News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ఆగష్టు 31 రాశిఫలాలు, ఈ రోజు ఈ రాశులవారికి మనసులో కోర్కె నెరవేరుతుంది

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

FOLLOW US: 
Share:

Horoscope Today 2023 August 31st

మేష రాశి
ఈ రోజు ఈ రాశివారి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కొత్త భావోద్వేగ సంబంధాలు ప్రారంభమవుతాయి. స్నేహితుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు పొందుతారు. వ్యాపారుల ఆదాయం పెరుగుతుంది. ప్రణాళికల అమలులో సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం.

వృషభ రాశి 
ఈ రాశివారు పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. కెరీర్ కి సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు ఇదే మంచి సమయం. పనిని పూర్తిస్థాయిలో ఆస్వాదించలేరు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.

మిథున రాశి
ఈ రోజు ఈ రాశివారు పొట్టకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. మీరు ప్రతి విషయంపై అభిప్రాయం చెప్పకుండా ఉండడమే మంచిది. అనుకోని అతిథులు ఇంటికి వస్తారు. తొందరపాటు ప్రభావం మీ పనిపై పడుతుంది. 

Also Read: రాఖీ కట్టించుకుని బికారిగా మారిన జమిందార్ - ఈ గ్రామాల్లో రాఖీ అస్సరు జరుపుకోరు!

కర్కాటక రాశి
ఈ రాశివారు ఓ ముఖ్యమైన పనిపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు. అయితే వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో చురుగ్గా ఉంటారు. ఇంటా బయటా మీపై గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. 

సింహ రాశి
ఈ రాశివారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.అనవసర విషయాలపై కోపం తెచ్చుకునే స్వభావాన్ని మార్చుకోవడం మంచిది. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. చర, స్థిరాస్తుల వివాదాలు సర్దుమణుగుతాయి. 

కన్యా రాశి
ఈ రాశివారు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామికి సమయం కేటాయిస్తారు. ఉద్యోగులు ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో వివాదాలు తీరి అంతా సంతోషంగా ఉంటారు. ధనలాభం పొందే అవకాశం ఉంది. వేరే వ్యక్తులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి.  అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి.

Also Read: రాఖీ కుడిచేతికే ఎందుకు కడతారో తెలుసా!

తులా రాశి
వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహించాలి. ఆదాయం బాగానే ఉంటుంది. శత్రువులపై  మీరు పైచేయి సాధిస్తారు. అనారోగ్య సమస్యలను తేలిగ్గా తీసుకోవద్దు. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి.  ఉన్నతాధికారులతో అనవసర వాదనలు పెట్టుకోపోవడమే మంచిది. 

వృశ్చిక రాశి
ఈ రాశివారికి జీవిత భాగస్వామితో వివాదాలు జరిగే అవకాశం ఉంది. అనవసర సమావేశాలకు, చర్చలకు దూరంగా ఉండాలి. కార్యాలయంలో వ్యక్తుల నుంచి ఎక్కువగా ఆశించవద్దు. మీరు చేయాలనుకున్న పనిని మీ ప్రణాళిక ప్రకారం పనిచేయడం మంచిది. ఎవ్వరిపైనా అంచనాలు పెంచుకోవద్దు. 

ధనుస్సు రాశి
ఈ రాశివారు పెండింగ్ లో ఉన్న పనులను సులభంగా పూర్తిచేస్తారు. ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు. వ్యాపారంలో నూతన ప్రణాళికలు అమలు చేయాలనే ఆలోచన చేస్తారు. ముఖ్యమైన విషయాలను కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. ఉద్యోగులు పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. 

Also Read: రాఖీ పండుగ రోజు మాత్రమే తెరిచి ఉండే ఆలయం ఇది!

మకర రాశి
ఈ రోజు మీరు మీ ఆలోచనలను మీ కుటుంబ సభ్యులకు చెప్పడం ద్వారా మంచి జరుగుతుంది. ఈ రాశి వ్యాపారులు కొంత ఒత్తిడికి లోనవుతారు. మీ పనిలో ఆటంకాలు ఉండవచ్చు. ప్రాణాయామంపై దృష్టి పెట్టండి. విద్యార్థులు, ఉద్యోగులకు శుభసమయం

కుంభ రాశి
ఈ రాశివారు కొత్త ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంది. అత్యుత్సాహంతో ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. ఓ శుభవార్త వినే అవకాశం ఉంది. విద్యార్థులు పరీక్షలలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు.

మీన రాశి
ఈ రాశివారు జీవనశైలిలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. రోజంతా సంతోషంగా గడిచిపోతుంది. భావోద్వేగానికి లోనై  ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. మీ జీవిత భాగస్వామి గురించి కొంత ఆందోళన ఉంటుంది. దాంపత్య సంతోషం తగ్గుతుంది.

గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

Published at : 31 Aug 2023 04:23 AM (IST) Tags: daily horoscope Horoscope Today Today Horoscope Astrological prediction for 2023 August August 31st Horoscope

ఇవి కూడా చూడండి

Horoscope September 29, 2023: ఈ రాశివారికి ఆదాయం తగ్గుతుంది - ఖర్చులు పెరుగుతాయి

Horoscope September 29, 2023: ఈ రాశివారికి ఆదాయం తగ్గుతుంది - ఖర్చులు పెరుగుతాయి

Dates of Bathukamma in 2023: బతుకమ్మ పండుగ డేట్స్ ఇవే - ఏ రోజు ఏ బతుకమ్మని పూజించాలో తెలుసా!

Dates of Bathukamma in 2023: బతుకమ్మ పండుగ డేట్స్ ఇవే -  ఏ రోజు ఏ బతుకమ్మని పూజించాలో తెలుసా!

ఈ రాశివారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం, సెప్టెంబరు 28 రాశిఫలాలు

ఈ రాశివారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం, సెప్టెంబరు 28 రాశిఫలాలు

Vastu Tips In Telugu: అద్దె ఇంటికి వాస్తు వర్తిస్తుందా -వర్తించదా!

Vastu Tips In Telugu: అద్దె ఇంటికి వాస్తు వర్తిస్తుందా -వర్తించదా!

Ganesh Nimajjanam 2023 : గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది !

Ganesh Nimajjanam 2023 : గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది !

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది