అన్వేషించండి

Samudrik Shastra about Teeth : మీ దంతాల ఆకృతి మీ భవిష్యత్ చెప్పేస్తుంది!

దంతాల ఆకృతిని బట్టి మనిషి అదృష్టాన్ని, సంవదను, జీవితంలో వారు అనుభవించే సుఖదు:ఖాలను తెలుసుకోవచ్చు. సాముద్రికా శాస్త్రంలో దంతాల అమరిక గురించి ఏలాంటి వివరణలు ఉన్నాయో తెలుసుకుందాం.

దంతాలు మనిషి ముఖానికి అందాన్ని ఇస్తాయి. దంతాల ఆకృతి కూడా మనుషుల వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందట. ప్రపంచంలో ప్రతి ఒక్కరి ముఖ కవళికలు భిన్నంగా ఉంటాయి. ఇద్దరు వ్యక్తుల ముఖాల్లో కొన్ని పోలికలు కలుస్తాయేమో కానీ అచ్చుగుద్దినట్టు ఉండవు. ఐడెంటికల్ కవలలు అయితే తప్ప. సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించి వ్యక్తుల అవయవాలు, ఆకారాలను విశ్లేషించి చూసి వ్యక్తుల వ్యక్తిత్వాలను అంచనా వెయ్యడం సాధ్యపడుతుంది.

Also Read: ఈ నక్షత్రంలో జన్మించిన వారికి తెలివితేటలు, నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి!

  • సాముద్రికా శాస్త్రాన్ని అనుసరించి తెల్లగా అందమైన దంతాలున్న వారు అదృష్టవంతులు. ఈ వ్యక్తుల స్వభావం స్నేహశీలమైంది, ఉల్లాసంగా ఉంటుంది. అందరితోనూ సామరస్యంగా జీవిస్తారు. ఇదే వారిని సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలబెడుతుంది. వీరిది పోరాట పటిమ కలిగిన వారిగా చెప్పవచ్చు.
  • చిగుళ్లు మందంగా బలంగా కనిపించే వ్యక్తి కాస్త అహంకారంతో ఉండే అవకాశం ఉంటుంది.
  • గులాబిరంగు చిగుళ్లు కలిగిన వ్యక్తి మర్యాద కలిగిన వ్యక్తి. వీరికి ఆయుష్షు కూడా ఎక్కువ.
  • కాస్త పసుపు పచ్చని షేడ్ లో దంతాలు ఉండేవారు చాలా నమ్మకమైన వ్యక్తులు. వీరిని సులభంగా నమ్మవచ్చు. స్నేహపూరిత మనస్తత్వం కలిగిన వారు.
  • వంకర టింకరగా, ఎగుడు, దిగుడు దంతాలు ఉన్నవారు జీవితంలో కొన్ని అవకాశాలను కోల్పోతారని చెప్పేందుకు నిదర్శనం.
  • సాముద్రిక శాస్త్రం ప్రకారం దంతాలు సమంగా పైకి లేచినట్టు ఉండి సరళ రేఖలో మృదువుగా అమరినట్టు ఉన్న వ్యక్తికి జీవితంలో డబ్బుకు లోటుండదు. లక్ష్మీ దేవి ఆశిస్సులు సదా వీరి మీద ఉంటాయి.
  • దంతాల మధ్య అంతరం ఉన్న వ్యక్తులు తెలివైన వారై ఉంటారు. ఈ వ్యక్తులు ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి పని చేయించుకోవడంలో నైపుణ్యం కలిగిన వారు. వీరు ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గని మనస్తతత్వం కలిగిన వారు. ప్రతి సందర్భంలో ఏ విధంగా వారు సంతోషంగా ఉండాలనేది మాత్రమే వారు చూసుకుంటారు. వీరి వ్యక్తిత్వ ప్రభావం వీరితో ఉండేవారి మీద తప్పకుండా ఉంటుంది. ఓపెన్ మైండెడ్ గా ఉంటారు. తినడం, తాగడం ఎల్లప్పుడూ పార్టీ మూడ్ లో ఉంటుంటారు. కేరీర్ లో చాలా త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాదు వారి నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి. అందువల్ల వీరి వృత్తి జీవితం చాలా విజయవంతంగా ఉంటుంది.
  • పొడవైన దంతాలు కలిగిన వారు అనుభవజ్ఞులు, చాలా పరిణతితో ఆలోచిస్తారు. చాలా ధైర్యవంతులు, దేనికి వెరవని వ్యక్తిత్వం వీరిది. ఆత్మవిశ్వాసం అధికంగా కలిగి ఉంటారు. వారి పని చేసే  శైలి చాలా భిన్నంగా ఉంటుంది.

Also read : కుక్కల ప్రవర్తన మీ భవిష్యత్తును తెలుపుతుందట - శకున శాస్త్రం ఏం చెబుతోందో తెలుసా?

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.

టాప్ హెడ్ లైన్స్

Gen Z ఫోటో స్టిల్స్! ఆలయాలను సందర్శించేటప్పుడు ఫొటోలు ఇలా తీసుకుంటే అదిరిపోతాయ్!
Gen Z ఫోటో స్టిల్స్! ఆలయాలను సందర్శించేటప్పుడు ఫొటోలు ఇలా తీసుకుంటే అదిరిపోతాయ్!
714 కోట్ల ఈ పెంట్‌హౌస్ఆ యుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
714 కోట్ల ఈ పెంట్‌హౌస్ఆ యుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
రక్షాబంధన్ 2026: శుభ సమయం, రాశి ప్రకారం బహుమతులు, పూజా విధానం!
రక్షాబంధన్ 2026: శుభ సమయం, రాశి ప్రకారం బహుమతులు, పూజా విధానం!
05-08-2026 బుధవారం మీ రాశిఫలాలు!
05-08-2026 బుధవారం మీ రాశిఫలాలు!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Embed widget