Rasi Phalalu Today in Telugu 23rd May 2025: ఈ రాశులవారు గతంలో చేసిన తప్పులను అంగీకరించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది - మేషం to మీనం మే 23 రాశిఫలాలు!
Horoscope for May 22, 2025 : మేషం, తుల, మకరం సహా ఇతర రాశులకు కెరీర్, ఆరోగ్యం, ప్రేమ, ధనంపై భవిష్యత్తు ఏంటో తెలుసుకోండి!

23 మే 2025 మీ రాశిఫలితం
మేష రాశి (Aries)- 23 మే 2025
ఈ రోజు మీకు నిరాశాజనకంగా ఉండబోతుంది. గృహ జీవితంలో మీ భాగస్వామితో ఏదైనా విషయంపై గొడవ జరిగే అవకాశం ఉంది కానీ ఓపికతో పరిష్కరించుకోండి. కుటుంబ సంబంధాల్లో మాధుర్యాన్ని కాపాడుకోవాలి. వ్యాపారం చేస్తున్నవారు ఎవరినైనా భాగస్వామిగా చేసుకునే ముందు వారి గురించి పూర్తిగా తెలుసుకోండి. ఉద్యోగం కోసం వెతుకుతున్నవారు శుభవార్త వినవచ్చు.
వృషభం రాశి (Taurus)- 23 మే 2025
ఈ రోజు మీ చుట్టూ ఉన్న వాతావరణం సంతోషంగా ఉంటుంది. మీరు ఏదైనా విషయంలో రాజీ పడే ముందు బాగా ఆలోచించండి. స్నేహితుల సంఖ్య పెరుగుతుంది కానీ ఎవరినీ అతిగా నమ్మకండి. వారు ఆ నమ్మకాన్ని దుర్వినియోగం చేయవచ్చు. మీరు పని ప్రదేశంలో మంచి ఆలోచనలతో లాభం పొందుతారు.ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయబోతున్నట్లయితే మరోసారి ఆలోచించండి.
మిథున రాశి (Gemini)- 23 మే 2025
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీరు పని ప్రదేశంలో ఏదైనా కొత్తగా చేయాలని అనుకుంటారు. పెద్ద కంపెనీలో పెట్టుబడి పెట్టే అవకాశం లభించవచ్చు. ఆగిపోయిన పని గురించి చింతిస్తున్నవారికి ఆ పని పూర్తవుతుంది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు.
కర్కాటక రాశి (Cancer)- 23 మే 2025
ఈ రోజు వ్యాపారులు ఆశించిన లాభాలు పొందలేరు. వ్యాపారానికి సంబంధించిన ఏదైనా నిర్ణయాన్ని తొందరపడి తీసుకోకండి. మీరు ముందు ఎవరికైనా డబ్బులు అప్పు ఇచ్చినట్లయితే అవి తిరిగి రాకపోవడం వల్ల మీకు నిరాశ కలుగుతుంది. పిల్లలకు కొంత బాధ్యత ఇస్తే వారు దాన్ని సరిగ్గా నిర్వహిస్తారు. మీరు తండ్రి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
సింహ రాశి (Leo)- 23 మే 2025
ఈ రోజు జాగ్రత్తగా ,అప్రమత్తంగా ఉండాలి. మీరు మీ చుట్టుపక్కల జరుగుతున్న గొడవల్లో తలదూర్చకండి. కొత్త వాహనం కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మీ కోరిక నెరవేరవచ్చు. రాజకీయాల్లో ఉండేవారు ఏదైనా విషయం గురించి బాధపడతారు. లావాదేవీలకు సంబంధించిన విషయాన్ని సకాలంలో పరిష్కరించుకోవాలి.
కన్యా రాశి (Virgo)- 23 మే 2025
ఈ రోజు మీకు చాలా మంచి ఫలితాలంటాయి. వ్యాపారంలో లాభం పొందుతారు. పిల్లలకు మంచి విషయాలను నేర్పుతారు. ఏదైనా గాయం లేదా నొప్పి ఉంటే అది తిరగబెట్టే అవకాశం ఉంది. బంధువులతో ఏదైనా అభిప్రాయ భేదాలు ఉండకుండా చూసుకోండి...వారికి మీ మాటలు బాధగా అనిపించవచ్చు. తల్లిదండ్రులతో మీ మనసులోని విషయాల గురించి మాట్లాడవచ్చు.
తులా రాశి (Libra)- 23 మే 2025
ఈ రోజు ప్రేమ జీవితం గడుపుతున్నవారికి కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. మీ భాగస్వామిపై ఏదైనా విషయంపై మీకు అనుమానం రావచ్చు.. ఈ విషయంలో ఇద్దరి మధ్యా గొడవ జరుగుతుంది. ఉద్యోగం చేసే ప్రదేశంలో ఏదైనా విషయంపై మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పండి. మీ పాత స్నేహితులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.
వృశ్చికం రాశి (Scorpio)- 23 మే 2025
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. మీ తోడబుట్టినవారితో సఖ్యత ఉంటుంది. పని ప్రదేశంలో మీరు ఏదైనా తప్పు విషయాన్ని అధికారుల ముందు అంగీకరించడం మిమ్మల్ని ఇబ్బందిపెడుతుంది. మీ ఆరోగ్యం బలహీనంగా అనిపిస్తుంది. ఏ పనీ చేయడంపై ఆసక్తి ఉండదు. బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలి లేదంటే మీపై కోపంగా ఉంటారు. పాత అప్పులు తీరుస్తారు
ధనస్సు రాశి (Sagittarius)- 23 మే 2025
ఈ రోజు ధన సంబంధిత విషయాల్లో కొంత బలహీనంగా ఉంటుంది. మీరు మనస్ఫూర్తిగా అందరి మంచి కోరుకుంటారు, కానీ దాన్ని మీ స్వార్థంగా అర్థం చేసుకోవచ్చు. వ్యాపారం చేస్తున్నవారు రేపు ఏదైనా విషయం గురించి తమ బంధువులతో మాట్లాడుతారు. పని ప్రదేశంలో మీపై బాధ్యతల భారం పెరగవచ్చు. ఎవరికీ డబ్బులు అప్పు ఇవ్వకండి.
మకర రాశి (Capricorn)- 23 మే 2025
ఈ రోజంతా మీరు బిజీగా ఉంటారు. ఉద్యోగం కోసం వెతుకుతున్నవారి కల ఫలిస్తుంది. వ్యాపారంలో ఆశించిన లాభం పొందలేరు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పని ప్రదేశంలో మీరే చేసే తప్పులకు తగిన శిక్ష అనుభవిస్తారు. కుటుంబంలో ఏదైనా విషయంపై గొడవ జరిగే అవకాశం ఉంది.
కుంభం రాశి (Aquarius)- 23 మే 2025
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. ఏదైనా కొత్త పని చేసే ముందు కుటుంబంలో పెద్దలతో చర్చించాలి. స్నేహితులతో బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. సామాజిక రంగంలో పనిచేస్తున్నవారికి పెద్ద పదవి లభించవచ్చు . విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునేవారి కోరిక నెరవేరవచ్చు, కానీ సోదరులతో ఉన్న గొడవను మాట్లాడి పరిష్కరించుకోండి, లేదంటే అది పెద్దదవుతుంది.
మీన రాశి (Pisces)- 23 మే 2025
ఈ రోజు విద్యార్థులకు మంచి ఫలితాలుంటాయి. పనిచేసే ప్రదేశంలో కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. తల్లిదండ్రులతో మీరు ఏదైనా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడవచ్చు. మీరు చేసిన కొన్ని తప్పులను అంగీకరించండి. పాత లావాదేవీలు తలనొప్పిగా మారుతాయి. వైవాహిక జీవితం ససాధారణంగా ఉంటుంది, ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.





















