Horoscope Today 30th October 2022: మీ కారణంగా లాభపడిన వారే మిమ్మల్ని అవమానించేందుకు ప్రయత్నిస్తారు, అక్టోబరు 30 రాశిఫలాలు
Horoscope Today 30th October 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Horoscope Today 30th October 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈ రోజు శుభ తీర్మానాలతో ప్రారంభమవుతుంది. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు సమయం ఉపయోగపడుతుంది. పిల్లల సహకారంతో పనులు పూర్తి చేస్తారు.
వృషభ రాశి
అపరిచిత వ్యక్తితో పరిచయం అద్భుతంగా అనిపిస్తుంది. వాహనాన్ని, యంత్రాలను జాగ్రత్తగా ఉపయోగించండి. భూమి నిర్మాణానికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు. మీ ప్రవర్తనా విధానం అందర్నీ ఆకట్టుకుంటుంది.
మిథున రాశి
మీకున్న పరిచయాల నుంచి ఈ రోజు మీరు ప్రయోజనం పొందుతారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. స్నేహితుల సహాయంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త..అనవసర ప్రయాణాలు చేయొద్దు.
Also Read: కార్తీకమాసం నెలరోజులూ తలకు స్నానం చేయకపోతే ఏమవుతుంది!
కర్కాటక రాశి
స్నేహితులతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారులకు కొత్త భాగస్వాములు ఏర్పడతారు. ఉద్యోగులకు, వ్యాపారులకు, విద్యార్థులకు శుభసమయం. మీ కారణంగా లాభపడిన వారే మిమ్మల్ని అవమానించేందుకు ప్రయత్నిస్తారు.
సింహ రాశి
వ్యాపార విస్తరణ బాధ్యత పెరగడం వల్ల మీ వ్యక్తిగత పనిపై ప్రభావం పడుతుంది. మీ జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి..వారికి గౌరవం ఇవ్వండి. కుటుంబ వాతావరణం సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితిలో పెద్దగా మార్పులుండవు. ఆరోగ్యం బావుంటుంది.
కన్యా రాశి
ఈ రాశివారు స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం పొందుతారు. మీ పనితీరుతో సహోద్యోగులను ఆకట్టుకుంటారు. మీ మనసులో మాటను బయటపెట్టే అవకాశం వస్తుంది వినియోగించుకోండి. ఆధ్యాత్మిక వ్యవహారాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆదాయం బావుంటుంది.
తులా రాశి
మీ పనితీరులో మార్పు వస్తుంది..శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ప్రత్యేక వ్యక్తులతో అనుబంధం పెరుగుతుంది. ప్రయాణం చేయాల్సిన అవసరం రావొచ్చు. పొట్టకు సంబంధించిన ఇబ్బంది ఉండొచ్చు. ఆదాయం బాగానే ఉంటుంది.
Also Read: కార్తీక మాసంలో ఉపవాసం ఉంటున్నారా, సోమవార వ్రతం ఆరు రకాలు - ఇందులో మీరు పాటించే విధానం ఏంటి!
వృశ్చిక రాశి
కుటుంబ సభ్యులకు మీరు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. ఎవరికైనా సహాయం చేయాల్సి రావొచ్చు. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో విజయం పొందుతారు.
ధనుస్సు రాశి
ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. పెద్దల మాటలకు ప్రాధాన్యం ఇవ్వండి. మీ మాటతీరు అందర్నీ మెప్పిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భగవంతుడిపై మునుపటి కన్నా భక్తి పెరుగుతుంది.
మకర రాశి
ఈ రోజు మీకు మంచి రోజు. కుటుంబంలో గందరగోళ పరిస్థితులు నెమ్మదిగా సర్దుమణుగుతాయి. కోపం తగ్గుతుంది. ప్రయాణ యోగం ఉంది. అధికారిక వర్గంలో ఉన్నవారికి అనుకూలమైన సమయం ఇది. ఆర్థిక పరిస్థితి మునుపటి కన్నా మెరుగుపడతుంది. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.
కుంభ రాశి
ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంలో మీ ప్రయత్నం మీరు చేయండి. అడగకుండా సలహాలు, సూచనలు ఎవ్వరికీ ఇవ్వొద్దు. తల్లిదండ్రులతో సంబంధాలు బలహీనంగా ఉంటాయి. ఉద్యోగులకు అంత మంచి సమయం కాదిది..జాగ్రత్తగా ఉండాలి. పని విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించొద్దు.
మీన రాశి
కొత్త ఆశలతో ఈ రోజు ప్రారంభిస్తారు. ప్రేమ వ్యవహారంలో విజయం సాధించడం వల్ల మనసు ఆనందంగా ఉంటుంది. వాహనం ఖర్చు అవుతుంది. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో ముందుంటారు. మిమ్మల్ని ముంచేవారిని ముందే గుర్తించండి.