Horoscope Today 23 November 2024: ఈ రాశులవారికి ఇంటా-బయటా గౌరవం పెరుగుతుంది
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Horoscope Today November 23, 2024
మేష రాశి
ఈ రోజు కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. ఈ రాశి స్త్రీలు పిల్లల విషయంలో కొంచెం ఆందోళన చెందుతారు. ఆత్మీయులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. షేర్ మార్కెట్ నుంచి భారీ ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. కళలపై ఆసక్తి కలిగి ఉంటారు.
వృషభ రాశి
ఈ రోజు కొత్త ఖర్చుల కారణంగా మీరు అనుభవజ్ఞులైన వ్యక్తుల నుంచి మార్గదర్శకత్వం పొందవచ్చు. సహోద్యోగులతో పాత విభేదాలు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇతరుల విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టవద్దు. అయితే ఇది మీ సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మీ బాధ్యతలను అర్థం చేసుకుని మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టండి.
మిథున రాశి
ఈ రోజు మీ మానసిక స్థితి బావుంటుంది. నూతన ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు. అదృష్టం కలిసొస్తుంది. కార్యాలయంలో ఉన్నత అధికారుల నుంచి సహాయం అందుతుంది.
Also Read: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
కర్కాటక రాశి
ఈ రోజు మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ప్రభుత్వ పనుల్లో వచ్చిన ఆటంకాలు తొలగిపోతాయి. ఈ రాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు రావచ్చు. సహోద్యోగుల కారణంగా సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బాధ్యతల విషయంలో నిర్లక్ష్యం వద్దు.
సింహ రాశి
ఏదైనా పనికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రేమ వివాహానికి కుటుంబ సమ్మతి లభిస్తుంది. మీ ప్రత్యర్థులు మీ ముందు చాలా బలహీనంగా కనిపిస్తారు. అనవసర ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రణాళిక రూపొందిస్తారు. వ్యాపారంలో లాభం ఉంటుంది.
కన్యా రాశి
ఈ రోజు మొత్తం పనికిరాని పనుల కారణంగా సమయం వృధా చేస్తారు. పని నాణ్యతపై శ్రద్ధ వహించండి. కుటుంబంలో కొన్ని చికాకులు ఉంటాయి. మీ తొందరపాటు స్వభావాన్ని నియంత్రించుకోకుంటే వ్యాపారంలో పెద్ద నష్టం జరగవచ్చు. కొంత లోటు వల్ల మనసులో టెన్షన్ ఉంటుంది.
Also Read: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు వర్చువల్ క్యూ బుకింగ్ ఆన్ లైన్లో ఇలా ఈజీగా చేసేసుకోండి!
తులా రాశి
ఈ రోజు మీకు కలిసొచ్చే రోజు. ఇంట్లో వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీవిత భాగస్వామికి మంచి సమయం కేటాయిస్తారు.పాత స్నేహితులను కలుస్తారు. మీరు తీసుకున్న నిర్ణయాలు సరైనవే అని రుజువు అవుతుంది.
వృశ్చిక రాశి
ఈ రోజు కొన్ని పనులకు సంబంధించి కొత్త ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. మీ ప్రియమైనవారి భావాలను పరిగణలోకి తీసుకోండి. మీ భావాలను వ్యక్తీకరించడం మీకు కష్టంగా ఉంటుంది. ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే వ్యక్తులు ప్రమోషన్ పొందవచ్చు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అభినందిస్తారు
ధనస్సు రాశి
ఇంటా బయటా మీ ఖ్యాతి పెరుగుతుంది. చాలా రోజులుగా ఉన్న పని ఒత్తిడి దూరమవుతుంది. అందరూ మీతో ఏకీభవించేలా చేయడంలో మీరు విజయం సాధిస్తారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ సూత్రాలతో రాజీపడకండి. ఈరోజు మీరు కొత్త సమాచారాన్ని అందుకుంటారు. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కి హాజరైతే విజయం సాధిస్తారు
మకర రాశి
ఈ రోజు కొన్ని పనుల గురించి ఆందోళనలు ఉంటాయి. గుండె రోగులు ఈరోజు ఒత్తిడితో కూడిన కారణాలకు దూరంగా ఉండాలి. మీరు రుణం కోసం దరఖాస్తు చేయాలనుకుంటే ఈ రోజు అస్సలు మంచి రోజు కాదు. ఎవరి సలహాలను అయినా వెంటనే పాటించవద్దు..మరోసారి మీరు ఆలోచించండి.
కుంభ రాశి
ఈ రోజంతా సంతోషంగా స్పెండ్ చేస్తారు. పిల్లలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. పెద్దలు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. మీ పని తీరులో చాలా మార్పు ఉంటుంది. ఇంట్లో , కార్యాలయంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది.
మీన రాశి
ఈ రోజు మీకు టైమ్ కలిసొస్తుంది. రోజంతా బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి తగినంత సమయం ఇస్తారు. ప్రయాణం చేయాలి అనుకుంటే అప్రమత్తంగా వ్యవహరించండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయంలో ఎలాంటి మార్పులు ఉండవు..
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: కడప దర్గాకి రామ్ చరణ్ - అయ్యప్ప మాలధారులు మసీదు, దర్గాలకు వెళ్లొచ్చా!