News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Supermoon 2023:సూపర్ మూన్ ప్రభావం ఏ రాశివారిపై ఎలా ఉంటుందంటే!

చందమామ ఆగస్టు 1న భూమికి దగ్గరగా ఉంటుంది. ఇది మంచిదా కాదా? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫుల్ మూన్ ప్రభావం ఏ రాశివారిపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

FOLLOW US: 
Share:

Supermoon 2023:  ఆగష్టు నెలలో రెండు పౌర్ణమిలు వచ్చాయి. ఆగష్టు 1 న కనిపించే  పౌర్ణమిని స్టర్జన్ మూన్ అని పిలుస్తారు. సాధారణ పౌర్ణమి కంటే కాస్త పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు చందమామ. చంద్రుని కక్ష్య సాధారణం కంటే భూమికి దగ్గరగా వచ్చినప్పుడు సూపర్‌మూన్ కనిపిస్తుంది. ఆగష్టు 30న వచ్చే పౌర్ణమి బ్లూ మూన్ అవుతుంది, ఇది ఆగస్టు నెలలో రెండో పౌర్ణమి. అంతకుముందు జూలై 3న ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో మొదటి సూపర్ మూన్ కనిపించింది. దీనిని 'బక్ మూన్' అన్నారు. ప్రస్తుతం ఆగష్టు 1న కనిపించే సూపర్ మూన్ కుంభరాశిలో ఉంటుంది. ఈ ప్రభావం ఏ రాశిపై ఎలా ఉంటుందో  తెలుసుకుందాం.

మేషరాశి 
కొత్త సవాళ్లను స్వీకరించడానికి లేదా కొత్త ప్రణాళికల ప్రకారం పనిచేయడానికి మేషరాశివారికి ఈ పౌర్ణమి చాలా ప్రత్యేకం. ఈసమయంలో మీరు చేపట్టే పనుల్లో శుభఫలితాలు పొందుతారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం. 

వృషభ రాశి 
ఓ సర్కిల్ కే పరిమితం అయిన మీ ఆలోచనలకు కొత్త రూపం ఇచ్చేందుకు ప్రయత్నించండి. వృషభ రాశివారికి ఈ పౌర్ణమి చాలా ప్రత్యేకం. భవిష్యత్ లో ఎలా ఉండాలి అనుకుంటున్నారో నిర్ణయం తీసుకునేందుకు ఇదే మంచి సమయం. 

మిథున రాశి
మీ ఆలోచనలు, నూతన ప్రణాళికలు అమలుచేసేందుకు ఇదే మంచి సమయం. ఎదుటివారి గురించి కాకుండా మీ గురించి మీరు ఆలోచించుకుని అడుగు ముందుకేస్తే మంచి జరుగుతుంది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మీ ఊహలు నిజమవుతాయి. 

Also Read: అమావాస్య-పౌర్ణమికి పిచ్చి ముదురుతుందా, ఆరోగ్యానికి తిథులకు సంబంధం ఏంటి!

కర్కాటక రాశి
కర్కాటక రాశివారికి ఫుల్ మూన్ పురోగతికి మార్గం చూపిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులు సూపర్ సక్సెస్ అవుతారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు.

సింహ రాశి
ఈ ఫుల్ మూన్ మీరై మీకున్న విశ్వాసాన్ని పెంచుతుంది. వ్యాపారులు మంచి లాభాలు సాధిస్తారు. ఎప్పటి నుంచో రాదు అనుకున్న డబ్బు చేతికందుతుంది. కుటుంబంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఉద్యోగంలో చాలా కాలంగా ఉన్న సమస్యలు తీరుతాయి, విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపుతారు.

తులా రాశి
తుల రాశి వారిపై ఫుల్ మూన్ అనుకూల ప్రభావం చూపిస్తోంది. ఉద్యోగులు మంచి ఫలితాలు సాధిస్తారు.వ్యాపారంలో నూతన ప్రణాళికలు అమలుచేస్తారు. ప్రేమ సంబంధాలు మెరుగ్గా ఉంటాయి

వృశ్చిక రాశి 
ఫుల్ మూన్ ప్రభాలం వల్ల వృశ్చిక రాశివారిలో వివిధ భావోద్వేగాలుంటాయి. అయితే అత్యంత సంతోషంగా ఉంటారు లేదంటే విచారంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో బాగానే ఉంటారు. పనిపై శ్రద్ధ పెడతారు. 

ధనుస్సు రాశి
ఫుల్ మూన్ ప్రభావం ధనస్సు రాశివారిపై అనుకూలంగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగంలో పురోగతికి అవకాశాలున్నాయి. అయితే కుటుంబంలో చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పడతారు. 

మకర రాశి 
చంద్రుడి ప్రభావం ఈ రాశివారిని అలసటకు గురిచేస్తుంది. అనుకున్న పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కుటుంబానికి సమయం కేటాయించాలి.

కుంభ రాశి 
కుంభ రాశివారికి ఫుల్ మూన్ అనుకూల ఫలితాలనిస్తోంది. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. రోజంతా సంతోషంగా ఉంటారు.  సమయం ,  డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెట్టండి. సామాజిక సేవలో మీ ఆసక్తిని పెంచుతుంది.

మీన రాశి 
మీనరాశివారికి సూపర్ మూన్ పురోగతికి మార్గం తెరుస్తుంది. అన్నీ అనుకూల ఫలితాలే ఉన్నాయి. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న వివాదాలకు చెక్ పెట్టేస్తారు. కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. 

Published at : 01 Aug 2023 12:40 PM (IST) Tags: Astrology Supermoon in August Effects of Full Moon and New Moon Pournami and Amavasya Sturgeon Moon 2023 supermoon how it will effect Zodiac signs supermoon horoscope in Telugu

ఇవి కూడా చూడండి

Vastu Tips in telugu: పసుపుతో ఈ 3 వాస్తు చిట్కాలు పాటిస్తే మీ ఇంటికి సంపద, శ్రేయస్సు!

Vastu Tips in telugu: పసుపుతో ఈ 3 వాస్తు చిట్కాలు పాటిస్తే మీ ఇంటికి సంపద, శ్రేయస్సు!

Pitru Paksham 2023:పితృ ప‌క్షంలో బిడ్డ పుడితే కుటుంబంలో జ‌ర‌గ‌బోయే మార్పులేంటో తెలుసా!

Pitru Paksham 2023:పితృ ప‌క్షంలో బిడ్డ పుడితే కుటుంబంలో జ‌ర‌గ‌బోయే మార్పులేంటో తెలుసా!

Batukamma 2023: బ‌తుక‌మ్మ‌ నైవేద్యాలు చాలా ఈజీగా ఇలా తయారు చేసేసుకోవచ్చు!

Batukamma 2023: బ‌తుక‌మ్మ‌ నైవేద్యాలు చాలా ఈజీగా ఇలా తయారు చేసేసుకోవచ్చు!

Bathukamma 2023: బతుకమ్మ పండుగలో 9 రోజులు ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలంటే!

Bathukamma 2023: బతుకమ్మ పండుగలో 9 రోజులు ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలంటే!

Bathukamma 2023: 'తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే' - బతుకమ్మలో పేర్చే ఈ పూలవల్ల ఎన్ని ప్రయోజనాలో!

Bathukamma 2023: 'తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే' - బతుకమ్మలో పేర్చే ఈ పూలవల్ల ఎన్ని ప్రయోజనాలో!

టాప్ స్టోరీస్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?

Cheapest 5G Phone in India: ఐటెల్ పీ55 సేల్ ప్రారంభం - దేశంలో అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.తొమ్మిది వేలలోపే!

Cheapest 5G Phone in India: ఐటెల్ పీ55 సేల్ ప్రారంభం - దేశంలో అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.తొమ్మిది వేలలోపే!

Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !

Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !

Malkajgiri News: ఎమ్మెల్యే మైనంపల్లిని చర్లపల్లి జైలుకు పంపుతా - ఆయన ప్రత్యర్థి హెచ్చరికలు

Malkajgiri News: ఎమ్మెల్యే మైనంపల్లిని చర్లపల్లి జైలుకు పంపుతా - ఆయన ప్రత్యర్థి హెచ్చరికలు