Trigrahi Yog August 2024: త్రిగ్రాహి రాజయోగం..ఈ రాశులవారికి ఆకస్మిక ధనలాభం, కుటుంబంలో సంతోషం!
Trigrahi Yog August 2024: ఏడాది తర్వాత సింహరాశిలో త్రిగ్రాహియోగం ఏర్పడుతోంది. ఈ ప్రభావంతో కొన్ని రాశులవారికి అన్నీ శుభసూచకాలే.. అత్యంత యోగాన్ని పొందే ఆ రాశులేంటో తెలుసుకుందాం..
Trigrahi Yog August 2024: సంవత్సరం తర్వాత సింహ రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. ఈ నెలలో బుధుడు, శుక్రుడు, సూర్యుడు ముగ్గురూ ఒకే రాశిలో సంచరిస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి శుభఫలితాలున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఏడాదిలో 12 రాశులు మారుతూ సంచరిస్తుంది. ఓ రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ ప్రభావం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రతి రాశిపై ఉంటుంది. రాశుల్లో ఆయా గ్రహాల సంచార స్థానాన్ని బట్టి అనుకూల, ప్రతికూల, మిశ్రమ ఫలితాలుంటాయి. ఆగస్టు నెలలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఒకేరాశిలో ప్రవేశించడంతో...త్రిగ్రాహి, బుధాదిత్య, సమసప్తక్ రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగాలు కొన్ని రాశులవారికి శుభఫలితానిస్తున్నాయి.
సూర్యుడు
ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్న సూర్యుడు...ఆగస్టు 17న సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు.. నెల రోజుల పాటూ ఇదే రాశిలో ఉంటాడు..
బుధుడు
బుధుడు ప్రస్తుతం సింహంలో తిరోగమనంలో ఉన్నాడు.. ఆగష్టు 22న కర్కాటకంలో ప్రవేశించి అక్కడినుంచి పది రోజుల్లో మళ్లీ సింహంలోకి అడుగుపెడతాడు...తిరిగి సెప్టెంబరు 23 వరకూ సింహ రాశిలోనే సంచరిస్తాడు.
శుక్రుడు
ప్రస్తుతం సింహ రాశిలోనే ఉన్న శుక్రుడు ఈనెల 25 తర్వాత కన్యాలోకి అడుగుపెడతాడు...
ఆగష్టు 17 సూర్యుడు సింహరాశిలో ప్రవేశించే సమయానికి బుధుడు, శుక్రుడు సింహరాశిలోనే ఉంటారు..ఈ సమయంలో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం వల్ల కొన్ని రాశులవారు లాభపడతారు.
Also Read: పాములు కలలోకి వస్తున్నాయా, సర్పదోషం వెంటాడుతోందా...ఆగష్టు 08 నాగుల చవితి రోజు ఇలా చేయండి!
మేష రాశి
త్రిగ్రాహి యోగం వల్ల మేషరాశి వారి జీవితాల్లో గణనీయమైన మార్పులు వస్తాయి. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కార్యాలయంలో మీ ఇమేజ్ పెరుగుతుంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. కెరీర్లో నూతన విజయాలు సాధిస్తారు.
సింహ రాశి
సింహ రాశి వారికి త్రిగ్రాహి యోగం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన ప్రతి పనిలో అదృష్టం కలిసొస్తుంది. ప్రేమ సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. వస్తుసౌఖ్యాలు, సంపదలు పెరుగుతాయి.
కన్యా రాశి
త్రిగ్రాహి యోగం వల్ల కన్యారాశివారు కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగులు నూతన బాధ్యతలు అందుకుంటారు. ఎప్పటినుంచో అందాల్సిన డబ్బు చేతికొస్తుంది. విద్యార్థులు ఘనవిజయం సాధిస్తారు.
వృశ్చిక రాశి
సూర్యుడు, బుధుడు, శుక్రుడు కలిసి ఉండడం వల్ల వృశ్చిక రాశి వారికి విపరీతమైన ప్రయోజనాలు లభిస్తాయి. ఉద్యోగ అన్వేషణ పూర్తవుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. విలాసవంతమైన జీవితం గడుపుతారు.
Also Read: సింహ రాశిలో బుధుడి తిరోగమనం..రెండు వారాలపాటూ ఈ రాశులవారికి ఏం చేసినా వ్యతిరేక ఫలితాలే!
ధనుస్సు రాశి
త్రిగ్రాహి రాజయోగం వల్ల ధనస్సు రాశివారు ఆకస్మిత ధనలాభం పొందుతారు. అదృష్టం కలిసొస్తుంది. ఉద్యోగులకు మంచి పురోభివృద్ధి ఉంటుంది. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల నిర్వహణకు సన్నాహాలు చేస్తారు. ధార్మిక ప్రదేశాలు సందర్శిస్తారు. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు విజయవంతం అవుతాయి.
మకర రాశి
త్రిగ్రాహి రాజయోగం వల్ల మకర రాశివారు ధనలాభం పొందుతారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. నూతన ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయం. వ్యాపారులు లాభపడతారు.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.