Today Horoscope In Telugu: ఏఫ్రిల్ 03 రాశి ఫలాలు (03/04/2024): ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త
Horoscope Prediction 3rd April 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Daily Horoscope for April 3rd 2024:
మేష రాశి
ఈ రాశి వారు ఈరోజు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధు మిత్రుల నుంచి శుభ కార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. అవసరానికి స్నేహితుల నుంచి సహాయం లభిస్తుంది. సంతానం, విద్యా విషయాలలో ఉత్తమ ఫలితాలు పొందుతారు.
వృషభ రాశి
ఈరోజు ఈ రాశి వారికి నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఇంట్లో కొన్ని సంఘటనలు ఆశ్యర్యం కలిగిస్తాయి. ఆర్థికంగా మరింత ఉత్సాహంగా ఉంటారు. వృత్తి, ఉద్యోగాలలో అప్రయత్నంగా అవకాశాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
మిథున రాశి
ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలు కలిసిరావు. కుటుంబంలో వివాదాలు ఏర్పడతాయి. చిన్న చిన్న విషయాలు మనసుకు బాధ కలిగిస్తాయి. దూర ప్రయాణం చేయాల్సి రావొచ్చు. వృత్తి, ఉద్యోగాలలో చికాకులు ఏర్పడే అవకాశం ఉంది.
కర్కాటక రాశి
ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. చేపట్టిన పనులలో అధికంగా కష్టపడాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మరింత నిరాశజనకంగా ఉంటుంది.
సింహ రాశి
ఈ రాశి వారు ఈరోజు సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు వల్ల లాభం కలిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో సత్పలితాలు పొందుతారు.
కన్య రాశి
ఈ రాశి వారు ఇవాళ అనుకున్న పనులను పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. వృత్తి, ఉద్యోగాలలో తగిన గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.
తులా రాశి
ఈ రాశి వారికి ఇవాళ వృత్తి, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. రుణ ప్రయత్నాలు కలిసి రావు. అన్నింట్లో ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి ఇవాళ ఆర్థిక వ్యయం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. స్థిరాస్థి వ్యవహారాలలో రాజీ ప్రయత్నాలు విఫలం అవుతాయి. కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన పనులు ఎంతో కష్టపడితేనే పూర్తి అవుతాయి.
ధనస్సు రాశి
ఈ రాశి వారికి ఈరోజు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. సంతానం, విద్యా విషయాలలో శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు.
మకర రాశి
ఈరాశి వారికి ఈరోజు ప్రయాణాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. పాత రుణాలు తీర్చడానికి కొత్త రుణాలు చేస్తారు. పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది.
కుంభ రాశి
ఈరోజు ఈ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. సొసైటీలో మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో విజయం సాధిస్తారు.
మీన రాశి
ఈరాశి వారికి ఈరోజు అకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. నూతన ఉద్యోగ విషయంలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.
Note: ఒక రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
ALSO READ: 'వార్ 2' కోసం స్పెషల్ కోర్స్‌లో జాయిన్ కాబోతున్న ఎన్టీఆర్? - రెండు వారాల్లో పూర్తిగా మేకోవర్..!