శుక్రుడు రాశిమారుతున్నాడు - మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుదంటే! మేష రాశి నిరుద్యోగులు ఇంటర్యూలలో విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాన్ని మెరుగుపడుతుంది. వృషభ రాశి ఉద్యోగులకు శుభసమయం. ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. మిథున రాశివారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారం మెరుగుపడుతుంది. మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. కర్కాటక రాశివారి మనస్సు చంచలంగా ఉంటుంది. మార్చి 18 నుంచి కొంత ప్రశాంతత రావొచ్చు. ఆరోగ్యం జాగ్రత్త సింహరాశివారికి మానసిక ప్రశాంతత. ఆత్మవిశ్వాసం పెంచుతుంది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం కన్యారాశివారికి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌కు కూడా అవకాశాలు ఉండవచ్చు. తులారాశివారు ఆనందంగా ఉంటారు. ఉన్నత విద్య కోసం వేరే ప్రదేశానికి వెళ్లవచ్చు. ఆదాయం వృద్ధి చెందుతుంది. వృశ్చిక రాశివారు ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంటుంది. కుటుంబానికి దూరంగా వేరే ప్రదేశానికి వెళ్లవలసి ఉంటుంది. ధనస్సు రాశివారికి ఆర్థిక కష్టాలు తీరిపోతాయి. మేధోపరమైన పనిలో బిజీగా ఉంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మకర రాశి ఉద్యోగులకు కలిసొచ్చే సమయం. కార్యాలయంలో మార్పు ఉండవచ్చు. కళ లేదా సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుంభ రాశివారు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది మీనరాశివారు కుటుంబ సమస్యల పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగంలో మార్పులకు అవకాశం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు.