Horoscope Today 12th February 2025: ఈ 3 రాశులవారికి ఈ రోజు అద్బుతంగా ఉంది - ఫిబ్రవరి 12 బుధవారం రాశిఫలాలు
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఫిబ్రవరి 12 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు కుటుంబంలో వివాదాలు జరిగే అవకాశం ఉంది. మీ ప్రవర్తన మంచిగా ఉండేలా చూసుకోండి. వ్యాపారులు కొన్ని సాంకేతిక సమస్యలను ఎదుర్కోవలసి రావొచ్చు . వాతావరణంలో వచ్చే మార్పుల ప్రభావం మీ ఆరోగ్యంపై ఉంటుంది. అవసరమైన చోట డబ్బు ఖర్చు చేయండి..వెనుక తీయవద్దు
వృషభ రాశి
ప్రేమ వ్యవహారాల గురించి ఉద్వేగభరితంగా ఉంటారు. ఉద్యోగులు కష్టపడాల్సిందే. మీరు భాగస్వామ్య ప్రాజెక్టుల నుంచి ప్రయోజనం పొందుతారు. మీ కోరికలు నెరవేరుతాయి. మార్కెటింగ్ రంగంలో ఉండేవారు ఊహించని ప్రయోజనం పొందుతారు.
మిథున రాశి
మీ మాటలు పదునుగా ఉంటాయి. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. కుటుంబానికి డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. యువత వారి కెరీర్ గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. మీరు గౌరవనీయమైన వ్యక్తుల మార్గదర్శకత్వం పొందవచ్చు.
Also Read: నో వెహికల్ జోన్‌గా ప్రయాగ్‌రాజ్.. కుంభమేళాకు వచ్చే భక్తులకు కొత్త ఆంక్షలు ఇవే!
కర్కాటక రాశి
ఈ రోజు మీరు తీసుకున్న మొదటి నిర్ణయం నుంచి మీరు ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో లాభాలుంటాయి. ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారుతాయి.
సింహ రాశి
ఈ రోజు కుటుంబ సభ్యులతో అర్ధవంతమైన సమయాన్ని గడుపుతారు. ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీ తీరు ప్రశంసలు అందుకుంటుంది. నిరుద్యోగులు మంచి సంస్థ నుండి ఉద్యోగాలు పొందుతారు. ప్రేమికులకు కలిసొచ్చే సమయం.
కన్యా రాశి
ఈ రోజు మీరున్న రంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ సలహాలను అంతా అనుసరిస్తారు. మీకు మతం పట్ల చాలా ఆసక్తి ఉంటుంది. స్నేహితులను కలుస్తారు. ఆరోగ్యం బావుంటుంది. రోజంతా సంతోషంగా ఉంటారు.
Also Read: కుంభమేళా కి కౌంట్ డౌన్.. ఎలాంటి కష్టం లేకుండా వెళ్లి వచ్చేయాలి అనుకుంటే ఇలా చేయండి!
తులా రాశి
ఈ రోజు ఉద్యోగ ప్రతిపాదనలను పొందవచ్చు. వ్యాపారం కోసం ఒక వ్యూహాన్ని తయారు చేయాలి. రియల్ ఎస్టేట్తో సంబంధం ఉన్న వ్యక్తులు గొప్ప ప్రయోజనాలను పొందుతారు. మీ విశ్వాసం పెరుగుతుంది. మీ పనిని మీరు సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. కార్యాలయంలో ఒకరి నుంచి శుభవార్త ఉంటుంది.
వృశ్చిక రాశి
ఏ విషయంలోనూ రిస్క్ తీసుకోవద్దు. మేథో రచనలపై ఆసక్తి కలిగి ఉంటారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్త..తొందరపాటుగా వ్యవహరించవద్దు. వ్యాపారంలో లాభాలుంటాయి. ఉద్యోగులకు పెద్దగా మార్పులుండవు. మీ ఆలోచన ప్రశంసలు అందుకుంటుంది
ధనస్సు రాశి
ఈ రోజు వివాదాస్పద విషయాల గురించి చర్చించవద్దు. మీ మొండి ప్రవర్తన కారణంగా అంతా మీపై కోపంగా ఉంటారు. చిన్న విషయాలకు అతిగా రియాక్టవొద్దు. పాత రుణంతో ఇబ్బందులు ఎదురవుతాయి. మిమ్మల్ని మీరు నమ్మండి.
మకర రాశి
ఈ రోజు మీకు శుభదినం. ఆస్తి విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. సంగీతం , నటనపై ఆసక్తి చూపిస్తారు. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు . మనసులో ఏదో అలజడి ఉంటుంది.
కుంభ రాశి
ఈ రోజు ఆర్థిక కోణం నుంచి మీకు చాలా బాగుంటుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. పనిలో అధిక ఒత్తిడి తీసుకోవద్దు. నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ఇదే మంచి సమయం. అప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కార్యాలయంలో ఆర్థిక ప్రయోజనం పొందుతారు.
మీన రాశి
ఈ రోజు ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం. బలమైన సంకల్పం కారణంగా, కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. మీరు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కార్యాలయంలో పని ఒత్తిడి ఉంటుంది.
Also Read: అఘోరాలు, నాగసాధువులకు మాయమయ్యే శక్తి ఉందా.. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వెళ్లిపోతున్నారు!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.





















