Horoscope Today October 29th 2023: ఈ రాశులవారికి కుటుంబ సమస్యలు పెరుగుతాయి, అక్టోబరు 29 రాశిఫలాలు
Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.
అక్టోబరు 29 రాశిఫలాలు
మేష రాశి
ఈ రాశివారు ధనలాభం పొందుతారు. ఖర్చులు నియంత్రించాలి. ఏదో తెలియని భయం ఉంటుంది. ఆత్మ విశ్వాసం లోపిస్తుంది. ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో మార్పు ఉండొచ్చు. శ్రమ పెరుగుతుంది.
వృషభ రాశి
ఈ రాశివారి కుటుంబంతో సంతోషంగా ఉంటుంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు చేపట్టే పనులకు మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా తగ్గిపోతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆశక్తి పెరుగుతుంది.
మిథున రాశి
ఈ రాశివారు ఈ రోజు చిరాకుగా ఉంటారు. కుటుంబ సభ్యులతో టైమ్ స్పెండ్ చేస్తారు. ఆధ్యాత్మిక ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు పోటీపరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు.
కర్కాటక రాశి
ఈ రాశివారికి సోదరులు, సోదరీమణుల నుంచి మద్దతు లభిస్తుంది. విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబ జీవితం బాధాకరంగా ఉంటుంది. ఓపిక తగ్గవచ్చు. ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగే పరిస్థితి ఉంటుంది. మీరు స్నేహితుడి నుంచి మద్దతు పొందవచ్చు. కుటుంబ బాధ్యతలు పెరగవచ్చు.
Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!
సింహ రాశి
స్నేహితులతో కలిసి ప్రయాణ ప్రణాళికను రూపొందించుకోవచ్చు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. పాత స్నేహితులను కలుస్తారు. రచన , మేధో పనిపై డబ్బు సంపాదిస్తారు. కుటుంబ జివితంలో సంతోషం కోసం ప్రయత్నించాలి. మాటతీరులో సౌమ్యత ఉంటుంది.
కన్యా రాశి
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వాదనలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో పరస్పర విభేదాలు ఉండొచ్చు. వ్యాపారం మెరుగుపడుతుంది. వాహన సౌఖ్యం పెరుగుతుంది. ప్రేమికులు నమ్మకంగా ఉంటారు కానీ ఏ విషయంలోనూ అతిగా ఉత్సాహం ప్రదర్శించవద్దు.
తులా రాశి
స్నేహితుల సహకారంతో ఆదాయ వనరులు పెరుగుతాయి. వ్యాపార పనులపై విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ప్రయాణాలు కలిసొస్తాయి. ఏదో విషయంలో మనసు కలత చెందుతూనే ఉంటుంది. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
Also Read: అట్ల తదియ - వివాహితులకే కాదు పెళ్లికానివారికీ ప్రత్యేకమే!
వృశ్చిక రాశి
ఆశ-నిరాశ మీకు మిశ్రమంగా ఉంటాయి. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగులు విధినిర్వహణలో జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు కొన్ని ఇబ్బందులుంటాయి. తల్లిదండ్రుల నుంచి మద్దతు పొందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు రాశి
కూడబెట్టుకున్న ధనం తగ్గుతుంది. ఏ విషయంలో అయినా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు కానీ మాటల్లో కర్కశత్వం ఉంటుంది. మాట తూలకండి. విద్యార్థులు పరిశోధనల పనులపై విదేశాలకు వెళ్లే అవకాశాలున్నాయి.
మకర రాశి
ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగం, వ్యాపారంలో పురోభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. పాత స్నేహితుడిని మళ్లీ కలుసుకోవచ్చు. కోపం తగ్గుతుంది. సంభాషణలో సంయమనం పాటించండి.పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
కుంభ రాశి
ఈ రాశివారు తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. జీవిత భాగస్వామి అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. మనసులో ఉన్న ప్రతికూల ఆలోచనలు దూరం చేసుకోవడం ఉత్తమం. ఉద్యోగులు పని ప్రదేశంలో మరింత కష్టపడతారు. ఆదాయం తగ్గుతుంది. అధిక ఖర్చుల వల్ల ఇబ్బంది పడతారు.
Also Read: నవంబరు 12 or 13 - దీపావళి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి!
మీన రాశి
ఈ రాశివారికి కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి. మనసులో ప్రతికూల ఆలోచనలు పేరుకుపోతాయి..వాటి నుంచి బయటపడేందుకు మీ మనసుకి దగ్గరవారితో పంచుకునే ప్రయత్నం చేయండి. స్నేహితుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులతో విభేదాలు ఉండొచ్చు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. విద్యార్థులకు చదువులో ఇబ్బందులు తలెత్తవచ్చు.