Kartika Purnima 2024: కార్తీక పౌర్ణమి రోజు అరుదైన యోగం ..ఈ రాశులవారికి రాజయోగమే!
గ్రహాలు రాశి మారినప్పుడు ఆ ప్రభావం 12 రాశులవారిపైనా ఉంటుంది. కొన్ని రాశులవారికి అద్భుతమైన యోగాన్నిస్తాయి. కార్తీకమాసంలో అత్యంత విశిష్టమైన పౌర్ణమి రోజు ఈ రాశులవారిని అదృష్టం వరించనుంది
ఓ గ్రహం మరో గ్రహంతో కలసి సంచరించినప్పుడు కొన్ని యోగాలు ఏర్పడతాయి. కార్తీక పౌర్ణమి రోజు నుంచి మూడు రోజుల పాటూ చంద్రుడు - బృహస్పతి యుతి జరగబోతోంది. గురు గ్రహం ఈ ఏడాది మొత్తం వృషభ రాశిలోనే ఉన్నాడు.
ఏప్రిల్ 25న వృషభంలో అడుగుపెట్టిన బృహస్పతి.. అక్టోబరు 09 నుంచి అదే రాశిలో వక్రంలో సంచరిస్తున్నాడు... తిరిగి 2025 ఫిబ్రవరి 08 న వక్రం పూర్తవుతుంది. ప్రస్తుతం చంద్రుడు కూడా వృషభ రాశిలోనే ఉండడంతో..ఈ రెండు గ్రహాల సంయోగంతో కొన్ని గ్రహాల వారికి అద్భుతమైన రాజయోగం ఏర్పడబోతోంది..దీనినే గజకేసరి రాజయోగం అంటారు. ఈ మూడు రోజులు వీళ్లకు తిరుగులేదంతే...
Also Read: కార్తీక పౌర్ణమి ఈ ఏడాది (2024) ఎప్పుడొచ్చింది - ఈ రోజు విశిష్టత ఏంటి!
మేష రాశి
గజకేసరి రాజయోగం వల్ల మేష రాశివారికి ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి..అనుకోని ఆదాయం చేతికందుతుంది. ఆస్తులకు సంబంధించి కొనసాగుతున్న వివాదాలు పరిష్కరించుకునేందుకు అయినా, కొనుగోలు అమ్మకాలు చేపట్టినా ఇదే సరైన సమయం. కుటుంబంలో సంతోషం ఉంటుంది. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఉపశమనం పొందుతారు
వృషభ రాశి
చంద్రుడు-బృహస్పతి యుతి వల్ల వృషభ రాశివారికి టైమ్ మామూలుగా లేదు. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే సరైన సమయం. ప్రమోషన్, ఆర్థికలాభం ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలుంటాయి.సమయానికి డబ్బు చేతికందుతుంది.
కర్కాటక రాశి
గజకేసరి రాజయోగం వల్ల కొన్నాళ్లుగా కష్టాల్లో ఉన్న కర్కాటక రాశివారికి ఉపశమనం లభించనుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి. ఆదాయ మార్గాల అన్వేషణ సఫలం అవుతుంది. ఉద్యోగులు పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఉన్నత స్థానంలో ఉండే వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి.
Also Read: కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఏ సమయంలో వెలిగించాలి , ఎక్కడ వెలిగిస్తే మంచిది!
సింహ రాశి
కార్తీక పౌర్ణమి నుంచి సింహరాశివారికి మంచి ఫలితాలున్నాయి. ఆర్థికంగా మెరుగుదలకు అడుగు ముందుకు పడుతుంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
కన్యా రాశి
కార్తీక పౌర్ణమి నుంచి మూడు రోజుల పాటూ కన్యారాశివారు పట్టిందల్లా బంగారమే అన్నట్టుంటుంది. ఈ రాశివారికి భాగ్యస్థానంలో ఏర్పడుతున్న గజకేసరి రాజయోగం వల్ల ఉద్యోగం, వ్యాపారం, విద్యలో పురోగతి ఉంటుంది. నూతన ఉద్యోగంలో చేరేందుకు, ఉద్యోగం మారేందుకు ఇదే మంచి సమయం.
తులా రాశి
కార్తీక పౌర్ణమి నుంచి తులా రాశివారు చేపట్టిన పనులు విజయం వంతం అవుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. కుటుంబ పెద్దల ఆశీర్వచనం మీపై ఉంటుంది. ఆర్థికంగా లాభపడతారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆదాయం పెరుగుతుంది. అనుకోని డబ్బు చేతికందుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి.
Also Read: కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం ఎందుకు దాటాలి.. విశిష్టత ఏంటి.. కాలిన గడ్డి తీసుకొచ్చి ఏం చేయాలి!
ధనస్సు రాశి
కార్తీక పౌర్ణమి నుంచి ధనస్సు రాశివారి రాత మారబోతోంది. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. మీరు చేపట్టే ప్రతి పనిని ప్రణాళిక ప్రకారం పూర్తిచేస్తారు. అన్ని రంగాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
మకర రాశి
గజకేసరి రాజయోగం వల్ల మకర రాశివారికి ఈ మూడు రోజులు అద్భుతంగా కలిసొస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఆరోగ్యోం బావుంటుంది. ఇల్లు, వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటే అడుగు ముందుకుపడుతుంది.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.