November 7th Horoscope : నవంబర్ 7 రాశి ఫలాలు - ఈ రాశివారు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచి
ఈరోజున ద్వాదశ రాశుల వారిలో కొన్ని రాశులవారికి అనుకూలంగా ఉంటే, మరికొన్ని రాశుల వారికి అనవసరమైన చికాకులు ఉండే అవకాశాలున్నాయి. మరి ఈరోజు ఎవరికి ఎలా ఉందో తెలుసుకోండి.
మేషరాశి
ఈరోజు ఈరాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. లావాదేవీలన్నీ ఓ కొలిక్కి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారలన్నీ అనుకూలంగా సాగిపోతాయి. సంతానం పోటీపరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలున్నాయి. పనిచేసేచోట అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్లను పొందే అవకాశాలున్నాయి. వ్యాపారస్తులు లాభాలని పొందుతారు.
వృషభ రాశి
ఈ రాశి వారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మాత్రం ప్రయత్నాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబంలో గొడవలకు ఆస్కారం ఉంది. గృహ నిర్మాణ విషయంలో ఆటంకాలు ఏర్పడే అవకాశాలున్నాయి.
మిధున రాశి
వీరికి ఈరోజు చాలా బాగుంది. నూతన విషయాలను నేర్చుకుంటారు. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్తవ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. దైవకార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలున్నాయి.
కర్కాటక రాశి
ఈరాశి వారు చేపట్టిన పనులన్నీ పూర్తిచేస్తారు. ఉద్యోగపరంగా ఒత్తిడిని అధిగమిస్తారు. వ్యాపారస్థులకు లాభాలుంటాయి. సంతానం వివాహ విషయంపై చర్చలు జరుగుతాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు లాభిస్తాయి.
సింహ రాశి
వీరు కోపాన్ని అదుపులో ఉంచకోవడం మంచిది. కోపం వల్ల లేనిపోని గొడవులు ఏర్పడే అవకాశాలున్నయి. ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. రుణాలు చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ అవసరమైన డబ్బు చేతికందుతుంది. అనుకోని ప్రయాణ సూచనలున్నాయి.
కన్య రాశి
వీరు ఈ రోజు వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలను అప్పగిస్తారు. అవి చికాకు కలిగిస్తాయి. చేపట్టిన పనులన్నీ ఆలస్యంగా జరుగుతాయి. విలువైన వస్తువుల జాగ్రత్తగా చూసుకోండి. సంతానంలో ఒకరికి అనారోగ్య సూచనలున్నాయి. నిరుద్యోగస్తులు అవకాశాలు కోల్పోతారు.
తుల రాశి
ఈ రాశి వారికి రుణబాధలు తొలుగుతాయి. నూతన ప్రణాళికలను ఏర్పరుచుకుంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. సంతాన వివాహ విషయంలో పురోగతి ఉంటుంది. ధనాన్ని సంపాదించేందుకు మార్గాలు దొరుకుతాయి. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి.
వృశ్చిక రాశి
ముఖ్యమైన పనులుంటే వాయిదా వేసుకోవడం మంచిది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు విషయంలో మళ్లీ ఆలోచనలు చేయడం మంచిది. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.
ధనస్సు రాశి
వీరికి ప్రయాణ సూచనలున్నాయి. కొత్తవారితో పరిచయాలు పెరుగుతాయి. రాజకీయ ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. అనారోగ్య సమస్యలను అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది.
మకర రాశి
ప్రయాణాల్లో తొందరపాటు పనికిరాదు. నూతన పెట్టుబడులు లాభిస్తాయి. విలువైన వస్తువులను కొంటారు. మిత్రులతో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన పనులన్నీ నిదానంగా కొనసాగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. విద్యార్థులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది.
కుంభ రాశి
ప్రేమ వ్యవహారాల్లో ఫలితం ఉంటుంది. ఇంటా బయటా అనుకూలత ఉంటుంది. పనిచేసే చోట అధికారుల అండదండలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. స్థిరాస్తి విషయంలో లాభాలు గడిస్తారు. సోదరులతో విభేధాలు సమసిపోతాయి. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
మీన రాశి
ఈరాశి వారు ఈరోజు చేపట్టిన పనుల్లో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ స్నేహితుల సహకారంతో సకాలంలో పూర్తి చేయగలుగుతారు. భూవివాదాలు పరిష్కారమవుతాయి. సంతానం విద్యా విషయంలో శుభవార్తలు వింటారు. క్రయవిక్రయాల్లో లాభాలు గడిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి.