Horoscope Today September 14: ఈ రాశులవారికి ఈ రోజు చాలా మంచిరోజు, సెప్టెంబరు 14 రాశిఫలాలు
Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.
Horoscope Today September 14, 2023: (సెప్టెంబరు 14 రాశిఫలాలు)
మేష రాశి
ఈ రాశి విద్యార్థులు అధ్యయనంపై దృష్టి సరిస్తారు. అనారోగ్య సమస్యలు ఉంటాయి జాగ్రత్త. కుటుంబ జీవితం బావుంటుంది. ఉద్యోగులు అధికారులతో అర్థవంతమైన చర్చలు జరుపుతారు. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. వ్యాపారం బాగానే సాగుతుంది. ముఖ్యమైన సమస్యలు పరిష్కారం అవుతాయి.
వృషభ రాశి
ఈ రాశివారి ఆరోగ్యం బావుంటుంది. మీరు మోసపోయే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండాలి. ఇతరులకు అసౌకర్యంగా ఉండే ఏ పని చేయకండి. ఇంటి ఖర్చుల వల్ల మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. తెలియని వ్యక్తులతో ఎక్కువగా చర్చలు పెట్టొద్దు. ఉద్యోగులు, వ్యాపారులు తమ పనులపై దృష్టి సారించాలి.
మిథున రాశి
ఈ రాశివారు ఈ రోజు ప్రయాణం చేయాల్సిన అవసరం రావొచ్చు. మీ అభిరుచులకోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కన్నా మెరుగుపడుతుంది. ఈ రోజు అనుకున్న పనులు నిర్ణీత సమయానికి ముందే పూర్తి చేస్తారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు ఉండవచ్చు.
కర్కాటక రాశి
ఈ రాశివారు ఈరోజు అనుకోని ప్రయోజనాలను పొందుతారు. వైవాహిక సంబంధాలలో పరస్పర సామరస్యం ఉంటుంది. ఇంట్లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ మానసిక స్థితిని దృఢంగా ఉంచుకోండి. మీ సామర్థ్యం పెరుగుతుంది. కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంది.
సింహ రాశి
ఈ రాశివారు ఈ రోజంతా సందడిగా, బిజీగా ఉంటారు. ఉద్యోగులకు సీనియర్ అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు..ఎలాంటి ఆటంకాలు ఎదురైనా తొలగిపోతాయి. కొత్త వ్యాపారావకాశాలు లభిస్తాయి. మీరు ఇంటర్వ్యూలో విజయం సాధించవచ్చు.
Also Read: సెప్టెంబరు 17 తర్వాత ఈ రాశులవారికి అదృష్టం, ఆదాయం!
కన్యా రాశి
ఈ రాశివారు వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఒకరి విమర్శలు మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఉద్వేగభరితంగా ఉండటం వల్ల మంచి విషయాలు కూడా మీకు చెడుగా అనిపించవచ్చు. మీ విజయాలతో పెద్దలు సంతోషిస్తారు. సామాజిక స్థాయిలో ప్రజల్లో గుర్తింపు పెరుగుతుంది.
తులా రాశి
ఈ రాశివారు ఎవ్వర్నీ గుడ్డిగా నమ్మొద్దు. పోగొట్టుకున్న విలువైన వస్తువులు లేదా డబ్బు తిరిగి రావచ్చు. మీరు మతపరమైన ఆసక్తి ఉన్న వ్యక్తులతో కనెక్ట్ కావచ్చు. దంపతులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. మనసులో ప్రతికూల ఆలోచనలు రావచ్చు. కార్యాలయంలో ఉద్యోగులతో సంబంధాలు చాలా బాగుంటాయి.
వృశ్చిక రాశి
ఈ రాశివారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించగలరు. కార్యాలయంలో గ్రూపుగా పని చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. సంబంధాలను కాపాడుకోవడానికి సంయమనం చూపండి. మీరు పోటీ పరీక్షలలో విజయం సాధించవచ్చు. పిల్లలకు చాలా సమయం ఇస్తారు.
ధనుస్సు రాశి
ఈ రాశి విద్యార్థులు తమ చదువులపై చాలా శ్రద్ధ చూపుతారు. బాధ్యతాయుతమైన పనులలో అజాగ్రత్తగా ఉండకూడదు. ఈ రోజు మీరు బంధువులను కలుస్తారు. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. తగిన విశ్రాంతి అవసరం. ఉద్యోగులు పని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయవద్దు
మకర రాశి
ఈ రాశివారు సమయాన్ని వృథా చేసుకోవద్దు. మీ గౌరవం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. మీ ప్రేమికుడితో మీ భావాల గురించి మాట్లాడవచ్చు కానీ వారినుంచి ఆశించిన ప్రాధాన్యత రాదు. వ్యాపారంలో నూతన పెట్టబడులు పెట్టకపోవడమే మంచిది. అనుభవజ్ఞుల సలహాలు లేకుండా ముందుకు వెళితే నష్టపోయే ప్రమాదం ఉంది
కుంభ రాశి
ఈ రాశివారు ఈ రోజు కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తారు. మనసు చాలా సంతోషంగా ఉంటుంది. ప్రత్యర్థులు, విమర్శకులు మీ ముందు నిలబడలేరు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు.
Also Read: భగవద్గీత మొత్తం చదవలేదా అయితే ఈ శ్లోకాలు గుర్తుపెట్టుకోండి చాలు!
మీన రాశి
ఈ రోజు మీ దృష్టి మొత్తం పనిపైనే ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. న్యాయపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. పరిచయస్తుల ద్వారా మీకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. స్పైసీ ఫుడ్స్ కి దూరంగా ఉండడం మంచిది. వ్యాపారం బాగానే సాగుతుంది.
గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.