Horoscope Today: ఈరోజు రాశిఫలాలు....ఈ రాశులవారు కోపం తగ్గించుకోకుంటే చాలా నష్టపోతారు….
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
ఆగస్టు 6 , 2021 రాశిఫలాలు
మేషం
ఈ రోజు మీ ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు...మీరు అప్రమత్తంగా ఉండండి. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించండి. కెరీర్ సంబంధిత నిర్ణయాలకు ఇది మంచి సమయం కాదు. ఈ రోజు మీరు మీ కుటుంబంతో రోజు గడుపుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీ మాటపై సంయమనం పాటించండి. ముఖ్యమైన విషయాలను బంధువులతో చర్చించవచ్చు..
వృషభం
వృషభరాశివారికి ఈ రోజు ఎవరితోనైనా వివాదం ఉంటుంది. వ్యయాన్ని నియంత్రించండి...విలువైన వస్తువులను రక్షించండి. ఉద్యోగాలు మారే అవకాశం ఉంటుంది. ఆర్థిక లావాదేవీల సమయంలో అజాగ్రత్తగా ఉండకండి. పని సమయానికి పూర్తయ్యే అవకాశం ఉంది. సామాజిక సేవ చేసే బాధ్యతను పొందుతారు. పిల్లల మూలంగా సంతోషంగా ఉంటారు.
మిథునం
మిథునరాశివారిని అదృష్టం వరిస్తుంది. మనస్సు మతపరమైన పనుల్లో నిమగ్నమైఉంటుంది. ఉద్యోగులు పురోగతి సాధించగలరు. ఈ రోజు మీరు డబ్బు పొందుతారు. విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మానసికంగా మీరు బలంగా ఉంటారు. జీవిత భాగస్వామి నుంచి మంచి సమాచారాన్ని పొందుతారు. రోజువారీ కార్యకలాపాల్లో మార్పులుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వ్యాపారులకు ఈరోజు కలిసొస్తుంది. ఉద్యోగస్తులు పనిలో బిజీగా ఉంటారు. రిస్క్ తీసుకోకండి. బంధువు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రేమికులకు కలిసొచ్చేరోజు. ఈ రోజు మీరు కెరీర్ గురించి మంచి సమాచారాన్ని పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. తెలియని వ్యక్తులను వెంటనే నమ్మవద్దు. పెద్దల ఆశీస్సులు పొందుతారు.
సింహం
ప్రయాణాలను వాయిదావేయండి. ఈరోజు కొంత ఆందోళనగా ఉంటారు. ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఉండవచ్చు. పనిలో ఆటంకాలు ఏర్పడవచ్చు. వ్యాపారం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యునితో వివాదాలు ఉండవచ్చు. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. నిలిచిపోయిన పని పూర్తయ్యే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు దూషించే పదాలు వాడొద్దు...
కన్య
మీ రోజు మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు అన్ని బాధ్యతలను పూర్తి చేయగలరు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులను కలుస్తారు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. భారీ యంత్రాల పనులను జాగ్రత్తగా నిర్వహించండి. రిస్క్ తీసుకోకండి. పెట్టుబడులకు అనుకూలమైన రోజు. మానసికంగా బలంగా ఉంటారు. ఈ రాశి వృద్ధులకు ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు.
తులారాశి
ఈ రోజు ఆర్థికంగా కలిసొచ్చేరోజు. రుణాలు తీసుకోవద్దు. జీవిత భాగస్వామితో సామరస్యం ఉంటుంది. ఆఫీసులో సహోద్యోగులు మీకు సహాయం చేస్తారు. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. విహారయాత్రకు వెళ్లడానికి ప్రణాళిక రూపొందిస్తారు. ఆధ్యాత్మిక ప్రసంగాన్ని ఆస్వాదిస్తారు. తెలియని వ్యక్తులతో జాగ్రత్త.
వృశ్చికరాశి
వృశ్చికరాశివారికి ఈ రోజు కుటుంబ పనితో పాటు, ఆఫీసులో కూడా చాలా బాధ్యత ఉంటాయి. మీరు పని మీద దృష్టి సారించండి. వ్యాపారానికి సంబంధించి ప్రయాణం చేయాల్సి రావచ్చు. పెట్టుబడి అవకాశాలు అందుబాటులో ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. స్నేహితులతో వివాదాలు ఉండొచ్చు. బంధువులను కలుస్తారు. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.
ధనుస్సు
ధనస్సు రాశివారి ప్రతిష్ట పెరుగుతుంది. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఏపనిలోనూ రిస్క్ తీసుకోకండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. బంధువు నుంచి మీకు శుభవార్తలు అందుతాయి. తెలియని వ్యక్తులు మీకు హాని కలిగించవచ్చు. మీరు మీ దినచర్యను మార్చుకోవచ్చు.
మకరం
వ్యాపార మందగమనం దూరమవుతుంది. ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. కొత్త ఆదాయ అవకాశాలు లభిస్తాయి. యువత ఉద్యోగాలు పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సమాజంలో ప్రశంసలందుకుంటారు. భూమి లేదా ఇంటిలో పెట్టుబడి పెట్టొచ్చు. న్యాయపరమైన విషయాల్లో మీరు విజయం సాధిస్తారు. పెద్దల మద్దతు లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపడకండి.
కుంభం
కుంభరాశివారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. బంధువుల నంచి విచారకరమైన వార్తల అందుకోవచ్చు. స్నేహితులతో సమయం గడుపుతారు. మీ ప్రణాళిక కార్యరూపం దాల్చుతుంది. మద్యపానం, లాటరీ, జూదం వంటి వ్యసనాలు మానుకోండి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. మాట మీద సంయమనం పాటించండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మీనం
ఈ రోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది. విరాళాలు ఇవ్వవచ్చు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. నైపుణ్యం పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి. స్నేహితుడితో వాదన ఉండవచ్చు. కోపాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. అవివాహితులకు వివాహం కుదిరే సూచన.