Horoscope Today 27th February 2022: ఈ రాశివారు మొండి వైఖరి విడిచిపెట్టాలి, ఈ రోజు మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.
2022 ఫిబ్రవరి 27 ఆదివారం రాశిఫలాలు
మేషం
మీ మనసులో ఉన్న మాట బయటపెట్టండి. భవిష్యత్ కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో భారీ ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అప్పిచ్చిన మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యక్తులతో మీ సంబంధాలు బలపడతాయి. వైవాహిక జీవితం బావుంటుంది. చాలా పనుల్లో బిజీగా ఉంటారు.
వృషభం
ఈ రోజు మీ దినచర్య ప్రభావితం కావచ్చు. మీ ప్రియమైనవారితో వివాదానికి దిగొద్దు. మీ ఇమేజ్ ని దెబ్బతినే పనులు ఏవీ చేయవద్దు. శత్రువులు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తారు. ఆరోగ్యం, ఆహారం విషయంలో అజాగ్రత్త వద్దు.
మిథునం
మీరు ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతారు. వ్యాపార విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు. మీరు జీవిత భాగస్వామితో సామరస్యంగా ఉంటారు. అదృష్టం కలిసొస్తుంది. మీ పిల్లల విజయంతో మీరు సంతోషంగా ఉంటారు.
కర్కాటకం
మీ ప్రవర్తనను మరింత మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. పరుషమైన మాటల వల్ల ఎవరితోనైనా వివాదానికి దిగుతారు. ఈరోజు అప్పు ఇవ్వకండి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు తలెత్తవచ్చు. మీరు ఇంటి పనులను పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం పొందుతారు.
Also Read: వారంలో ఏడు రోజుల్లో ఏ రోజు శుభం, ఏ రోజు అశుభం
సింహం
ఈ రోజు ఎవరితోనైనా మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. ఒకరికి సలహా ఇచ్చే వ్యవహారంలో మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. అందుకే అనవసర విషయాల్లో తలదూర్చకుండా ఉండడం మంచిది. ఈరోజు విద్యార్థులకు మంచి రోజు అవుతుంది. కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు.
కన్య
వ్యాపారం గురించి ఆందోళన చెందుతారు. మీ భాగస్వాములతో జాగ్రత్తగా ఉండండి. మీరు అనవసరమైన వాటిపై ఖర్చు చేయడం మానుకోవాలి. ఈరోజు ఎలాంటి వివాదాలైనా పరిష్కరించుకోగలుగుతారు. మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. మీరు కొత్త ప్రాజెక్ట్ లు ప్రారంభించేందుకు ఇదే మంచిరోజు. పాత మిత్రులను కలుస్తారు. ఈరోజు సాధారణంగా ఉంటుంది.
తుల
మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్వశక్తితో ఏ సమస్యనైనా పరిష్కరించగలరు. ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ వల్ల చాలా మంది ప్రభావితం కావచ్చు, మీలాగే ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు. కొత్త ఆదాయ అవకాశాలు లభిస్తాయి.
వృశ్చికం
ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. గాయపడే ప్రమాదం ఉంది. డబ్బు, ఆస్తుల పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఇంటి మరమ్మతులకు డబ్బు ఖర్చు అవుతుంది. వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. మీరు విమర్శలకు బలి కావాల్సి రావచ్చు. అధిక పని వల్ల ఒత్తిడికి గురవుతారు, కాస్త విశ్రాంతికోసం సమయం కేటాయించండి.
Also Read: శివాలయంలో ఉండే నవగ్రహాలకే పవర్ ఎక్కువ ఉంటుందా
ధనుస్సు
ఈ రోజు మీరు కొన్ని విషయాల్లో విజయం సాధిస్తారు. శుభవార్త అందినందుకు సంతోషిస్తారు. విదేశాల్లో ఉంటున్న బంధువులతో చర్చలు ఉంటాయి.ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే వారికి మరింత బాధ్యత ఉంటుంది. మీ ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. విహారయాత్రకు వెళ్తారు.
మకరం
దీర్ఘకాలిక వ్యాధి నుంచి బయటపడతారు. మీ ఆర్థిక పరిస్థితిలో హెచ్చు తగ్గులు ఉంటాయి. వ్యాపారంలో మందగమనాన్ని ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీ మొండి వైఖరి వల్ల చాలామంది బాధపడతారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. దినచర్యలో మార్పు తీసుకొస్తుంది. అసమతుల్యతను వదులుకోవడానికి ప్రయత్నించండి.
కుంభం
కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ వల్ల కుటుంబ సభ్యుల సమస్య తీరుతుంది. ఎవరికైనా ఆర్థికంగా సహాయం చేస్తారు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది.పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఈరోజు సానుకూలంగా ఉంటారు. ఆఫీసులో స్నేహితుడితో కొత్త ప్రాజెక్ట్ గురించి చర్చిస్తారు.
మీనం
పనికిరాని విషయాల్లో మిమ్మల్ని మీరు నిమగ్నం చేయకండి. ఆర్థిక స్థితి బావుంటుంది. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు మంచి రోజు. కొత్త బాధ్యతలు అందుకుంటారు. యువతకు ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం.