అన్వేషించండి

ఆగష్టు 28 రాశిఫలాలు - ఈ రాశులవారు ఈ రోజు సహోద్యోగులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి!

Horoscope Prediction 28 August 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for 28 August 2024 


మేష రాశి

ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఈ రోజు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రోజంతా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణ పరిస్థితులుంటాయి. అత్యవసర పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. 

వృషభ రాశి

ఈ రాశివారికి కుటుంబ పరంగా కొన్ని సమస్యలు తప్పవు. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అనుభవజ్ఞులతో సంప్రదించకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారి కల ఫలిస్తుంది. అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండండి. 
 
మిధున రాశి

ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంబంధాలలో సాన్నిహిత్యం  ఉంటుంది. పిల్లల నుంచి గుడ్ న్యూస్ వింటారు. కొన్ని ముఖ్యమైన పనులపై అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. సహోద్యోగులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. అవివాహితులు వివాహానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారు. 

Also Read: సంతానానికి ఆయుష్షు ప్రసాదించే శ్రావణ అమావాస్య/ పోలాల అమావాస్య విశిష్టత ఇదే!

కర్కాటక రాశి

మీ ప్రవర్తనను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తికాలేకపోవడంవల్ల నిరాశ చెందుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. 


సింహ రాశి

ఈ రాశివారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారి హోదా , గౌరవం పెరుగుతుంది. ఇంట్లో వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. వ్యాపారులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు శుభసమయం.  

కన్యా రాశి 

ఈ రోజు కుటుంబానికి సమయం కేటాయిస్తారు. స్నేహితుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మార్కెటింగ్ రంగానికి సంబంధించిన వారు మంచి ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగులు ప్రమోషన్ క్ సమాచారం వింటారు. ఆరోగ్యం బావుంటుంది.  

తులా రాశి

మీరు మీ బాధ్యతల పట్ల అంకితభావంతో ఉంటారు. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారి ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో సాధారణ ఫలితాలున్నాయి. గృహోపకరణాలు కొనుగోలు చేయడం పై ఆసక్తి చూపిస్తారు. ఇనుము సంబంధిత వ్యాపారం చేసేవారు నష్టపోయే అవకాశం.  

వృశ్చిక రాశి 

ఈ రోజంతా చాలా బిజీగా ఉంటారు. కొన్ని చట్టపరమైన విషయాలలో చిక్కుకునే ప్రమాదం ఉంది.  చిక్కుకుపోవచ్చు. తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయాలి. అధిక ఒత్తిడికి దూరంగా ఉండడం మంచిది.  

Also Read: 2024 లో 'అజ ఏకాదశి'ఎప్పుడొచ్చింది.. పూజా విధానం , ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి!

ధనుస్సు రాశి

కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఉద్యోగులు కార్యాలయంలో కొత్త విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టేందుకు ప్లాన్ చేసుకుంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 
 
మకర రాశి 

ఈ రాశి వ్యాపారులు మంచి ఫలితాలు పొందుతారు. నూతన పెట్టుబడులు ఇదే మంచి టైమ్. పాత విభేదాలను పరిష్కరించుకునే దిశగా అడుగు వేయండి. నూతన ఆస్తుల కొనుగోలు, అమ్మకం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. 

Also Read: తిరుమల భోజనశాలలో ఉన్న ఈ పెయింటింగ్ ఏంటో తెలుసా!
 
కుంభ రాశి

మీ గురించి కొందరు తప్పుడు ప్రచారం చేస్తారు..ఆత్మవిశ్వాసంతో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉండండి. ఉద్యోగులు తమ పనిపట్ల సీరియస్ గా ఉంటారు. మనసులో ప్రేమను వ్యక్తపరిచే ప్రయత్నం చేయండి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రాశి స్త్రీలకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి. 

మీన రాశి

ఈ రాశివారు ఈరోజు ఏ పనిలోనూ అత్యుత్సాహం ప్రదర్శించవద్దు..దానివల్ల నష్టమే కానీ లాభం ఉండదు. వ్యాపారులకు సాధారణ రోజు అవుతుంది. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు..అతిగానూ తినొద్దు. ఉద్యోగులు తమ యాజమాన్యంపట్ల కొంత అసంతృప్తిగా ఉంటారు. 

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi on Gujarat Riots: చిన్న నిప్పురవ్వ కూడా హింసకు దారి తీస్తుంది.. గుజరాత్ అల్లర్లపై మోదీ సంచలన వ్యాఖ్యలు
చిన్న నిప్పురవ్వ కూడా హింసకు దారి తీస్తుంది.. గుజరాత్ అల్లర్లపై మోదీ సంచలన వ్యాఖ్యలు
Viveka Murder Case: వివేకా హత్యకేసులో అప్రూవర్‌ దస్తగిరి భార్యపై దాడి.. కేసు నమోదు చేయలేదని ఆవేదన
వివేకా హత్యకేసులో అప్రూవర్‌ దస్తగిరి భార్యపై దాడి.. కేసు నమోదు చేయలేదని ఆవేదన
IML Tourney Winner India Masters: ఫైన‌ల్లో మెరిసిన రాయుడు.. ఐఎంఎల్ టోర్నీ భార‌త్ దే.. ఆరు వికెట్ల‌తో విండీస్ చిత్తు
ఫైన‌ల్లో మెరిసిన రాయుడు.. ఐఎంఎల్ టోర్నీ భార‌త్ దే.. ఆరు వికెట్ల‌తో విండీస్ చిత్తు
Saira Banu: 'నన్ను మాజీ భార్య అనొద్దు' - తామింకా విడాకులు తీసుకోలేదన్న రెహమాన్ సతీమణి
'నన్ను మాజీ భార్య అనొద్దు' - తామింకా విడాకులు తీసుకోలేదన్న రెహమాన్ సతీమణి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nikhil on Swayambhu Movie Update | కొంపల్లిలో ఓ రెస్టారెంట్ ను ఓపెన్ చేసిన నిఖిల్ | ABP DesamAR Rahman Wife Saira Rahman | ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన సైరా రెహ్మాన్ | ABP DesamNASA Space X Crew 10 Docking Success | సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చేందుకు రూట్ క్లియర్ | ABP DesamTDP Activist Loss life in Punganur | పెద్దిరెడ్డి ఇలాకాలో బలైపోయిన మరో టీడీపీ కార్యకర్త | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi on Gujarat Riots: చిన్న నిప్పురవ్వ కూడా హింసకు దారి తీస్తుంది.. గుజరాత్ అల్లర్లపై మోదీ సంచలన వ్యాఖ్యలు
చిన్న నిప్పురవ్వ కూడా హింసకు దారి తీస్తుంది.. గుజరాత్ అల్లర్లపై మోదీ సంచలన వ్యాఖ్యలు
Viveka Murder Case: వివేకా హత్యకేసులో అప్రూవర్‌ దస్తగిరి భార్యపై దాడి.. కేసు నమోదు చేయలేదని ఆవేదన
వివేకా హత్యకేసులో అప్రూవర్‌ దస్తగిరి భార్యపై దాడి.. కేసు నమోదు చేయలేదని ఆవేదన
IML Tourney Winner India Masters: ఫైన‌ల్లో మెరిసిన రాయుడు.. ఐఎంఎల్ టోర్నీ భార‌త్ దే.. ఆరు వికెట్ల‌తో విండీస్ చిత్తు
ఫైన‌ల్లో మెరిసిన రాయుడు.. ఐఎంఎల్ టోర్నీ భార‌త్ దే.. ఆరు వికెట్ల‌తో విండీస్ చిత్తు
Saira Banu: 'నన్ను మాజీ భార్య అనొద్దు' - తామింకా విడాకులు తీసుకోలేదన్న రెహమాన్ సతీమణి
'నన్ను మాజీ భార్య అనొద్దు' - తామింకా విడాకులు తీసుకోలేదన్న రెహమాన్ సతీమణి
Bandi Sanjay: పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ పేర్లను తొలగిస్తారా?.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ లాంటి వారి పేర్లను తొలగిస్తారా?.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Challenges KCR: హరీష్ రావు పిల్లకాకి, తాటిచెట్టులా పెరిగాడు కానీ! కేసీఆర్ వస్తే చర్చకు మేం రెడీ: సీఎం రేవంత్ రెడ్డి
హరీష్ రావు పిల్లకాకి, తాటిచెట్టులా పెరిగాడు కానీ! కేసీఆర్ వస్తే చర్చకు మేం రెడీ: సీఎం రేవంత్ రెడ్డి
AP Capital News: హడ్కో, సీఆర్‌డీఏ మధ్య ఒప్పందం - రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్ల రుణం
హడ్కో, సీఆర్‌డీఏ మధ్య ఒప్పందం - రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్ల రుణం
Samantha: ఆస్పత్రి బెడ్‌పై సమంత.? - అసలు ఏం జరిగిందంటూ ఫ్యాన్స్ ఆందోళన!
ఆస్పత్రి బెడ్‌పై సమంత.? - అసలు ఏం జరిగిందంటూ ఫ్యాన్స్ ఆందోళన!
Embed widget