Horoscope Today 28 November 2024: ఈ రాశులవారి ఆలోచనలు చాలా దూకుడుగా ఉంటాయి!
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Horoscope Today November 28, 2024
మేష రాశి
ఈరోజు ఈ రాశి ఉద్యోగులకు అకస్మాత్తుగా పని ఒత్తిడి పెరగవచ్చు. కొత్త వ్యాపార ఒప్పందాలలో అడ్డంకులు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో ఇబ్బందులుంటాయి. ఇతరుల వివాదాలలో మీరు తలదూర్చవద్దు.
వృషభ రాశి
ఈ రోజు మీ ఆలోచనలు దూకుడుగా ఉంటాయి. మానసికంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. కానీ ఇతరుల భావాలపై కూడా శ్రద్ధ వహించాలి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఫిట్ నెస్ పై కాన్సన్ ట్రేట్ చేయాలి.
మిథున రాశి
ఈ రాశివారు వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టేముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. పరిస్థితులకు అనుగుణంగా మీ స్వభావం మార్చుకోవాల్సి ఉంటుంది. డిప్రెషన్ ఆలోచనలు మనసులోకి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉంటారు. ఆదాయం బాగానే ఉంటుంది.
Also Read: డిసెంబరు 02 నుంచి మార్గశిర మాసం.. 4 గురువారాలు ఇలా పూజ చేస్తే లక్ష్మీ అనుగ్రహం!
కర్కాటక రాశి
ఈ రోజు పోటీ పరీక్షల ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థిక సంబంధిత విషయాల్లో అదృష్టవంతులు అవుతారు. మీ అభిరుచికి అనుగుణంగా పని చేయడం ద్వారా మీరు ప్రయోజనాలను పొందుతారు.
సింహ రాశి
ఈ రోజు మీరు కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. స్నేహితులను కలుస్తారు. కుటుంబం కోసం సమయం కేటాయిస్తారు. మీ సొంత నిర్ణయాలు తీసుకోండి. ఆస్తులు కొనుగోలు చేసేముందు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించండి. ఆస్తి పంపిణీకి సంబంధించిన విషయాల్లో వివాదాలుంటాయి
కన్యా రాశి
ఈ రోజు మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపార పనులపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. పిల్లల చదువుల పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. మీ మానసిక స్థితి ప్రశాంతంగా ఉంటుంది. కార్యాలయంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. సన్నిహితులతో అర్థవంతమైన చర్చ ఉంటుంది.
తులా రాశి
ఈ రోజు ఉద్యోగం గురించి ఆందోళన చెందుతారు. పనికిరాని పనులపై మీ సమయాన్ని వృథా చేయకండి. అహంకార వ్యక్తిత్వాన్ని ప్రదర్శించకుండా ఉండాలి. ఓపికతో పనిచేస్తే విజయం వరిస్తుంది. ప్రయాణాల్లో ఉండేవారు ముఖ్యమైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించండి.
వృశ్చిక రాశి
ఈ రోజు మీరు మీ ప్రత్యర్థులతో ఒప్పందానికి రావచ్చు. కొత్త స్నేహితులు ఏర్పడతారు. లక్ష్య సాధనకు కృషి చేస్తాపు. త్వరలో అర్థవంతమైన ఫలితాలను పొందుతారు. కుటుంబంతో సరదాగా గడుపుతారు.
Also Read: 108 వైష్ణవ క్షేత్రాల్లో మొదటిది.. దేశంలోనే అతి పెద్ద ఆలయం ..ధనుర్మాసంలో దర్శించుకుంటే జన్మ ధన్యం!
ధనస్సు రాశి
ఈ రోజు మీరు దాంపత్య జీవితాన్ని పూర్తిగా ఆనందిస్తారు. కార్యాలయంలో మీ అధికారం పెరిగే అవకాశం ఉంది. మీరు క్లిష్టమైన సమస్యలను చర్చించడానికి ప్లాన్ చేసుకుంటారు. ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి.
మకర రాశి
వ్యాపారస్తులు వ్యాపారం పెంచుకునేందుకు ప్రణాళికలు వేసుకోవాలి. పెద్దల ఆశీశ్సులు మీపై ఉంటాయి. తప్పుడు వ్యవహారాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి.
కుంభ రాశి
ఈ రోజు మీ ప్రత్యర్థులకు మీరు టార్గెట్ అవుతారు. మనసులో అస్థిరత ఉంటుంది. వివావేతర సంబంధాలకు దూరంగా ఉండడం మంచిది. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త.
Also Read: దేవుడు ప్రతిచోటా ఉన్నాడు కదా..ఆలయాలకు ఎందుకు వెళ్లాలి - వెళ్లకపోతే భక్తి లేనట్టేనా!
మీన రాశి
ఈ రోజు ఈ రాశివారు ధనలాభం పొందే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. భవిష్యత్తు కోసం పెద్ద ప్రణాళికలు వేయవచ్చు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయం పొందుతారు. చేసే పని పట్ల ఏకాగ్రత ఉంటుంది. నూతన వ్యవహారాలు ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.