Numerology Predictions 28th July 2023: జూలై 28 న్యూమరాలజీ, ఈ తేదీల్లో జన్మించినవారు ఈ రోజు ఏం చేసినా అదృష్టం కలిసొస్తుంది
Numerology prediction 28th July 2023 : న్యూమరాలజీ ప్రకారం జూలై 28 శుక్రవారం సంఖ్యాశాస్త్రం ప్రకారం ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి.
Astrology Predictions by Numbers
నంబర్ 1 (పుట్టిన తేదీలు 1, 10, 19, 28)
మీ పుట్టిన తేదీ 1, 10, 19 మరియు 28 అయితే జూలై 28న మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. ఈ రోజు అదృష్టం మీకు కలిసొస్తుంది. తలపెట్టిన ప్రతిపనిలోనూ విజయం సాధిస్తారు. మీ ప్రియమైన వ్యక్తికి సమయం కేటాయించండి. గృహ జీవితంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.అదృష్ట సంఖ్య: 5 అదృష్ట రంగు: నారింజ
నంబర్ 2 (పుట్టిన తేదీలు 2, 11, 20,29)
ఈ తేదీల్లో పుట్టినవారు చాలా అవకాశాలు పొందుతారు. ఆర్థిక విషయాలు ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ ప్రియమైనవారి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోండి. మీ మాటతీరుని మార్చుకునేందుకు ప్రయత్నించండి. వివాదాలకు దూరంగా ఉండాలి. సంతోషకరమైన సంఖ్య: 9 సంతోషకరమైన రంగు: తెలుపు
నంబర్ 3 (పుట్టిన తేదీలు 3, 12, 21, 30)
ఈ తేదీల్లో జన్మించిన వారికి ఈ రోజు మంచి ఫలితాలుంటాయి. మీరు ప్రారంభించిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తవుతాయి. మీ ప్రయత్నాలకు తగిన ఫలితం అందుకుంటారు. ఉద్యోగులలు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ఇంట్లో సమస్యలు క్లిష్టంగా అనిపిస్తాయి. అదృష్ట సంఖ్య: 10 అదృష్ట రంగు: పసుపు
నంబర్ 4 (పుట్టిన తేదీలు 4, 13, 22, 31)
ఈ తేదీల్లో పుట్టినవారు ఈ రోజు మాటలు తగ్గించుకుంటే మంచిది. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఎదురైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. చిన్న చిన్న విషయాలకే భావోద్వేగానికి లోనవుతారు. ఏ పని ప్రారంభిస్తారో అది పూర్తిచేసేవరకూ వెనకడుగు వేయొద్దు. మీ అంచనాలు నెరవేరుతాయి. సంతోషకరమైన సమస్య: 11 సంతోషకరమైన రంగు: ఎరుపు
Also Read: వాస్తు ప్రకారం ఇంట్లో ఏ దిశకు ఏ రంగులు వేస్తే మంచిది!
నంబర్ 5 (పుట్టిన తేదీలు 5, 14, 23)
మీరు పుట్టిన రోజు 5, 14, 23 అయితే మీ లక్కీ నంబర్ 5. ఈ రోజు ప్రయాణం చేయాల్సి రావొచ్చు. విద్యార్థులు ఈ రోజు కొత్త లక్ష్యాలు చేరుకునేందుకు ప్రయత్నిస్తారు. తల్లిదండ్రుల సలహాలు స్వీకరించండి. కొన్ని ఆందోళనలు అధిగమించవచ్చు. అదృష్ట సంఖ్య: 25 అదృష్ట రంగు: గులాబీ
నంబర్ 6 (పుట్టిన తేదీలు 6, 15, 24)
న్యూమరాలజీ ప్రకారం మీ పుట్టిన తేదీ 6, 15, 24 అయితే ఈ రోజు మీరు ఖర్చులు పెరుగుతాయి. అవసరం లేనివాటికోసం ఎక్కువ సమయం పెట్టొద్దు. కష్టపడి పని చేయండి, అదృష్టం మీ వెంట ఉంటుంది. ఈరోజు మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి.అదృష్ట సంఖ్య: 21 అదృష్ట రంగు: ఆకుపచ్చ
నంబర్ 7 (పుట్టిన తేదీలు 7, 16, 25)
సంఖ్యాశాస్త్ర జ్యోతిషశాస్త్రం ప్రకారం మీరు జన్మించిన తేదీ 7, 16, 25 అంటే మీ నంబర్ 7. ఈ రోజు మీకు కొత్త ఆలోచనలు వస్తాయి. అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. ఆర్థిక పరిస్థితి కొంతమిమ్మల్ని ఇబ్బందిపెడుతుంది. అనుకోని నష్టం ఉండొచ్చు. వ్యాపారులు నూతన పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు. అదృష్ట సంఖ్య: 17 అదృష్ట రంగు: బంగారు
Also Read: గోడ గడియారం ఈ దిశగా ఉంటే నాశనమే, వాస్తు ప్రకారం ఎక్కడ ఉండాలి!
నంబర్ 8 (పుట్టిన తేదీలు 8, 17,26)
న్యూమరాలజీ ప్రకారం, పుట్టిన తేదీ 8, 17, 26 ఉన్న వ్యక్తులు జూలై 28న కుటుంబానికి సమయం కేటాయిస్తారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. భవిష్యత్ కి సంబంధించి నూతన ప్రణాళికలు వేసుకుంటారు. ఉద్యోగులు పనిలోనే దైవాన్ని వెతుక్కోవాలి. అదృష్ట సంఖ్య: 15 అదృష్ట రంగు: బ్రౌన్ మూలాంక్ 9 న్యూమరాలజీ ప్రకారం, 9, 18, 27 తేదీలలో జన్మించిన వారు అంటే
నంబర్ 9 (పుట్టిన తేదీలు 9, 18,27)
ఈ తేదీల్లో పుట్టినవారు మీకోసం మీరు టైమ్ కేటాయించుకోండి. మీ వ్యక్తిత్వం అందర్నీ ఆకర్షిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు మంచి ఫలితాలున్నాయి. మీ అదృష్ట సంఖ్య: 7 అదృష్ట రంగు: కుంకుమపువ్వు