అన్వేషించండి

Planets in Astrology: గ్రహస్థితి బాగోపోవడం అంటే ఏంటి, ఏ గ్రహం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది!

Planets in Astrology: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

ఓ వ్యక్తి జాతకాన్ని నిర్ణయించేది, నిర్ధేశించేది నవగ్రహాలే. ఈ గ్రహాల స్థానాన్ని బట్టే అనుకూల, ప్రతికూల ఫలితాలుంటాయి..మరి ఏ గ్రహం వల్ల ఎలాంటి ప్రతికూల ఫలితాలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం. ఆ గ్రహాలకు తగిన దానాలు, శాంతులు చేయడం, నిత్యం నవగ్రహ శ్లోకం చదువుకోడం వల్ల కానీ కొంత ఉపశమనం లభించవచ్చు. 

రవి( సూర్యుడు)
కంటికి సంబంధించిన వ్యాధులు, హృదయానికి సంబంధించిన రోగాలు, ఎముకల నొప్పులు, పార్శ్య నొప్పి, మనో వ్యసనం, అతిసారం, శిరోబాధలు ఉంటాయి. ముఖ్యంగా సూర్యుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఇవన్నీ తప్పవు.

చంద్రుడు
చంద్రుడు మీ రాశి నుంచి 8,12 స్థానాల్లో ఉన్నప్పుడు...కంఠానికి,పొట్టకి సంబంధించిన వ్యాధులు బాధిస్తాయి. క్షయ, పాండురోగం, మనస్థిమితం లేకపోవడం, మనోధైర్యం కోల్పోవడం జరుగుతుంది. 

కుజుడు
అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు..అంటే 8 వ స్థానంలో ఉన్నప్పుడు మూత్ర కోశం ఇబ్బందులు, చెవి పోటు, ఒంటిపై పొక్కులు, కుష్టు సంబంధిత వ్యాధులు, వాహన ప్రమాదాలు,ఎముకలు విరగడం, సోదరులతో వివాదాలు ఉంటాయి.

Also Read: 'అంతా మా కర్మ', 'ప్రారబ్ధం' అంటారు కదా, ఎందుకలా అంటారు - కర్మ అంటే ఏంటి!

బుధుడు
బుధుడు 8,12 స్థానాల్లో ఉన్నప్పుడు నాలుకకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. చర్మ సమస్యలు కూడా వేధిస్తాయి.పైల్స్, పొట్టకు సంబంధించిన వ్యాధులు వెంటాడతాయి. పాండు రోగం, కుష్టురోగం వచ్చే ప్రమాదం ఉంది

గురుడు
గురుడు అష్టమంలో ఉంటే మెదడు, ఊపిరితిత్తులుకు సంబంధించిన రోగాలు వస్తాయి. ఆలోచనా విధానం సరిగ్గా ఉండదు..పేగులకు సంబంధించిన వ్యాధులు వస్తాయి.

శుక్రుడు
శుక్రుడు 8,12 స్థానాల్లో ఉంటే మూత్ర రోగం, మధుమేహం,పైత్య రోగం, సుఖ రోగాలు, రక్తదోషం, వ్యసనం, ఇంద్రియరోగాలతో బాధపడతారు

Also Read: కలలో డబ్బు-బంగారం కనిపిస్తే ఏమవుతుంది, శుభమా-అశుభమా!

శని 
ఏలినాటి శని, అష్టమ శని, అర్దాష్టమ శని..శని మూడు రకాలుగా ఇబ్బంది పెడుతుంది. శని వెంటాడుతున్న సమయంలో కాలేయ సంబంధిత రోగాలు, మనో వ్యధ, నరాల బలహీనత ఉంటుంది. 

రాహువు
రాహు సంచారం అనుకూలంగా లేకపోతే... మతిభ్రమణం, పిశాచ బాధలు, సర్ప భయం, చర్మ సంబంధ రోగాలు , రక్తంలో నీరు చేరడం, ఉబ్బసం వెంటాడతాయి. 

కేతువు
కేతువు 8, 12 స్థానంలో సంచరిస్తున్నప్పుడు శారీరకబాధలు, నీరసం, నిస్సత్తువ, చర్మ వ్యాధులు ఇబ్బంది పెడతాయి.

నవగ్రహ శ్లోకం
శ్లోకం
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||

సూర్యుడు
జపాకుసుమ సంకాశం | కాశ్యపేయం మహాద్యుతిమ్
తమో రిం సర్వపాపఘ్నం | ప్రణతోస్మి దివాకరం ||

చంద్రుడు 
దధి శంఖ తుషారాభం | క్షీరోదార్ణవ సంభవమ్
నమామి శశినం సోమం | శంభోర్మకుట భూషణం ||

కుుజుడు
ధరణీగర్భ సంభూతం | విద్యుత్కాంతి సమప్రభమ్
కుమారం శక్తిహస్తం | తం మంగళం ప్రణమామ్యహం ||

బుధుడు 
ప్రియంగు కలికాశ్యామం | రూపేణా ప్రతిమం బుధం
సౌమ్యం సత్వగుణోపేతం | తం బుధం ప్రణమామ్యహం ||

గురుడు
దేవానాంచ ఋషీణాంచ | గురుం కాంచన సన్నిభం
బుద్ధిమంతం త్రిలోకేశం | తం నమామి బృహస్పతిం ||

శుక్రుడు
హిమకుంద మృణాళాభం | దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం | భార్గవం ప్రణమామ్యహం ||

శని
నీలాంజన సమాభాసం | రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం | తం నమామి శనైశ్చరం ||

రాహువు
అర్ధకాయం మహావీరం | చంద్రాదిత్య విమర్దనం
సింహికాగర్భ సంభూతం | తం రాహుం ప్రణమామ్యహం ||

కేతువు
ఫలాశ పుష్ప సంకాశం | తారకాగ్రహ మస్తకం
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం | తం కేతుం ప్రణమామ్యహం ||

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
Surya Gochar 2026: సింహ రాశిలోకి సూర్యుడు, సెప్టెంబర్ 17 వరకూ మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
సింహ రాశిలోకి సూర్యుడు, సెప్టెంబర్ 17 వరకూ మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget