CNG Cars Under Rs 6 Lakhs: రూ.6 లక్షల లోపల 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వచ్చే 5 చౌక CNG కార్లు – మైలేజ్ డీటెయిల్స్ ఇవే!
Affordable CNG Cars With 6 Airbags: భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన & నమ్మదగిన CNG కార్లను గురించి ఈ కథనంలో తెలుసుకుంటారు. ఇవి రూ. 6 లక్షల కంటే తక్కువ ధరలో (ఎక్స్-షోరూమ్) వస్తాయి.

Best CNG Cars 2025 With 6 Airbags Under Rs 6 Lakhs: పెట్రోల్ & డీజిల్ ఖర్చులు సామాన్యుడు భరించే స్థాయికి మించడంతో, ఆటోమొబైల్ రంగంలో CNG వాహనాలు కొత్త ట్రెండ్‌ను సృష్టించాయి. ఈ కార్లు చౌకగా లభించడమే కాకుండా దీర్ఘకాలంలో ఇంధన ఖర్చులను బాగా ఆదా చేయగలవు. భారతదేశంలో, ఇప్పుడు, తక్కువ ధరలో నమ్మదగిన CNG కార్లు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ రూ. 6 లక్షల కంటే తక్కువ ధరలో (ఎక్స్-షోరూమ్) వస్తాయి & మీ కుటుంబానికి 6 ఎయిర్‌బ్యాగ్‌ల భద్రతను కూడా అందిస్తాయి.
6 ఎయిర్‌బ్యాగ్‌లున్న 5 చౌకైన CNG కార్లు - ధర రూ.6 లక్షల లోపు
మారుతి సుజుకి ఆల్టో K10
తక్కువ ధరలో, సురక్షితమైన & అధిక మైలేజ్ ఇచ్చే CNG కారు కోసం చూస్తున్నవాళ్లకు Maruti Suzuki Alto K10 CNG కారు గొప్ప ఎంపిక కావచ్చు. దీని బేస్ వేరియంట్ ధర రూ. 5.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది & ఇది కిలో CNGకి 33.85 కి.మీ. మైలేజీని ఇస్తుంది. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగులు, ABS, EBD & ESP వంటి భద్రత ఫీచర్లతో పాటు 7-అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ క్లస్టర్, కీలెస్ ఎంట్రీ & పవర్ ORVM వంటి ఫీచర్లు ఉన్నాయి.
టాటా టియాగో
భారతీయులకు, Tata Tiago CNG ఒక నమ్మకమైన కారు. ఆధునిక ఫీచర్లు & పనితీరు మధ్య గొప్ప సమతుల్యతను ఇది అందుస్తుంది. టాటా టియాగో సీఎన్‌జీ ప్రారంభ ధర రూ. 6 లక్షలు & ఇది 28.06 కి.మీ./కిలో వరకు మైలేజీని ఇస్తుంది. పెద్ద 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ & TPMS వంటి అధునాతన ఫీచర్లు దీనిలో చూడవచ్చు. మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో లభ్యమవుతోంది.
మారుతి సుజుకి విటారా బ్రెజ్జా
అత్యంత ఇంధన సామర్థ్యం గల CNG కారును కొనుగోలు చేయాలనుకుంటే, Maruti Suzuki Celerio CNG మీకు సరైనది. రూ. 6.89 లక్షల ప్రారంభ ధర & 34.43 కి.మీ./కిలో మైలేజీతో, ఈ కారు ఇంధన సామర్థ్యం & ఆర్థిక సామర్థ్యం రెండింటిలోనూ అద్భుతమైన ఆప్షన్. ఇది 7-అంగుళాల స్మార్ట్‌ప్లే టచ్‌స్క్రీన్ & ప్రయాణీకులకు అవసరమైన భద్రత లక్షణాలన్నీ ఈ కారులో ఉన్నాయి.
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ CNG
విశాలమైన ఇంటీరియర్స్, నమ్మకమైన పనితీరు & కిలో CNGకి 34.05 కి.మీ. అద్భుతమైన మైలేజ్ ఇచ్చే లక్షణాల కారణంగా... Maruti Suzuki Wagon R CNG సగటు భారతీయ కుటుంబానికి అనుకూలమైన ఎంపిక అవుతుంది. దీని బేస్ వేరియంట్ ధర రూ. 6.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు 1.0లీ & 1.2లీ పెట్రోల్-CNG ఇంజిన్ ఆప్షన్‌లలో లభిస్తుంది.
టాటా పంచ్ CNG
CNG మైలేజీతో పాటు SUV లుక్స్ & స్టైల్ కోరుకునే కస్టమర్లకు Tata Punch CNG ఒక తెలివైన ఎంపిక అవుతుంది. రూ. 7.30 లక్షల ప్రారంభ ధరతో, ఇది 26.99 కి.మీ./కి.గ్రా. వరకు మైలేజీని ఇస్తుంది. సన్‌రూఫ్, పెద్ద టచ్‌స్క్రీన్ & క్లైమేట్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లు ఈ కారు సొంతం, ఇవన్నీ మీకు ప్రీమియం కారు అనుభూతిని ఇస్తాయి.
ఈ కార్లన్నింటిలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా ఉంటాయి. పైన చెప్పినవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. RTO, బీమా, ఇతర అవసరమైన ఖర్చులు కలుపుకుంటే ఆన్-రోడ్ ధర వస్తుంది.





















