ఈ రాశివారి వ్యక్తిగత జీవితంలో సమస్యలు తొలగిపోయే టైమ్ ఇది! బృహస్పతి సెప్టెంబరు 4 నుంచి 2024 జనవరి 3 వరకు వక్రంలో సంచరించాడు. ఇక వృషభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురు గ్రహం రాశిమారిన ప్రభావం అన్ని రాశులవారిపైనా ఉంటుంది. వృషభ రాశిలో బృహస్పతి సంచారం కారణంగా మిథున రాశి వారికి 2024 అద్భుతంగా కలిసొస్తుంది. చేపట్టిన పనిలో మంచి ఫలితాలు పొందుతారు. పూర్వీకుల ఆస్తి నుంచి కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. మీ మనస్సు ఆధ్యాత్మికతలో నిమగ్నమై ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు బాగుంటాయి. ఈ సమయంలో, అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. Image Credit: Pixabay