ఏప్రిల్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్ లో ప్రయోజనకరంగా ఉంటుంది
Rasi Phalalu Today 2nd April 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
ఏప్రిల్ 2 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు మీకు లాభదాయకమైన రోజు. రోజు ప్రారంభం చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభదినం. శుభవార్త వినే అవకాశం ఉంది. నిరుద్యోగులు అవకాశం పొందుతారు. అయితే మీ రహస్య శత్రువులు మీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి మీకు వ్యతిరేకంగా చురుకుగా పనిచేస్తారు.
వృషభ రాశి
ఈ రోజు మీకు సాధారణ రోజు అవుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. వ్యాపారులు నూతన పెట్టుబడుల దిశగా ఆలోచిస్తారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.
మిథున రాశి
ఈ రోజు మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. మీ దినచర్యలో మార్పు వస్తుంది. ఒక సీరియస్ విషయం కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. ఎలాంటి ఆలోచన చేయకుండా నిర్ణయాలు తీసుకోవద్దు.
కర్కాటక రాశి
కుటుంబంలో అపారమైన సంతోషం ఉంటుంది. మీవిషయంలో మీ ఉన్నతాధికారులు కొందరు బహిరంగంగా వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఉద్యోగులు తమ పని విషయంలో రాజీ పడొద్దు. వ్యాపారం పెంచుకునేందుకు ప్రయత్నించండి. ఖర్చులు తగ్గించడం మంచిది.
Also Read: ఏప్రిల్ 6 హనుమాన్ జయంతి కాదు - హనుమాన్ విజయోత్సవం!
సింహ రాశి
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. మానసికంగా మీరు చాలా బలంగా ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాలు మీకు చాలా ఉపయోగపడతాయి. వివాహితులకు చాలా మంచి రోజు అవుతుంది. మీ జీవిత భాగస్వామికి మీకు ఉన్న దూరాన్ని తగ్గించుకోవాలి.
కన్యా రాశి
ఈ రోజు మీరు ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది. మీ దినచర్య మారుతుంది. వైవాహిక జీవితం బావుంటుంది. ఈ రోజు మీరు మీ భార్యకు బహుమతి ఇస్తానని ప్రామిస్ చేస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
తులా రాశి
ఈ రోజు మీరు తొందరగా అలసిపోతారు. అనుకున్న పనులు నెరవేర్చుతారు. అపరిచితులను ఎక్కువగా నమ్మొద్దు. మీ ఆహారం , దినచర్య గురించి నిర్లక్ష్యంగా ఉండొద్దు. మిత్రుల సహకారంతో లబ్ది పొందుతారు.
వృశ్చిక రాశి
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. మీరు మీ పనిపై పూర్తి శ్రద్ధ చూపుతారు...అనుకున్నట్టే పూర్తిచేస్తారు. ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యులు మీకు తోడుగా నిలుస్తారు. మీకు అదృష్టం కలిసొస్తుంది. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు.
Also Read: శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో 5 రాశుల వారికి ఆదాయం పెరిగితే , ఈ 3 రాశులవారికి ఖర్చులు పెరుగుతాయి
ధనుస్సు రాశి
ఈ రోజు మంచి రోజు అవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఉద్యోగులు, వ్యాపారులు , విద్యార్థులకు ఉపశమనం లభిస్తుంది.
మకర రాశి
ఈ రోజు మీలో ఆత్మవిశ్వాసం నిండి ఉంటుంది. అన్ని రంగాల్లో ఆశించిన దానికన్నా మంచి ఫలితాలు పొందుతారు. శత్రువులు తగ్గుతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఈ రోజు మీ కోసం ఒక శుభవార్త వేచి ఉంది. మాటల్లో ఓపికగా ఉండండి.
కుంభ రాశి
ఈ రోజు కుంభ రాశివారికి మంచి రోజు. ఓ పని కోసం కష్టపడతారు..అందుకోసం చాలా కృషి చేస్తారు. ఈ ప్రయత్నం ఫ్యూచర్లో మీకు ప్రయోజనం చేకూర్చుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది . ఉద్యోగులు టార్గెట్స్ నెరవేరుస్తారు.
మీన రాశి
ఈ రోజు మీ జీవితంలో బంగారు క్షణాలను తీసుకురాబోతోంది. ఆర్థికంగా బలంగా ఉంటారు. వైవాహిక జీవితంలో పరస్పర విశ్వాసం బంధాన్ని బలోపేతం చేస్తుంది. ఈ రోజు మీరు పాత స్నేహితుడితో ఫోన్లో మాట్లాడతారు.