2025 అక్టోబర్ 29 రాశిఫలాలు - మేషం నుంచి మీనం.. ఈ రోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!
Daily Horoscope in Telugu: 2025 అక్టోబర్ 29న మేషం నుంచి మీనం వరకూ ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి

2025 అక్టోబర్ 29 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu 29 October 2025
మేష రాశి (Aries Horoscope)
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది. వాహనం జాగ్రత్తగా ఉపయోగించండి. స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. కుటుంబంలో ఎవరితోనైనా వివాదం ఉండవచ్చు.. మీ మాటలను అదుపులో ఉంచుకోండి.
అదృష్ట సంఖ్య: 5
అదృష్ట రంగు: ఎరుపు
పరిహారం: మంగళవారం నాడు హనుమంతునికి ఎర్ర సింధూరం సమర్పించండి
వృషభ రాశి (Taurus Horoscope)
ఈ రోజు వృధా పనుల్లో గడిచిపోతుంది. మనస్సు కలత చెందుతుంది . ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. వ్యాపారంలో పెద్ద డీల్ చేజారవచ్చు. కుటుంబంలో ప్రియమైన వారి గురించి విచారకరమైన వార్తలతో మనస్సు కలత చెందుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.
అదృష్ట సంఖ్య: 2
అదృష్ట రంగు: తెలుపు
పరిహారం: దుర్గా మాతకు పాలతో చేసిన పదార్థం నివేదించండి
మిథున రాశి (Gemini Horoscope)
ఈ రోజు మీరు సరదాగా ఉంటారు . కుటుంబ వాతావరణాన్ని సంతోషంగా ఉంచుకుంటారు. కష్ట సమయాల్లో మీకు సహాయం చేసిన వారికి మీరు కృతజ్ఞతలు తెలుపుతారు. జీవిత భాగస్వామితో కొంత సమయం గడపడానికి కొన్ని పనులను వాయిదా వేయవచ్చు. ప్రేమ జీవితంలో ఉత్సాహం ఉంటుంది
శుభ సంఖ్య: 5
శుభ రంగు: ఆకుపచ్చ
పరిహారం: గణేశునికి దూర్వను సమర్పించండి
కర్కాటక రాశి (Cancer Horoscope)
ఈ రోజు ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి. తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఆర్థిక విషయాలలో కొన్ని అనవసరమైన ఖర్చులు ఉంటాయి మీరు ఎవరికైనా సహాయం చేయవలసి రావచ్చు. ప్రేమికుడు తన భావాలను వ్యక్తపరచడం మంచిది. చిన్నప్పటి స్నేహితులను కలుస్తారు.వైవాహిక జీవితంలో పరస్పర అవగాహనను కొనసాగించండి.
శుభ సంఖ్య: 2
శుభ రంగు: తెలుపు
పరిహారం: చంద్రునికి పాలలో చక్కెర కలిపి సమర్పించండి.
సింహ రాశి (Leo Horoscope)
ఈ రోజు మీకు శుభ దినం. మీరు ప్రయత్నిస్తున్న పనిలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యం లాభదాయకంగా ఉంటుంది. ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి.
అదృష్ట సంఖ్య: 9
అదృష్ట రంగు: ముత్యాల తెలుపు
పరిహారం: బియ్యం , పాలతో చంద్రునికి అర్ఘ్యం సమర్పించండి.
కన్యా రాశి (Virgo Horoscope)
మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ ఈ రోజు మీరు జీవితాన్ని ఆనందిస్తారు. ఆర్థిక విషయాలలో సంయమనం పాటించండి. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. స్నేహితులు లేదా బంధువులను కలుస్తారు. ప్రియమైన వ్యక్తి మీ ఆనందం కోసం ఏదైనా ప్రత్యేకంగా చేస్తారు.
శుభ సంఖ్య: 7
శుభ రంగు: లేత ఆకుపచ్చ
పరిహారం: దుర్గా మాతను పూజించండి
తులా రాశి (Libra Horoscope)
ఈ రోజు సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తోబుట్టువుల సహకారంతో ఏదైనా ముఖ్యమైన పని పూర్తవుతుంది. స్నేహితుల నుంచి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సహకారం అందుతుంది. అనవసర వాదనలు పెట్టుకోవద్దు. మీరు బాధ్యతలను నెరవేరుస్తారు. కుటుంబంలో పిల్లలు లేదా వృద్ధుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
శుభ సంఖ్య: 4
శుభ రంగు: నీలం
పరిహారం: కృష్ణుడికి తులసి ఆకులను సమర్పించండి
వృశ్చిక రాశి (Scorpio Horoscope)
కుటుంబంలో మంచి సమన్వయం ఉంటుంది. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారంలో లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఇంటి నిర్వహణ మెరుగుపడుతుంది. ఈ రోజు ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.
శుభ సంఖ్య: 8
శుభ రంగు: ముదురు ఎరుపు
పరిహారం: శివుడికి అభిషేకం చేయండి
ధనుస్సు రాశి (Sagittarius Horoscope)
ఈ రోజు మీ వ్యక్తిత్వం ప్రభావవంతంగా ఉంటుంది .. మీ ప్రవర్తనతో ఆకట్టుకుంటారు. మధ్యాహ్నం తర్వాత ఆర్థిక లాభం సూచనలు ఉన్నాయి. స్నేహితులను కలిసే అవకాశం లభిస్తుంది. మీ నైపుణ్యం ఇతరులను ఆకట్టుకుంటుంది. ఈ రోజు ప్రశాంతమైన వాతావరణంలో సమయం గడపాలనుకుంటారు.
శుభ సంఖ్య: 3
శుభ రంగు: పసుపు
పరిహారం: విష్ణువుకు పసుపు పువ్వులు సమర్పించండి
మకర రాశి (Capricorn Horoscope)
ఈ రోజు ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. ఖర్చులను నియంత్రణలో ఉంచుతారు. పెట్టుబడి పెట్టడానికి కొత్త అవకాశాలను పరిశీలిస్తారు. ఆస్తికి సంబంధించిన పనులలో విజయం లభిస్తుంది. కుటుంబం , జీవిత భాగస్వామి మద్దతు సంతోషాన్నిస్తుంది. బంధంలో సున్నితత్వాన్ని కొనసాగించండి..వివాదాలకు దూరంగా ఉండండి
శుభ సంఖ్య: 10
శుభ రంగు: బూడిద
పరిహారం: శని దేవునికి ఆవాల నూనె సమర్పించండి
కుంభ రాశి (Aquarius Horoscope)
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. కుటుంబంలో ప్రశాంతవాతావరణం ఉంటుంది. ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త.
వ్యాపారంలో పాత పెట్టుబడుల వల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
శుభ సంఖ్య: 11
శుభ రంగు: ఊదా
పరిహారం: శని దేవుని ఆలయంలో నీలిరంగు పువ్వులు సమర్పించండి.
మీన రాశి (Pisces Horoscope)
అదృష్టం కలిసొస్తుంది. పనిచేసే ప్రదేశంలో సానుకూల ఫలితాలుంటాయి. ఉన్నతాధికారుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. పొదుపు పథకాలపై దృష్టి సారించండి. ఓ శుభవార్త వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి .
శుభ సంఖ్య: 7
శుభ రంగు: లేత నీలం
పరిహారం: విష్ణు సహస్రనామం పఠించండి
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.





















