అన్వేషించండి

అక్టోబరు 11 రాశిఫలాలు : ఈ రాశులవారికి విజయం ఆలస్యం కావొచ్చు కానీ రావడం పక్కా!

Horoscope Prediction 11th October 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for 11th October 2024 

మేష రాశి

ఈ రోజు అధికారుల నుంచి మీకు ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో లాభాలుంటాయి. అపరిచితులను నమ్మవద్దు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. 
 
వృషభ రాశి

ఈ రోజు ఆరోగ్యం క్షీణిస్తుంది. స్నేహితులను కలుస్తారు. దాతృత్వ కార్యక్రమాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఉద్యోగస్తులకు రోజు చాలా మంచిది. మీరు మీ జీవిత భాగస్వామికి నగలను బహుమతిగా ఇవ్వవచ్చు.

మిథున రాశి

స్వీయ అధ్యయనం వైపు ఆకర్షితులవుతారు. స్నేహితులతో ఆసక్తికరమైన కార్యక్రమాలను ఆనందిస్తారు. విద్యార్థులు కొత్త కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. మీరు చెప్పేమాటలు ఎదుటివారికి తప్పుగా అర్థమవుతాయి. ఆలోచించి మాట్లాడండి. ప్రేమ వివాహం గురించి కుటుంబ సభ్యులతో చర్చించవచ్చు. 

కర్కాటక రాశి

వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయకండి. మనసులో నిరుత్సాహకరమైన ఆలోచనలు తలెత్తవచ్చు. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. గొంతు నొప్పి,  జ్వరం వంటి సమస్యలు ఉండవచ్చు. మీరు మీ ప్రత్యర్థుల ముందు బలహీనంగా కనిపిస్తారు. ప్రయాణానికి సంబంధించి టెన్షన్ ఉంటుంది

Also Read: దాండియా నృత్యాలతో కలర్ ఫుల్‌గా సాగే గుజరాతీ దసరా "గర్బా"

సింహ రాశి

ఇంటికి అనుకోని అతిధులు వచ్చే అవకాశం ఉంది. మీ సృజనాత్మక సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి. వ్యాపారంలో భారీ ఆర్థిక ప్రయోజనాలు ఉండవచ్చు. ప్రేమ సంబంధాలు కలసిరావు. కుటుంబ వాతావరణం చాలా శుభప్రదంగా ఉంటుంది. బంధువులు రావచ్చు. సక్సెస్ ఆలస్యం కావొచ్చు  కానీ తప్పనిసరిగా వస్తుంది. 

కన్యా రాశి 

మానసిక స్థితి ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది. ఒకరి మాటలు చెడ్డగా అనిపించవచ్చు. శ్రేయోభిలాషులను అనవసరంగా అనుమానించకండి. మీరు ఎక్కువ ఒత్తిడి తీసుకోవద్దు. ఆర్థిక సంబంధిత సమస్యలు ఉండొచ్చు. సోమరితనంతో సమయాన్ని వృథా చేయవద్దు. 

తులా రాశి

మీ కెరీర్‌లో పురోగతికి అవకాశాలను పొందుతారు. మీకు శుభవార్త రావచ్చు. పాత అప్పులు ఈరోజు తీరుతాయి. మీ జీవిత భాగస్వామి మీకు కొన్ని బహుమతులు ఇవ్వవచ్చు. స్నేహితులు  మంచి సలహా ఇస్తారు.  మీరు ఉద్యోగంలో ఉన్నతాధికారం పొందుతారు.

వృశ్చిక రాశి

మీ వ్యక్తిగత ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ లక్ష్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. పిల్లల విషయంలో కొన్ని ఆందోళనలు ఉండవచ్చు.  స్వభావాన్ని విమర్శించవచ్చు. అనవసర చర్చలకు దూరంగా ఉండడం మంచిది. 

ధనస్సు రాశి

నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు మీకు తిరిగి వస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. అతిథులను కలుస్తారు. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఆదాయం బావుంటుంది. 

మకర రాశి

ఈ రోజు శుభదినం. పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. వైద్య విద్యార్థులు కొత్త విషయాలను నేర్చుకుంటారు. మీ స్వభావం ప్రశంసలు అందుకుంటుంది. అదనపు పని కారణంగా  మీరు ఓవర్ టైం పని చేయాల్సి రావచ్చు.

Also Read: ఆశ్వయుజ మాసం ప్రారంభ - ముగింపు తేదీలు.. కార్తీకమాసం ఎప్పటి నుంచి మొదలు!

కుంభ రాశి 

పని ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వలేరు. మీ సహోద్యోగులతో కోపంగా ప్రవర్తించకండి. పై అధికారుల నుంచి పనులకు ఆటంకం కలిగించవచ్చు. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అనవసరమైన ప్రయాణం చేయవలసి రావచ్చు.

 మీన రాశి 

మీ ఆలోచనలను అందరూ వ్యతిరేకిస్తారు. ఉద్యోగులు, విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకుంటారు. కుటుంబ సభ్యుల ప్రవర్తనతో ఇబ్బంది పడతారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను నమ్మవద్దు.  

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu - Manchu Manoj: అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
T Fiber: 'తక్కువ ధరకే ఇంటర్నెట్, ఇంటి నుంచే 150 రకాల సేవలు' - టీఫైబర్, మీ సేవ యాప్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
'తక్కువ ధరకే ఇంటర్నెట్, ఇంటి నుంచే 150 రకాల సేవలు' - టీఫైబర్, మీ సేవ యాప్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
World Test Championship points table: అడిలైడ్ ఓటమి, భారత్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం- చాలా సమీకరణాలు కలిస్తేనే తుదిపోరుకు ఛాన్స్
అడిలైడ్ ఓటమి, భారత్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం- చాలా సమీకరణాలు కలిస్తేనే తుదిపోరుకు ఛాన్స్
Praja Palana Vijayotsavalu: హైదరాబాద్ మెట్రో కారిడార్లు, స్టేషన్లలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సంరంభం
హైదరాబాద్ మెట్రో కారిడార్లు, స్టేషన్లలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సంరంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

భారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగంఅడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu - Manchu Manoj: అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
T Fiber: 'తక్కువ ధరకే ఇంటర్నెట్, ఇంటి నుంచే 150 రకాల సేవలు' - టీఫైబర్, మీ సేవ యాప్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
'తక్కువ ధరకే ఇంటర్నెట్, ఇంటి నుంచే 150 రకాల సేవలు' - టీఫైబర్, మీ సేవ యాప్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
World Test Championship points table: అడిలైడ్ ఓటమి, భారత్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం- చాలా సమీకరణాలు కలిస్తేనే తుదిపోరుకు ఛాన్స్
అడిలైడ్ ఓటమి, భారత్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం- చాలా సమీకరణాలు కలిస్తేనే తుదిపోరుకు ఛాన్స్
Praja Palana Vijayotsavalu: హైదరాబాద్ మెట్రో కారిడార్లు, స్టేషన్లలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సంరంభం
హైదరాబాద్ మెట్రో కారిడార్లు, స్టేషన్లలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సంరంభం
Farmers Resume Delhi Chalo March: రైతుల ఛలో ఢిల్లీ ఆందోళన, శంభు సరిహద్ద వద్ద భద్రత కట్టుదిట్టం - తరలివస్తున్న అన్నదాతలు
రైతుల ఛలో ఢిల్లీ ఆందోళన, శంభు సరిహద్ద వద్ద భద్రత కట్టుదిట్టం - భారీగా తరలివస్తున్న అన్నదాతలు
Tecno Phantom V Fold 2 5G: రూ.80 వేలలోనే ఫోల్డబుల్ ఫోన్ - టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 5జీ వచ్చేసింది!
రూ.80 వేలలోనే ఫోల్డబుల్ ఫోన్ - టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 5జీ వచ్చేసింది!
Top Headlines: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - గజ్వేల్‌లో తీవ్ర విషాదం, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - గజ్వేల్‌లో తీవ్ర విషాదం, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Crime News: నల్గొండ జిల్లాలో అమానవీయం - దివ్యాంగుడైన మామపై చెప్పుతో దాడి చేసిన కోడలు, మూగజీవి అడ్డుకున్నా..
నల్గొండ జిల్లాలో అమానవీయం - దివ్యాంగుడైన మామపై చెప్పుతో దాడి చేసిన కోడలు, మూగజీవి అడ్డుకున్నా..
Embed widget