Numerology Predictions 21st July 2023: జూలై 21 న్యూమరాలజీ, ఈ తేదీల్లో జన్మించినవారిపై ఈ రోజు లక్ష్మీకటాక్షం
Numerology prediction 21st July 2023 : న్యూమరాలజీ ప్రకారం జూలై 21 శుక్రవారం సంఖ్యాశాస్త్రం ప్రకారం ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి.
Astrology Predictions by Numbers
నంబర్ 1 (పుట్టిన తేదీలు 1, 10, 19, 28)
ఈ తేదీల్లో జన్మించిన వారు ఈ రోజు అసంపూర్ణంగా ఉండిపోయిన పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడతాయి. వివాహితులు ఈ రోజు చిన్నచిన్న విషయాలకే గొడవ పెట్టుకుంటారు. మాటతీరు మార్చుకుంటే మీకే మంచిది. మీకు కలిసొచ్చే నంబర్ 5, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ.
నంబర్ 2 (పుట్టిన తేదీలు 2, 11, 20,29)
ఈ తేదీల్లో పుట్టినవారు ఈ రోజు తమ బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తిస్తారు. యువకులు చేసే ప్రయత్నాలు అనుకున్నట్టు పూర్తవుతాయి. అందరితో కలిసి పని చేయండి. మీరు ఒకరి చిరునవ్వు నుంచి సంతృప్తిని పొందుతారు.
Also Read: జూలై 21 రాశిఫలాలు, ఈ రాశివారికి శత్రువులు పొంచి ఉన్నారు జాగ్రత్త!
నంబర్ 3 (పుట్టిన తేదీలు 3, 12, 21, 30)
ఈ తేదీల్లో జన్మించినవారికి ఈ రోజు ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆస్తి కొనుగోలుకు సంబంధించిన ఏదైనా కార్యకలాపాలు జరుగుతున్నట్లయితే, ఆ పని సక్రమంగా పూర్తవుతుంది. మీరు చాలా కార్యక్రమాలలో బిజీగా ఉంటారు. పొట్టకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయవలసి రావచ్చు.
నంబర్ 4 (పుట్టిన తేదీలు 4, 13, 22, 31)
ఈరోజు ఒక క్రమబద్ధమైన దినచర్యను ప్లాన్ చేసుకుంటారు. ఈ తేదీల్లో జన్మించినవారికి ఈరోజు శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. వాహనానికి సంబంధించిన ఏదైనా డీల్ లాభదాయకంగా ఉంటుంది. సీనియర్ల మార్గదర్శకత్వం ఉంటుంది. పాత సమస్య పెరగవచ్చు.
నంబర్ 5 (పుట్టిన తేదీలు 5, 14, 23)
ఈ తేదీల్లో జన్మించినవారు ఈ రోజు ఉద్యోగం, వ్యాపారంలో శుభఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాలుంటాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. పెట్టుబడులకు మంచి రోజు. ఆశించిన ఫలితాన్ని అందుకుంటారు. కష్టపడి పని చేయండి.
నంబర్ 6 (పుట్టిన తేదీలు 6, 15, 24)
ఈ తేదీల్లో జన్మించినవారికి ఈరోజు మంచి రోజు అవుతుంది. పోటీ పరీక్షలు రాసిన విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలొస్తాయి. స్నేహితులను కలుస్తారు. కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు వాటినుంచి బయటపడతారు. మీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి.
నంబర్ 7 (పుట్టిన తేదీలు 7, 16, 25)
ఈ తేదీల్లో పుట్టినవారికి ఈరోజు మంచి, చెడు రెండు అనుభవాలూ ఉంటాయి. ఓర్పు , ఏకాగ్రతతో మీ లక్ష్యం వైపు వెళ్లండి. అపరిచితుడిని నమ్మవద్దు. మతపరమైన ప్రదేశాన్ని సందర్శించడానికి ఒక ప్రణాళికను రూపొందించవచ్చు.
నంబర్ 8 (పుట్టిన తేదీలు 8, 17,26)
ఈ తేదీల్లో జన్మించినవారుఈ రోజు చేపట్టే పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. కొంచెం కష్టపడినా పనులు పూర్తిచేస్తారు. మీపనిని నిర్వహించేందుకు స్నేహితుల నుంచి సహాయం అందుతుంది. ప్రయాణానికి ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు మంచి ఫలితాలున్నాయి.
Also Read: రెండు నెలల పాటూ ఈ 4 రాశులవారికి ఆదాయం, ఆరోగ్యం, ఆనందం
నంబర్ 9 (పుట్టిన తేదీలు 9, 18,27)
ఈ తేదీల్లో పుట్టినవారు ఈ రోజు తీసుకునే నిర్ణయాలపై మరోసారి ఆలోచించుకోవాలి. ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటే మంచి జరుగుతుంది. పాత అనారోగ్య సమస్యలు మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial