అన్వేషించండి

Most Selling Car 2025: హ్యుందాయ్ క్రెటా SUV కొనాలనుకుంటున్నారా? హైదరాబాద్‌లో డౌన్ పేమెంట్ ఎంతవుతుందో తెలుసుకోండి!

Hyundai Creta SUV Down Payment: హైదరాబాద్‌లో హ్యుందాయ్ క్రెటా బేస్ మోడల్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 13.75 లక్షలు. ఈ కారు కొనడానికి డౌన్ పేమెంట్ ఎంత అవుతుంది? తెలుసుకుందాం.

Hyundai Creta Price, Mileage And Features In Telugu: భారత మార్కెట్లో హ్యుందాయ్ క్రెటాకు భారీ డిమాండ్‌ కంటిన్యూ అవుతోంది, చాలా ఎక్కువగా అమ్ముడవుతున్న కార్లలో ఇది కూడా ఒకటి. గత నెల (జులై 2025) అమ్మకాల నివేదికను బట్టి, SUV అమ్మకాల జాబితాలో ఈ కారు మొదటి స్థానంలో ఉంది. దీనిని బట్టి, ఈ కారు కోసం జనం ఎంత తపిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. బడ్జెట్-ఫ్రెండ్లీ కారు కావడం, ప్రీమియం కార్లలో ఉండే ఫీచర్లు ఉండడం వల్ల దీనిని ప్రజలు ఎక్కువగా కొన్నారు & కొంటున్నారు. 

Hyundai Creta ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.11 లక్షల నుంచి ప్రారంభమై, వేరియంట్‌ను బట్టి రూ. 20.42 లక్షల వరకు ఉంటుంది. హ్యుందాయ్ క్రెటా కారు పెట్రోల్ & డీజిల్ వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది.

హైదరాబాద్‌/ విజయవాడలో ఈ కారు కొనడానికి కార్‌ లోన్‌ దొరుకుతుందా? 

హైదరాబాద్‌/ విజయవాడలో, హ్యుందాయ్ క్రెటా బేస్ మోడల్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 13.75 లక్షలు. ఇందులో.. ఎక్స్‌-షోరూమ్‌ ధరతో పాటు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన వివిధ పన్నులు (RTO), బీమా, ఇతర అవసరమై ఖర్చులు కలిసి ఉంటాయి. మీ క్రెడిట్‌ స్కోర్‌ బాగుంటే, హ్యుందాయ్‌ క్రెటాను కారు రుణంపై కూడా కొనుగోలు చేయవచ్చు, బ్యాంక్‌ మీకు కార్‌ లోన్‌ మంజూరు చేస్తుంది.

కనీసం ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి?

హ్యుందాయ్ క్రెటా బేస్‌ వేరియంట్‌ కొనడానికి రూ. 50,000 డౌన్‌పేమెంట్‌ సరిపోదు. మీరు కనీసం రూ. 2,75,000 డౌన్ పేమెంట్ (కారు ఆన్‌-రోడ్‌ ధరలో 20%) చేస్తే, మిగిలిన రూ. 11 లక్షలను (కారు ఆన్‌-రోడ్‌ ధరలో 80%) బ్యాంక్‌ కార్‌ లోన్‌గా ఇస్తుంది. బ్యాంక్‌ ఈ రుణాన్ని 9 శాతం వడ్డీ రేటుతో ఇచ్చిందని భావిద్దాం. ఇప్పుడు EMI ఆప్షన్స్‌ చూద్దాం.

ప్రతి నెలా రూ. 17,705 EMI చెల్లిస్తే, మీ కార్‌ లోన్‌ 7 సంవత్సరాల్లో పూర్తిగా తీరిపోతుంది. వడ్డీ రూపంలో మొత్తం రూ. 3,86,754 బ్యాంక్‌కు మీరు చెల్లించాలి.

నెలకు రూ. 19,836 EMI చొప్పున కడితే, మీ కారు రుణం తీరడానికి 6 సంవత్సరాలు పడుతుంది. ఈ కాలంలో బ్యాంక్‌కు వడ్డీ రూపంలో మొత్తం రూ. 3,27,726 మీరు చెల్లిస్తారు.

నెలనెలా రూ. 22,843 EMI ని ఆటో-డెబిట్‌ పెట్టుకుంటే, మీ అప్పు 5 సంవత్సరాల్లో క్లియర్‌ అవుతుంది. బ్యాంకుకు వడ్డీ రూపంలో మొత్తం రూ. 2,70,114 చెల్లిస్తారు.

మంత్లీ రూ. 27,385 EMI కట్టగలిగితే, మీ కార్‌ లోన్‌ను 4 సంవత్సరాల్లో చెల్లు వేయవచ్చు. ఈ కాలంలో బ్యాంక్‌కు వడ్డీ రూపంలో మొత్తం రూ. 2,14,014 మీరు చెల్లిస్తారు.

హ్యుందాయ్ క్రెటా ఇంజిన్‌ ఆప్షన్స్‌ & మైలేజీ

హ్యుందాయ్ క్రెటా 2025 మోడల్‌లో మూడు ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి, అవి.. 

17.4 నుంచి 18.2 kmpl వరకు మైలేజీని అందించే 1.5L నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్

ఎక్కువ పవర్‌ & రిఫైన్‌మెంట్‌కు ప్రసిద్ధి చెందిన 1.5L టర్బో పెట్రోల్ ఇంజన్ 

21.8 kmpl వరకు గొప్ప ఇంధన సామర్థ్యాన్ని అందించే 1.5L డీజిల్ ఇంజన్

హ్యుందాయ్ క్రెటా 2025 మోడల్‌ ఇంజిన్లు మాన్యువల్, CVT & 7-స్పీడ్ DCT ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉన్నాయి, మీ డ్రైవింగ్‌ స్టైల్‌ను బట్టి ట్రాన్స్‌మిషన్‌ను ఎంచుకోవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

గురు గోచారం 2026: ఆశ్లేష నక్షత్రంలో గురుడు, ఈ 3 రాశులవారికి రహస్య శత్రువుల బెడద!
గురు గోచారం 2026: ఆశ్లేష నక్షత్రంలో గురుడు, ఈ 3 రాశులవారికి రహస్య శత్రువుల బెడద!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget