News
News
X

Horoscope Today 3rd March 2023: ఈ రాశి వారు జాగ్రత్త పడకపోతే వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడుతుంది

Rasi Phalalu Today 3rd March 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

మేష రాశి
మేష రాశి వారు ఈ రోజు మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. కొత్త ప్రాజెక్టుల కోసం నిధులు సేకరించే పనిలో ఉంటారు. మీ ప్రేమ వివాహబంధంగా మారే అవకాశం ఉంది. మీ ఉద్యోగంలో ప్రశంసలు దక్కవచ్చు. జీవిత భాగస్వామితో రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు. 

వృషభ రాశి 
ఆరోగ్యం గురించి ఆందోళన పడడం మానుకోవాలి. అదే మీ అనారోగ్యానికి అసలైన మందు. నగలు కొనడంపై ఖర్చుపెడతారు. మీ జీవిత భాగస్వామితో సాయంత్రం సమయాన్ని గడుపుతారు. మీ చక్కని చిరునవ్వే మీకు ఆభరణం.  

మిథున రాశి
ఈరోజు ఒక కార్యక్రమంలో పాల్గొని కొత్త వారిని కలిసే అవకాశం ఉంది. ఆర్ధిక స్థితి మెరుగుపడవచ్చు. కుటుంబసభ్యులతో శాంతిపూర్వకమైన, ప్రశాంతమైన రోజును గడుపుతారు. ధ్యానం మంచి రిలీఫ్ ఇస్తుంది. మీ మూడీ ప్రవర్తనను వదులుకోండి. ప్రేమబంధం కొనసాగడానికి పరస్పరం గౌరవం, నమ్మకం పెంపొందించుకోవాలి. 

కర్కాటక రాశి 
దూర ప్రయాణాలు చేయడానికి అనుకూలమైన సమయం. ఎంత బిజీగా ఉన్నా, అలసటను మీరు జయిస్తారు. ధనలాభం మాత్రం మీరు ఆశించినంత ఉండవు. మీ తల్లిదండ్రులను మీరు నమ్మాల్సిన సమయం ఇది. దూర ప్రాంతం నుండి శుభవార్త వచ్చే ఛాన్సు ఉంది. 

సింహ రాశి 
సింహ రాశికి ఈరోజు మంచి రోజు. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మీ దగ్గర అప్పు తీసుకున్న వారి నుండి డబ్బు మీ ఖాతాలో జమ అవుతుంది. ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆఫీసులోని మీ ప్రత్యర్థులు వారి తప్పుడు పనుల వల్ల కలిగే ఫలితాలను ఈ రోజు అనుభవించే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం, ఆనందంతో సాగుతుంది. 

కన్యా రాశి 
కుటుంబంతో బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆనందాన్నిచ్చే కొత్త బంధాలను కలుపుకుంటారు. మీరు ఎప్పుడో మొదలు పెట్టిన ప్రాజెక్ట్ ఈరోజు పూర్తి అవుతుంది. ఈ విషయంలో మీకు బోలెడంత సంతృపి కలుగుతుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. 

తులా రాశి 
మీ అంతుపట్టని స్వభావంతో వైవాహిక జీవితాన్ని నాశనం చేసుకోకూడదు.మీరు జీవితభాగస్వామిని ఎంతగా ప్రేమిస్తున్నారో తెలియజెప్పండి. సంయమనంగా, ప్రేమగా ఉండాలి. చికాకును, అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యల నుంచి మీ తల్లిదండ్రుల సాయంతో బయటపడతారు. 

వృశ్చిక రాశి 
ఈరోజు ఆధ్యాత్మికంగా జీవించేందుకు ఇష్టపడతారు. మానసిక ఒత్తిడులు ఎదుర్కొనేందుకు ఆధ్యాత్మిక మార్గమే ఉత్తమమని తెలుసుకుంటారు. ధ్యానం, యోగా వంటివి చేయడం ద్వారా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుకోవచ్చు. వివాహితులు అత్తా మావయ్యల నుండి ఆర్ధికప్రయోజనాలను పొందుతారు. ఇంటి పని చాలా అలసటను కలిగిస్తుంది, అదే మానసిక వత్తిడికి ప్రధాన కారణం అవుతుంది.

ధనుస్సు రాశి
ఈరోజు ప్రారంభంలో మీకు అనుకూలంగా ఉన్నపటికీ ,కొన్ని కారణాలవలన ధనాన్ని అధికంగా ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ రోజు మీస్నేహితులు మీ ఇంటికి వచ్చి ఛిల్ అవుతారు. జీవిత భాగస్వామితో ఆత్మీయంగా ఉంటారు. 

మకర రాశి 
ఆర్ధిక పరిస్థితి అంచనా వేసుకోకుండా ఖర్చులు పెట్టకూడదు. దీని వల్ల సాఫీగా సాగుతున్న జీవితం కష్టాల్లో పడవచ్చు. కుటుంబ సభ్యులతో సరదాగా ఉంటారు. పని ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రియమైన వారితో ఆనందంగా గడిపి, ఆ ఒత్తిడిని దూరం చేసుకుంటారు. ఈరోజు చేసే ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకుని రాదు, కానీ భవిష్యత్ ప్రయోజనాలకు పునాది వేస్తుంది.

కుంభ రాశి
మానసిక ప్రశాంతత కోసం దానాలు చేసేందుకు సిద్ధమవుతారు. ధనలాభం మాత్రం ఆశించినంత రాదు. ఉద్యోగ ప్రాంతంలో వ్యతిరేకత రావచ్చు, దాన్ని ఎదుర్కోవడానికి  ధైర్యాన్ని తెచ్చుకోండి. అధిక ఖర్చులు కారణంగా ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గొడవలు వచ్చే అవకాశం ఉంది. 

మీన రాశి 
డిప్రెషన్, కుంటుబాటు సమస్య వంటి వాటి నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. చిరునవ్వుతో వాటిని జయించాలి. పిల్లల నుంచి ఆర్ధిక ప్రయోజనాలు పొందుతారు. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడం ద్వారా ప్రశాంతత, శాంతి కలుగుతాయి. ఈరోజు, కారణములేకుండా ఇతరులతో మీరు గొడవలకు దిగే అవకాశం ఉంది. ఇది మీ హ్యాపీ మూడ్‌ను చెడగొడుతుంది. 

Published at : 03 Mar 2023 06:49 AM (IST) Tags: 3 rasi phalalu Horoscope Today Today Rasiphalalu astrological prediction today 3rd March Horoscope 3rd March Astrology

సంబంధిత కథనాలు

మార్చి 27 రాశిఫలాలు, ఈ రాశివారు తమని తాము నిరూపించుకునేందుకు ఇదే మంచి సమయం

మార్చి 27 రాశిఫలాలు, ఈ రాశివారు తమని తాము నిరూపించుకునేందుకు ఇదే మంచి సమయం

మార్చి 26 రాశిఫలాలు, ఈ రాశులవారి మనసులో ఆనందం-తలపెట్టిన పనిలో జయం

మార్చి 26 రాశిఫలాలు, ఈ రాశులవారి మనసులో ఆనందం-తలపెట్టిన పనిలో జయం

వారఫలాలు (మార్చి 27 నుంచి ఏప్రిల్ 02): ఈ వారం ఈ రాశులవారికి శారీరక, మానసిక సమస్యలు - అహంకారం వీడకపోతే చాలా నష్టపోతారు

వారఫలాలు (మార్చి 27 నుంచి ఏప్రిల్ 02): ఈ వారం ఈ రాశులవారికి శారీరక, మానసిక సమస్యలు - అహంకారం వీడకపోతే చాలా నష్టపోతారు

Weekly Horoscope 27 March-02 April: ఈ వారం ఈ 6 రాశులవారి అదృష్టం చూసి అంతా అసూయపడతారు, మార్చి 27 నుంచి ఏప్రిల్ 02 వారఫలాలు

Weekly Horoscope 27 March-02 April: ఈ వారం ఈ 6 రాశులవారి అదృష్టం చూసి అంతా అసూయపడతారు, మార్చి 27 నుంచి ఏప్రిల్ 02 వారఫలాలు

Sri Rama Navami 2023: రావణుడికి అయోధ్య ఇస్తానన్న రాముడు, శ్రీరామచంద్రుడి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలివే!

Sri Rama Navami 2023: రావణుడికి అయోధ్య ఇస్తానన్న రాముడు, శ్రీరామచంద్రుడి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలివే!

టాప్ స్టోరీస్

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

Nitish Rana: కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన కోల్‌కతా - అస్సలు అనుభవం లేని ప్లేయర్‌కి!

Nitish Rana: కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన కోల్‌కతా - అస్సలు అనుభవం లేని ప్లేయర్‌కి!