News
News
X

Horoscope Today: ఈ రాశులవారికి భలే మంచి రోజు…ఆ రెండు రాశుల వారు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి…

గమనిక: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 

2021 ఆగస్టు 13 శుక్రవారం రాశిఫలాలు

మేషం

ఈరోజు మంచి రోజు అవుతుంది. పెట్టుబడి పెట్టడానికి ఉత్తమ సమయం. మీ పనులన్నీ పూర్తవుతాయి. కొత్త బాధ్యతలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ పనిని పూర్తి చేయడంలో కుటుంబ సభ్యులు మీకు సహాయం చేస్తారు. విద్యార్థులు ఈరోజు మరింత కష్టపడాలి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు

వృషభం

ఒక విషయంపై ఆందోళన చెందుతారు. భవిష్యత్తు గురించి చింతవద్దు. చట్టపరమైన విషయాలు కాలక్రమేణా పరిష్కారమవుతాయి. స్నేహితులతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. పాత సమస్యలు తీరిపోతాయి. ఈ రోజు కొత్త అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు.

మిథునం

స్నేహితుడి సాయంతో మీ సమస్యలు పరిష్కారమవుతాయి. ఈరోజు శత్రువులకు దూరంగా ఉండండి. భవిష్యత్తు కోసం పొదుపు ప్రణాళికలు రూపొందించండి. ఈ రోజు యువతకు కలిసొస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. పెళ్లైన వారు అత్తింటి నుంచి శుభవార్తలు వింటారు..

కర్కాటక రాశి

అనుకోని ప్రయాణాలుంటాయి. ఏదైనా సమస్యపై బంధువులతో వాదనలు ఉంటాయి. ఈ రోజు చాలా మంది మీ వల్ల ప్రభావితమవుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. పిల్లల చదువుపై శ్రద్ధ వహించండి. పాత స్నేహితులను కలుస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే కొత్త పనిని ప్రారంభించండి.


సింహం

మీరు ఈరోజు శుభవార్త వింటారు. కొత్త ప్రణాళికలు సత్ఫలితాలనిస్తాయి. ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజిక జీవితంలో ఆనందం ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ పనులు చాలా వరకు పూర్తవుతాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఎవరితోనూ వివాదం పెట్టుకోవద్దు.

కన్య

ఎవరితోనైనా వివాదాలు ఉండొచ్చు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి.

తులారాశి

లావాదేవీల సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీ కుటుంబం కోసం సమయం కేటాయించండి. గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితాలు ఈరోజు అందుకునే అవకాశం ఉంది. పెద్ద మొత్తంలో ఆర్థిక లాభాలు పొందొచ్చు.  కొత్త పెట్టుబడులకు అనుకూల సమయం. దినచర్యలో వచ్చే మార్పు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. చట్టపరమైన అడ్డంకులను తొలగించే సంకేతాలు ఉన్నాయి. వ్యాపారులు ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది

వృశ్చికరాశి

ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు, మీ కుటుంబ సభ్యులతో సంప్రదించండి. మీరు దేవాలయాన్ని సందర్శించేందుకు వెళతారు. పాత స్నేహితులను కలుసుకుంటారు. రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. పెద్దల సలహాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ రోజు ఏ పని గురించి తొందరపడకండి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.


ధనుస్సు

వ్యాపారానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఆఫీసులో ఎవరితోనైనా వివాదాలు ఉండొచ్చు. విద్యార్థులకు మంచి రోజు. వాహనాలకు సంబంధించిన వాటిలో పెట్టుబడి పెట్టొచ్చు. కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. చట్టపరమైన విషయాలు ముందుకు సాగుతాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొత్త బాధ్యతను స్వీకరిస్తారు.

మకరం

ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అవసరమైన నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపడకండి. కెరీర్లో మరో అడుగు ముందుకేసేందుకు మంచి సమయం ఇది. కొత్త ప్రణాళికలు రూపొందించుకోండి. పాత స్నేహితులను కలుస్తారు. సంతోషంగా ఉంటారు.

కుంభం

ఈ రోజు మంచి రోజు. మీ జీవిత భాగస్వామి మద్దతుతో మీరు సంతోషంగా ఉంటారు. ప్రేమికులు తమ బంధాన్ని పెళ్లి వరకూ తీసుకెళ్లేందుకు అనుకూల సమయం. ఈ రోజు కొన్ని కొత్త వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో సవాళ్లు ఉంటాయి. వివాదానికి దూరంగా ఉండండి.

మీనం

దంపతుల మధ్య అవగాహన పెరుగుతుంది. ఈ రోజు విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. ఇంట్లో వృద్ధుడి ఆరోగ్యం క్షీణించవచ్చు. ఈ రోజు సాధారణ రోజు అవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గతంలో చేసిన పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి. సామాజిక ప్రతిష్ట పొందుతారు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి.

 

Published at : 13 Aug 2021 01:36 AM (IST) Tags: Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces August 13Horoscope Today

సంబంధిత కథనాలు

Holes to Pots in Cremation : అంత్యక్రియలు సమయంలో కుండకు కన్నాలు పెట్టి పగలగొడతారెందుకు!

Holes to Pots in Cremation : అంత్యక్రియలు సమయంలో కుండకు కన్నాలు పెట్టి పగలగొడతారెందుకు!

Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణుడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడాలనుకుంది రుక్మిణి, ఏం చేసిందో తెలుసా!

Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణుడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడాలనుకుంది రుక్మిణి, ఏం చేసిందో తెలుసా!

Weekly Horoscope Telugu: మీ జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఈ వారం జరగబోతోంది, ఆగస్టు 15 నుంచి 21 వరకు రాశిఫలాలు

Weekly Horoscope Telugu: మీ జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఈ వారం జరగబోతోంది, ఆగస్టు 15 నుంచి 21 వరకు రాశిఫలాలు

Horoscope Today 15 August 2022: స్వాతంత్ర్య దినోత్సవం ఈ రాశులవారి జీవితంలో రంగులు నింపుతుంది, ఆగస్టు 15 రాశిఫలాలు

Horoscope Today  15 August 2022:  స్వాతంత్ర్య దినోత్సవం ఈ రాశులవారి జీవితంలో రంగులు నింపుతుంది, ఆగస్టు 15 రాశిఫలాలు

Horoscope Today, 14 August 2022: ఈ రాశులవారు స్టేటస్ కోసం ఖర్చుచేయడం మానుకోవాలి, ఆగస్టు 14 రాశిఫలాలు

Horoscope Today, 14 August 2022:  ఈ రాశులవారు స్టేటస్ కోసం ఖర్చుచేయడం మానుకోవాలి, ఆగస్టు 14 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

CM Jagan : ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన

CM Jagan :  ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన

Khammam News : తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు దారుణ హత్య, ఆటోతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి!

Khammam News : తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు దారుణ హత్య, ఆటోతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి!

NTR 31 Movie Update : వచ్చే వేసవి నుంచి ఎన్టీఆర్‌తో - క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన ప్రశాంత్ నీల్

NTR 31 Movie Update : వచ్చే వేసవి నుంచి ఎన్టీఆర్‌తో - క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన ప్రశాంత్ నీల్

ఖాతాదారులకు ఎస్బీఐ షాకింగ్ న్యూస్, నేటి నుంచి ఈఎంఐల బాదుడు!

ఖాతాదారులకు ఎస్బీఐ షాకింగ్ న్యూస్, నేటి నుంచి ఈఎంఐల బాదుడు!