Sarva Pitru Amavasya 2025: సర్వ పితృ అమావాస్య నాడు 4 శుభ యోగాలు, ఈ రాశుల వారికి ఈ రోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది!
Sarva Pitru Amavasya 2025 Date:సర్వ పితృ అమావాస్య 2025 సెప్టెంబర్ 21 ఆదివారం వచ్చింది. ఈ రోజున 4 శుభ యోగాలు ఏర్పడుతున్నాయి, దీనివల్ల 4 రాశులకు లాభం.

Sarva Pitru Amavasya 2025: భాద్రపద మాసం అమావాస్య రోజున పితృ పక్షం ముగుస్తుంది. దీనిని సర్వ పితృ అమావాస్య అని పిలుస్తారు. ఈ రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు. తర్పణాలు విడుస్తారు. బ్రాహ్మణులకు ఆహారం పెడతారు, దాన ధర్మాలు చేస్తారు. పంచబలి కర్మ చేస్తారు. ఈ ఏడాది సర్వ పితృ అమావాస్య ఆదివారం సెప్టెంబర్ 21, 2025 న వస్తుంది.
సర్వ పితృ అమావాస్య ముహూర్తం
సర్వ పితృ అమావాస్య ఆదివారం, సెప్టెంబర్ 21 ఆదివారం సూర్యోదయం సమయానికి ఉంగి. అమావాస్య తిథి సెప్టెంబర్ 20 శనివారం రాత్రి 11:41 గంటలకు ప్రారంభమవుతుంది సెప్టెంబర్ 21 ఆదివారం అర్థరాత్రి 12 గంటల 04 వరకూ ఉంది. సూర్యోదయం, సూర్యాస్తమయం రెండు సమయాల్లోనూ అమావాస్య ఉన్న ఘడియలు సెప్టెంబర్ 21 ఆదివారమే..అందుకే ఇదే రోజు పితృ అమావాస్య అవుతుంది. ఈ రోజు కుతుప ముహూర్తం మధ్యాహ్నం 11:50 నుంచి 12:38 వరకు ఉంటుంది. రోహిణి ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుంచి 01:27 వరకు ఉంటుంది.
సర్వ పితృ అమావాస్య నాడు శుభ యోగాలు
సర్వ పితృ అమావాస్య రోజున 4 శుభ యోగాలు ఏర్పడుతున్నాయి...ఇది కొన్ని రాశులవారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున శుభ యోగం, శుక్ల యోగం, సర్వార్థ సిద్ధి యోగం, గజకేసరి యోగం ఏర్పడుతున్నాయి. అదే సమయంలో, సర్వ పితృ అమావాస్య నాడు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతోంది. సర్వ పితృ అమావాస్య నాడు ఏ రాశుల వారికి పితృదేవతలు ఆశీస్సులు లభిస్తాయో తెలుసుకుందాం.
సర్వ పితృ అమావాస్య రోజున ఏ రాశుల వారికి శుభం కలుగుతుంది
వృషభ రాశి (Taurus)
వృషభ రాశి వారికి సర్వ పితృ అమావాస్య రోజు శుభప్రదంగా ఉంటుంది. మీకు పితృ దోషం నుంచి విముక్తి లభిస్తుంది... కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. గ్రహాల కలయికతో, కుటుంబ వివాదాలు ముగుస్తాయి . సంతోషం వస్తుంది. స్థిరమైన ఆస్తి లేదా ఇంటికి సంబంధించిన విషయాలలో సానుకూల ఫలితాలు వస్తాయి.
సింహ రాశి (Leo)
కెరీర్ , వ్యాపారంలో పురోగతికి అవకాశాలు లభిస్తాయి. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి . ఉద్యోగులకు ఉన్నత అధికారుల సహకారం లభిస్తుంది. పితృదేవతల ఆశీస్సులు మీపై ఉంటాయి. ఇంటా బయటా మీకు గౌరవం పెరుగుతుంది.
కన్యా రాశి (Virgo)
ఆర్థికంగా పెద్ద ఉపశమనం లభించే సమయం ఇది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు తిరిగి అందుతుంది. విద్యార్థులు చదువుపై శ్రద్ధపెడతారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు
మకర రాశి (Capricorn)
పితృ అమావాస్య రోజు మకర రాశివారికి శుభ ఫలితాలున్నాయి. ప్రయాణాలు కలిసొస్తాయి. కొత్త పెట్టుబడుల వల్ల లాభం ఉంటుంది. విదేశాల నుంచి లేదా దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వినవచ్చు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించినవి. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
2025 శరన్నవరాత్రుల్లో ఏ రోజు ఏ అలంకారం? ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి? పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
దసరా నవరాత్రి కలశ స్థాపన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత! ఎలాంటి కలశ పెట్టాలి తెలుసుకునేందుకు...ఈ లింక్ క్లిక్ చేయండి




















