News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

సెప్టెంబరు 18 రాశిఫలాలు: వినాయకచవితి రోజు ఏ రాశివారికి శుభ ఫలితాలున్నాయంటే!

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

FOLLOW US: 
Share:

సెప్టెంబరు 18 రాశిఫలాలు

మేష రాశి
మీరు ఈ రోజు ప్రారంభించిన పనిని చాలా తేలికగా చేస్తారు. వ్యాపార సంక్లిష్టతలను పరిష్కరించడంలో బిజీగా ఉంటారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వైవాహిక జీవితం బావుంటుంది. దినచర్య మెరుగుపడుతుంది.

వృషభ రాశి 
ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈ రోజు మంచి రోజు. పని ఒత్తిడి మీపై తక్కువగా ఉంటుంది. భవిష్యత్ కోసం కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. వ్యాపారం బాగానే సాగుతుంది. కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. వివాహితులకు సంతోష సమయం.

మిధున రాశి 
మీరు అవసరమైన సమయంలో సన్నిహితుల నుంచి సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు  బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపార విస్తరణలో అడ్డంకులు ఉండవచ్చు. రహస్య విషయాలను అధ్యయనం చేస్తారు

Also Read: మీ స్నేహితులు, సన్నిహితులకు వినాయకచవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!

కర్కాటక రాశి 
ఈ రాశివారు కార్యాలయ విషయాల్లో చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. సోమరితనం వల్ల కొన్ని పనుల్లో జాప్యం జరగవచ్చు. ఆర్థిక ఇబ్బందులుంటాయి. టెక్నాలజీ రంగానికి సంబంధించిన వ్యక్తులకు సమయం చాలా మంచిది. దాన ధర్మాలు చేయడంపై ఆసక్తి చూపిస్తారు. 

సింహ రాశి
ఈ రాశివారికి గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. సోమరితనం వదిలి పనిపై దృష్టి సారిస్తే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. కొన్ని ప్రత్యేక విషయాలపై కుటుంబ సభ్యులతో చర్చిస్తారు.

కన్యా రాశి 
ఈ రాశివారు రోజంతా సంతోషంగా ఉంటారు. స్నేహితులకు సమయం కేటాయిస్తారు. సృజనాత్మక పనులపై ఆసక్తి చూపిస్తారు. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ పరిచయాలు పెరుగుతాయి. వినాయకుడి ఆశీస్సులు మీపై ఉంటాయి. 

తులా రాశి
ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీ వ్యక్తిత్వం అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది. మనసులో కొత్త ఆలోచనలు వస్తాయి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెడతారు. అనారోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.

వృశ్చిక రాశి 
ఈ రాశివారు ప్రత్యర్థులపై నిఘా ఉంచాలి. రహస్య సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులతో మంచి సంబంధాలను కొనసాగించాలి. పనిలో గోప్యత పాటించాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో వివాదాలుంటాయి జాగ్రత్త

Also Read: పార్వతీ తనయుడికి తొలి పూజ ఎందుకు, మీకు ఈ విషయాలన్నీ తెలుసా!

ధనుస్సు రాశి
మీ బాధ్యతల వల్ల పనిపై నుంచి దృష్టి మరల్చాల్సిన పరిస్థితులువస్తాయి. వాటిని ఎదుర్కోగలిగితే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేస్తారు. నిరుద్యోగుల అన్వేషణ ఫలిస్తుంది. భాగస్వామ్య ప్రణాళికలు అమలు చేయడంలో సక్సెస్ అవుతారు. 

మకర రాశి
ఈ రాశివారికి రాజకీయ నాయకులతో సంబంధాలు బలపడతాయి. రోజంతా సంతోషంగా ఉంటారు. చాలా కాలంగా ఎదురుచూసిన వస్తువులు మీకు లభిస్తాయి. వైవాహిక జీవితం బావుంటుంది. కుటుంబానికి సమయం కేటాయించండి.

కుంభ రాశి
ఈ రాశివారు మనసులో ఉన్న ఆందోళనను కుటుంబ పెద్దలతో పంచుకోవాలి. ఆర్థిక లావాదేవీలలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. మీ తెలివితేటలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. సామాజిక బంధాలు మెరుగుపడతాయి. ఉద్యోగులు కార్యాలయంలో వివాదాలకు దూరంగా ఉండాలి

మీన రాశి 
బంధాలు నిలబడాలంటే మీరు అహంకారాన్ని వీడాలి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. ఉద్యోగులు పనిపై సంపూర్ణంగా శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా ఉంచాలి. విద్యార్థులు ఫ్యూచర్ ప్లాన్స్ లో ఉంటారు. 

పసుపు గణపతి పూజ లింక్ ఇది

గణపతి షోడసోపచార పూజ లింక్ ఇది

ఈ పూజ పూర్తైన తర్వాత  అక్షతలు, పూలు చేత్తో పట్టుకుని వినాయకుడి కథలు చదువుకోవాలి...ఆ లింక్ ఇదే

Published at : 18 Sep 2023 03:55 AM (IST) Tags: daily horoscope Horoscope Today astrological prediction Today Horoscope 18th September 2023 Horoscope

ఇవి కూడా చూడండి

Vastu Tips In Telugu: అద్దె ఇంటికి వాస్తు వర్తిస్తుందా -వర్తించదా!

Vastu Tips In Telugu: అద్దె ఇంటికి వాస్తు వర్తిస్తుందా -వర్తించదా!

Ganesh Nimajjanam 2023 : గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది !

Ganesh Nimajjanam 2023 : గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది !

ఈ రాశులవారు చెడు సహవాసాలను వదులుకుంటే మంచిది, సెప్టెంబరు 27 రాశిఫలాలు

ఈ రాశులవారు చెడు సహవాసాలను వదులుకుంటే మంచిది, సెప్టెంబరు 27 రాశిఫలాలు

Chanakya Niti In Telugu : మీ జీవితంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడని 8 మంది వీళ్లే!

Chanakya Niti In Telugu : మీ జీవితంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడని 8 మంది వీళ్లే!

Vishnu Sahasranamam: విష్ణుసహస్రం పారాయ‌ణం చేయాల్సిన సందర్భాలివే!

Vishnu Sahasranamam: విష్ణుసహస్రం పారాయ‌ణం చేయాల్సిన సందర్భాలివే!

టాప్ స్టోరీస్

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో

Ram Skanda Movie : 'స్కంద' కోసం రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగారో తెలుసా?

Ram Skanda Movie : 'స్కంద' కోసం రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగారో తెలుసా?

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు

Tiger 3 Teaser : 'టైగర్ 3'లో సల్మాన్ ఖాన్ దేశభక్తుడా? దేశ ద్రోహిగా మారాడా?

Tiger 3 Teaser : 'టైగర్ 3'లో సల్మాన్ ఖాన్ దేశభక్తుడా? దేశ ద్రోహిగా మారాడా?