Rasi Phalalu Today 4th May 2025: ఈ రాశులవారికి నూతన ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఈ రాశులవారు లైఫ్ ని ఎంజ్ చేస్తారు - మే 04 రాశి ఫలాలు
Rasi Phalalu Today in Telugu : మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, సింహం, కన్య, తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీన రాశులకు ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

మే 04 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజంతా బిజీగా ఉంటారు. కార్యాలయంలో ఉన్నతాధికారి మీకు కొత్త బాధ్యతలు అప్పగించొచ్చు. ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. కళలు, సాహిత్య రంగాలపై ఆసక్తి ఉంటుంది. క్రీడా రంగంతో అనుబంధం ఉన్నవారు నేర్చుకోవడంలో బిజీగా ఉంటారు. ఆర్థిక విషయాల్లో తల్లిదండ్రుల సహాయం లభిస్తుంది. మీ కొత్త ఆస్తిని కొనుగోలు చేయాలనే కోరిక నెరవేరుతుంది.
వృషభ రాశి
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నవారికి రోజు మంచిది. సమాజ హితం కోసం చేసిన పనులకు ప్రశంసలు లభించవచ్చు. ఉద్యోగులు ఉన్నతాధికారుల ముందు ఉంచే ప్రతిపాదనలకు సానుకూల ప్రతిస్పందన లభిస్తుంది. మహిళలు తమ జీవిత భాగస్వామికి ఏదైనా రుచికరమైన వంట చేసి పెడతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ధార్మిక కార్యక్రమాల్లో ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో పెద్దల సహకారం మీకు ఉంటుంది.
మిథున రాశి
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగులు పని విషయంలో శ్రద్ధగా ఉంటారు. మీ శక్తిని సరైన పనిలో ఉపయోగించండి. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఏదైనా సంస్థతో అనుసంధానం అయ్యే అవకాశం లభిస్తుంది. తండ్రి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పని కోసం సోదరులు, సోదరీమణుల నుంచి మీకు సహాయం లభిస్తుంది.
కర్కాటక రాశి
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా పని గురించి ఉత్సాహంగా ఉంటారు. అనుకున్న పని సమయానికి పూర్తవుతుంది. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఏదైనా ప్రాజెక్టులో జీవిత భాగస్వామి నుంచి సహకారం లభిస్తుంది. ఈ రోజు వచ్చే కొన్ని ఆలోచనలు సృజనాత్మకంగా ఉంటాయి. విద్యార్థులకు చదువులో ఆసక్తి తగ్గుతుంది. కుటుంబంలో అందరూ ఏదైనా పార్టీలో పాల్గొంటారు.
సింహ రాశి
ఈ రోజు మీకు మంచి జరుగుతుంది. ఏదైనా చట్టపరమైన విషయాల్లో తొందరపడకండి. మీ ఖర్చులపై నియంత్రణ కొనసాగిస్తే భవిష్యత్తులో వచ్చే ఇబ్బందుల నుంచి కూడా తప్పించుకోవచ్చు. రేపు మీ పనిని సాధారణ వేగంతో పూర్తి చేస్తారు. కొత్త పని ప్రారంభించాలనుకుంటే ఈ రోజు శుభప్రదం అవుతుంది. మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు సంతోషంగా ఉంటారు. ఆదాయం-ఖర్చుల మధ్య సమతుల్యత కొనసాగించండి.
కన్యా రాశి
ఈ రోజు మీలో కొత్త ఉత్సాహం ఉంటుంది. ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినట్లయితే అది మీకు తిరిగి రావచ్చు. కుటుంబ సభ్యులతో మీరు ఏదైనా ధార్మిక యాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. రేపు మీరు స్నేహితులతో ఏదైనా పెట్టుబడి సంబంధిత ప్రణాళికను రూపొందిస్తారు. ఆలోచించి అడుగు వేయండి. ఈ రోజు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే చాలా ఆలోచించి తీసుకోండి.
తులా రాశి
ఈ రోజు మీకు మంచి జరుగుతుంది. ఏదైనా విషయంలో మీ అవగాహనతో పనిచేయాలి అప్పుడే పని ఫలితం మంచిదిగా ఉంటుంది. సానుకూలత పెరుగుతుంది. మీ గౌరవం పెరుగుతుంది. ఓ శుభవార్త వచ్చే అవకాశం ఉంది. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ధార్మిక కార్యాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇంట్లో ఉత్సవ వాతావరణం ఉంటుంది.
వృశ్చిక రాశి
ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు. మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త ప్రణాళికను రూపొందిస్తారు. చిన్ననాటి స్నేహితుడిని కలుస్తారు. రోజంతా సంతోషంకా ఉంటారు. అర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారికి రేపు ఉపశమనం లభిస్తుంది. కుటుంబం సంతోష వాతావరణం ఉంటుంది.
ధనుస్సు రాశి
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం బావుంటుంది. పెరుగుతున్న ఖర్చులు ఇబ్బంది రావొచ్చు. బడ్జెట్ ప్రకారం ఖర్చు చేయడానికి ప్రయత్నించండి. ఏదైనా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే తొందరపడొద్దు. రాజకీయాల్లో ఉన్నవారికి పెద్ద నాయకులను కలవడానికి అవకాశం లభిస్తుంది. ఏదైనా పాత సమస్యను పరిష్కరించడానికి ప్రణాళికలు రూపొందిస్తారు.
మకర రాశి
ఈ రోజు మీకు ఫలవంతంగా ఉంటుంది. మీ ప్రణాళికలు వేగంగా అమలుచేస్తారు. కొత్త వ్యక్తులను కలుస్తారు. మీకు పెద్దల సహాయ సహకారాలు పుష్కలంగా లభిస్తాయి. మీ చదువులో వస్తున్న ఇబ్బంది నుంచి విముక్తి లభిస్తుంది. ఏదైనా శుభకార్యక్రమంలో చురుకుగా పాల్గొంటారు. ధార్మిక కార్యాల పట్ల ఆసక్తి చూపిస్తారు
కుంభ రాశి
ఈ రోజు మీకు ఫలవంతంగా ఉంటుంది. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా ఆదాయం పొందుతారు. ప్రభుత్వ , పరిపాలన విషయాల్లో జాగ్రత్త వహించండి. పెట్టుబడి సంబంధిత విషయాల్లో వేగం పెరుగుతుంది. ఎవరినైనా నమ్మే ముందు ఆలోచించండి. దాంపత్య జీవితంలో సంతోషం పెరుగుతుంది.
మీన రాశి
ఈ రోజు కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. కుటుంబంలో మీతీరుకి ప్రశంసలు లభిస్తాయి. ఈ రాశి మహిళలకు ఈ రోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. రేపు మీకు వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మంచి అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ సన్నాహాలను కొనసాగించాలి. మీరు ఎవరినైనా సహాయం చేసినట్లయితే వారి నుంచి తిరిగిసహాయం పొందుతారు.
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.





















