టుకోవడం అంత మంచిది కాదు. వాస్తు ప్రకారం ఇవి ఇంట్లో అశాంతికి, పోట్లాటలకు కారణం అవుతాయి. కాబట్టి పాములు, పులులు, సింహాల వంటి కౄరమైన మృగాల చిత్రాలు, విగ్రహాలు ఇంట్లో పెట్టుకోకూడదు. ఉదయాన్నే ఇలాంటివి చూస్తే ఆరోజంతా పాడైపోతుంది.

చెత్తబుట్ట

పొద్దున్న లేస్తూనే చెత్తబుట్ట కనిపించడం అంత మంచి శకునం కాదు. కాబట్టి చెత్తబుట్ట ఎప్పుడూ కనిపించని ప్రదేశంలో పెట్టుకోవాలి.

రోజూ నిద్ర లేవగానే రెండు చేతులు చూసుకొని మంచం దిగాలి. తర్వాత ముఖం కడుక్కుని అద్దం చూసుకుని తలదువ్వుకుని రోజు వారీ పనుల్లో పడడం అన్నింటి కంటే ఉత్తమం.

టాప్ హెడ్ లైన్స్

అక్టోబర్ 29 రాశిఫలాలు: ధనుస్సు, మకరం, కుంభం, మీనం - అదృష్టం మీ వెంటే!
అక్టోబర్ 29 రాశిఫలాలు: ధనుస్సు, మకరం, కుంభం, మీనం - అదృష్టం మీ వెంటే!
అక్టోబర్ 29 రాశిఫలాలు: సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల వారికి అదృష్టం ఎలా ఉంది?
అక్టోబర్ 29 రాశిఫలాలు: సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల వారికి అదృష్టం ఎలా ఉంది?
అక్టోబర్ 29 రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం...మీ రాశికి ఎలాంటి ఫలితాలు?
అక్టోబర్ 29 రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం...మీ రాశికి ఎలాంటి ఫలితాలు?
నవంబర్ 2026 గ్రహ సంచారం: 5 రాశుల వారికి సంపద, స్వర్ణ యోగం, రాజులా వెలుగుతారు!
నవంబర్ 2026 గ్రహ సంచారం: 5 రాశుల వారికి సంపద, స్వర్ణ యోగం, రాజులా వెలుగుతారు!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Gottipati Ravi Kumar: అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
Arnab Effect On AP: ఏపీపై విరుచుకుపడిన 'అర్నబ్‌' తుపాను... భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. నిలిచిన రవాణా సేవలు
ఏపీపై విరుచుకుపడిన 'అర్నబ్‌' తుపాను... భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. నిలిచిన రవాణా సేవలు
Flights Cancelled: శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Telangana Drought Mandals: తెలంగాణలో కరవు కోరలు.. 31 జిల్లాల్లో 365 మండలాల్లో తీవ్ర ప్రభావం.. రూ.20 వేల కోట్ల కేంద్ర ప్యాకేజీ కోసం అభ్యర్థన
తెలంగాణలో కరవు కోరలు.. 31 జిల్లాల్లో 365 మండలాల్లో తీవ్ర ప్రభావం.. రూ.20 వేల కోట్ల కేంద్ర ప్యాకేజీ కోసం అభ్యర్థన
AP Local Body Elections: ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
Embed widget