అన్వేషించండి

Horoscope Today January 07th, 2024 : ఈ రాశివారి జీవితంలో ఊహించని మార్పు, జనవరి 07 రాశిఫలాలు

Horoscope Today: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Horoscope Today 07th January  2024  - జనవరి 07 రాశిఫలాలు

మేష రాశి (Aries Horoscope Today) 

ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీరు పై అధికారుల నుంచి మద్దతు పొందుతారు. కెరీర్‌లో పురోగతి ఉంటుంది. చేపట్టిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడి నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోండి. మీ ఖర్చులపై నిఘా ఉంచండి. పనికిరాని వాటిపై డబ్బు ఖర్చు చేయడం మానుకోండి. 

వృషభ రాశి (Taurus  Horoscope Today)

ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి.  కోపాన్ని నియంత్రించుకోండి. తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి కొత్త బడ్జెట్‌ను రూపొందించండి. పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడానికి సంకోచించకండి. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. 

మిథున రాశి (Gemini Horoscope Today) 

సామాజిక హోదా, ప్రతిష్టలు పెరుగుతాయి. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. వాహనం నిర్వహణలో డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ రోజు డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోండి. విద్యార్థులు కష్టపడితేనే విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో విభేదాల సంకేతాలు ఉన్నాయి. అనవసర వాదనలకు దూరంగా ఉండండి.  కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

Also Read: సంక్రాంతికి మీరు పాటించాల్సిన 5 విషయాలు!

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. అధిక కోపం తగ్గించుకోండి. కార్యాలయంలో అనవసర వాదనలకు దూరంగా ఉండండి. మీ ప్రతిభ  నైపుణ్యాలకు కార్యాలయంలో తగిన గుర్తింపు లభిస్తుంది. పెట్టుబడి నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకోండి . తొందరపడి డబ్బు ఖర్చు చేయవద్దు.

సింహ రాశి (Leo Horoscope Today)

ఈ రాశి వ్యాపారులు భాగస్వాములను గుడ్డిగా నమ్మేయకండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. స్నేహితుని సహకారంతో ఉద్యోగ, వ్యాపారాలలో ఆటంకాలు తొలగిపోతాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. వృత్తి జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి, కానీ  పరిస్థితులు త్వరలోనే సాధారణమవుతాయి. కొత్త బంధాలు ఏర్పడతాయి. విద్యార్థులకు శుభసమయం. 

కన్యా రాశి  (Virgo Horoscope Today)

ఈ రోజు మీ రోజు సాధారణంగా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. మీరు కార్యాలయంలో అధికారుల నుంచి మద్దతు పొందుతారు. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి.ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండండి. మీ జీవిత లక్ష్యాలను సాధించడానికి కొత్త ప్రయత్నాలు చేయడం బెటర్. కుటుంబ సభ్యులతో అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది కానీ పని ఒత్తిడి ఉంటుంది.

Also Read: సంక్రాంతి వచ్చేస్తోంది - మీకు పట్టిన శనిని ఇలా వదిలించేసుకోండి!

తులా రాశి (Libra Horoscope Today) 

కుటుంబ సంబంధాలలో ప్రేమ, నమ్మకం పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు.  ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. నూతన పెట్టుబడులు పెడతారు. వాహన నిర్వహణకు ధనం వెచ్చించవచ్చు.  జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

వృత్తి జీవితంలో పురోగతి ఉంటుంది. కెరీర్‌లో కొత్త విజయాలు సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మాటలో మాధుర్యం ఉంటుంది. శక్తికి, ఉత్సాహానికి లోటు ఉండదు. కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది . ఈ రోజు ఆదాయం తక్కువగానూ, ఖర్చులు ఎక్కువగానూ ఉండవచ్చు. 

Also Read: ధనస్సులోకి శుక్రుడు, 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి!

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

రోజంతా సంతోషంగా ఉంటారు. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. మతపరమైన కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. మీరు అదనపు పని బాధ్యతలను పొందుతారు. కార్యాలయంలో మీ పనికి తగిన గుర్తింపు ఏర్పడుతుంది. పాత మిత్రులతో కలుస్తారు. తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది. ప్రణాళిక లేని ఖర్చులు కూడా పెరుగుతాయి. లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలి. 

మకర రాశి (Capricorn Horoscope Today) 

అశించిన విజయం దక్కాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. మేధోపరమైన పని నుంచి ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఉద్యోగంలో స్థలం మారే అవకాశాలు ఉన్నాయి. పని బాధ్యతలు పెరుగుతాయి. స్నేహితుల నుంచి అవసరమైన సహకారం లభిస్తుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

Also Read: 100 ప్రాంతాల మట్టి, 7 కోట్ల వ్యయం - అయోధ్యలో వెలగనున్న అతి పెద్ద దీపం ప్రత్యేకతలివే!

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

ఉద్యోగంలో సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. పని బాధ్యతలను చాలా జాగ్రత్తగా నిర్వహిస్తారు. జీవితంలో పెద్ద మార్పులకు సిద్ధంగా ఉండండి. ఈరోజు మీ మనస్సు ఏదో తెలియని భయంతో కలవరపడవచ్చు. సానుకూల దృక్పథంతో అన్ని పనులను పూర్తి చేయండి..కచ్చితంగా కోరుకున్న విజయాన్ని పొందుతారు. వ్యాపారులకు ఈరోజు అనుకూలమైన రోజు. వ్యాపారంలో విస్తరణకు అవకాశం ఉంటుంది

మీన రాశి (Pisces Horoscope Today) 

ఈ రోజు సాధారణంగానే ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, అయితే డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. బడ్జెట్ ప్రకారం మాత్రమే ఖర్చు చేయండి. కష్ట సమయాలను ఎదుర్కోవటానికి డబ్బు ఆదా చేసుకోండి. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కారమవుతాయి. 

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: 'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
Akira Nandan: అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
Indian Coast Guard Helicopter Crash: గుజరాత్‌లోని విమానాశ్రయంలో కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్, ముగ్గురు దుర్మరణం
గుజరాత్‌లోని విమానాశ్రయంలో కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్, ముగ్గురు దుర్మరణం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Notices to Allu Arjun | అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు | ABP DesamDaaku Maharaaj Trailer Decode | బాలకృష్ణతో కలిసి బాబీ ఆడిస్తున్న మాస్ తాండవం | ABP DesamUnstoppable With NBK Ram Charan | అన్ స్టాపబుల్ లో రచ్చ రచ్చ చేసిన బాలయ్య, రామ్ చరణ్ | ABP DesamIndia out form WTC Final Race | ఆసీస్ దెబ్బతో WTC నుంచి భారత్ ఔట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: 'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
Akira Nandan: అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
Indian Coast Guard Helicopter Crash: గుజరాత్‌లోని విమానాశ్రయంలో కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్, ముగ్గురు దుర్మరణం
గుజరాత్‌లోని విమానాశ్రయంలో కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్, ముగ్గురు దుర్మరణం
Anantha Sriram: 'అలాంటి సినిమాలను బహిష్కరించాలి' - కల్కి సినిమాపై సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
'అలాంటి సినిమాలను బహిష్కరించాలి' - కల్కి సినిమాపై సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
JC Prabhakar Reddy Apology: నటి మాధవిలతకు క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అనంతరం సంచలన వ్యాఖ్యలు
నటి మాధవిలతకు క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అనంతరం సంచలన వ్యాఖ్యలు
Namo Bharat Corridor: నమో భారత్ కారిడార్ ప్రారంభించిన ప్రధాని మోదీ - విద్యార్థులతో కలిసి సామాన్యుడిలా ర్యాపిడ్ రైలులో ప్రయాణం
నమో భారత్ కారిడార్ ప్రారంభించిన ప్రధాని మోదీ - విద్యార్థులతో కలిసి సామాన్యుడిలా ర్యాపిడ్ రైలులో ప్రయాణం
Road Accident: మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం - బైక్‌ను లారీ ఢీకొని ముగ్గురు మృతి
మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం - బైక్‌ను లారీ ఢీకొని ముగ్గురు మృతి
Embed widget