స్నానం చేయకుండా పూజ చేయొచ్చా!

Published by: RAMA

నిత్య దీపారాధన చేసేవారికి..ఒక్కరోజు ఆ అవకాశం లేకపోయినా అదో వెలితిగా భావిస్తారు

ఆరోగ్యంగా ఉన్నప్పుడు సరే..అనారోగ్యంతో ఉన్నప్పుడు స్నానం చేయకూడదు కదా..మరి ఎలా?

ఇలాంటప్పుడు వచ్చే సందేహమే..స్నానం చేయకుండా పూజ చేయొచ్చా?

అనే శ్లోకం చదివి తలపై నీళ్లు చల్లుకుననా భగవంతుడికి పూజ చేయొచ్చు

అసలు అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా భగవంతుడికి పూజ చేయాలనే ఆలోచనే గొప్పది..

ఇలాంటివారికోసం కొన్ని మార్గాలు సూచిస్తున్నారు పండితులు

గంగాజలం మీద చల్లుకుని... విభూధి పెట్టుకుంటే స్నానం చేసినట్టే

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా
యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశ్శుచిః
ఈ శ్లోకం చదివి తలపై నీళ్లు చల్లుకున్నా భగవంతుడికి పూజ చేయొచ్చు

ప్రయాణాల్లో రెండు మూడు రోజులు ఉండిపోయినప్పుడు చాలామంది పండితులు ఫాలో అయ్యే విధానం ఇదే

ఒక్క రోజు పూజ చేయకపోయినా వెలితిగా భావించేవారు ఈ పద్ధతి అనుసరించవచ్చు...