Horoscope Today :ఈ ఐదు రాశుల వారికి ఈరోజు భలే కలిసొస్తుంది..ఆ రెండు రాశుల వారు ఉద్యోగం మారేందుకు ఇదే సరైన సమయం
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
2021 సెప్టెంబర్ 3 శుక్రవారం రాశిఫలాలు
మేషం
అత్తింటివారి వైపునుంచి శుభవార్తలు వింటారు. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. కొత్త పనులు చేపట్టే ముందు కుటుంబ సభ్యులను సంప్రదించండి. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త . వ్యాపారస్తులకు సాధారణమైనరోజు. ఎవరికైనా అప్పిచ్చే ముందు ఆలోచించండి. మీ బాధ్యతలు నెరవేర్చడంలో విఫలం కావచ్చు. విద్యార్థులు నిపుణుల నుంచి సలహాలు పొందుతారు.
వృషభం
మీ పని ముందుకు సాగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం ఉంటుంది. బంధువులను కలుస్తారు. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ద్వారా మీ జీవితంలో సానుకూల మార్పులుంటాయి. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఆరోగ్యం పర్వాలేదు. పనులు వాయిదా వేయడానికి ప్రయత్నించవద్దు.
మిథునం
అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. ఉద్యోగం మారే ఉద్దేశం ఉంటే ఇప్పుడే ఆ నిర్ణయం తీసుకోవచ్చు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆఫీసులో ఎవరితోనైనా వివాదాలు ఉండొచ్చు. వ్యాపారస్తులకు శుభసమయం. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు. ఖర్చులు అధికంగా ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. న్యాయపరమైన చిక్కుల్లో పడొచ్చు జాగ్రత్తగా వ్యవహరించండి. విద్యార్థులకు అనుకూల సమయం.
Also Read:ఈ ఆహార నియమాలు పాటిస్తే మందులతో పనిలేదు…యోగశాస్త్రం ఏం చెబుతోంది….పురాణాలు ఏం చెబుతున్నాయి..
కర్కాటక రాశి
మీ సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఒత్తిడి దూరమవుతుంది. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారం బాగా సాగుతుంది. బంధువులను కలుస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఉద్యోగులు, కార్మికుల బదిలీ ఉండొచ్చు. ఖర్చులను నియంత్రించాలి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
సింహం
రిస్క్ తీసుకోగలుగుతారు. పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులు అనవసర వివాదాల జోలికి పోవద్దు. మాట అదుపులో ఉంచుకోండి. వ్యాపార పరిస్థితులు బాగుంటాయి. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఆరోగ్యం బాగుంటుంది. సామాజిక సేవ చేస్తారు..
కన్య
ఆదాయం పెరుగుతుంది. రాజకీయ మద్దతు లభిస్తుంది. నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. తీర్థయాత్ర వెళ్లేందుకు ప్రణాళిక వేస్తారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు లాభాన్నిస్తాయి. తొందరపాటు వద్దు. అదృష్టం కలిసొస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాల ఫలిస్తాయి.
Also Read: ఇంటి ముందున్న తులసి మొక్కను చూసి ఇంట్లో ఏం జరగబోతోందో తెలిసిపోతుందట... నిజమేనా!
తులారాశి
వ్యాపారం బాగా సాగుతుంది. అకస్మాత్తుగా సమస్య వచ్చే అవకాశం ఉంది...అయితే భయం అవసరం లేదు. మీలో విశ్వాసం పెరుగుతుంది. పాజిటివ్ గా ఆలోచిస్తారు. ఆర్థిక పురోగతికి మంచి అవకాశాలుంటాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. భగవంతుడిపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. పెట్టుబడి ప్రతిపాదనల్లో ధైర్యంగా ముందడుగు వేయండి. చట్టపరమైన విషయాలు ముందుకు సాగుతాయి. వృద్ధుల ఆరోగ్యంలో ఒడిదొడుకులు ఉంటాయి.
వృశ్చికరాశి
ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అదృష్టం కలిసొస్తుంది. అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. మీ బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వర్తించగలుగుతారు.
ధనుస్సు
ఆదాయం పెరుగుతుంది. తొందరపాటు వద్దు. ఆందోళ, భయం, అనారోగ్యం కారణంగా కొంత కుంగిపోతారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరాలనుకునేవారికి, ఉద్యోగం మారాలనుకునేవారికి మంచి సమయం. కుటుంబ ఆదాయం పెరుగుతుంది. వివాదాలు వద్దు. ప్రేమ వ్యవహారంలో అనుకూలత ఉంటుంది. అతిథులు ఇంటికి వస్తారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. విశ్వాసం పెరుగుతుంది. స్థిరాస్తుల కొనుగోలు మరియు అమ్మకం లాభదాయకంగా ఉంటుంది.
Also Read: పక్కింట్లో పూలు కోసి పూజలు చేస్తున్నారా….అయితే మీరు ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి…
మకరం
మీరు పెద్ద బాధ్యతను స్వీకరిస్తారు. ఈ రోజు ఎక్కువ ఖర్చు చేస్తారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లల వైపు పురోగతి ఉంటుంది. వ్యాపారం బాగా జరుగుతుంది. డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు తలుపుతడతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. ఆచితూచి మాట్లాడండి.
కుంభం
వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీరు ఒక ప్రణాళికను రూపొందించవచ్చు. మీ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు సమ్మతిస్తారు. తెలియని వ్యక్తులతో వ్యవహరించడం మీకు హానికరం. పొదుపు చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఖర్చులను మాత్రం నియంత్రించలేరు. చాలా కాలం తర్వాత స్నేహితుడిని కలుస్తారు. ఆఫీసులో సహోద్యోగులతో మంచి సంబంధాలు ఉంటాయి.
మీనం
ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. చేపట్టిన పని ముందుకు సాగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అప్పిచ్చిన మొత్తం తిరిగి పొందుతారు. కొత్త వ్యక్తులను కలుస్తారు. ఆధ్యాత్మికతవైపు మొగ్గుచూపుతారు. ఆస్తికి సంబంధించిన పని పూర్తవుతుంది.
Also Read: పెళ్లి పీటలెక్కుతున్న త్రిష! ఆఫర్లు తిరస్కరించడానికి కారణం ఇదేనా?
Also Read: వారి మాటలు బాధించాయి.. నన్ను నేనే బ్యాన్ చేసుకుంటా: నాని భావోద్వేగం
Also Read: తెల్ల చీరలో మల్లెపువ్వులా మెరిసిపోతున్న యామీ