అన్వేషించండి

Horoscope Today 28th june 2024: ఈ రాశుల ఉద్యోగులకు కార్యాలయంలో ఇబ్బందులు తప్పవ్.. జూన్ 28 రాశిఫలాలు

Horoscope Prediction 28th june 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈ రోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope Predictions in Telugu

మేష రాశి

ఈ రోజు ఈ రాశి ఉద్యోగులు పని ప్రదేశంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. శారీరక , మానసిక అలసటగా అనిపిస్తుంది. నిర్మాణ రంగంలో ఉండేవారికి కొన్ని ఆటంకాలు తప్పవు. అనవసర ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి తగ్గుతుంది. ఎవరికీ అప్పులు ఇవ్వొద్దు.

వృషభ రాశి

ఈ రోజు కార్యాలయంలో పని ఒత్తిడి ఉంటుంది కానీ అధిగమిస్తారు. వ్యాపారం బాగానే సాగుతుంది. తెలివైన వ్యక్తుల సహవాసం మీకు కలిసొస్తుంది. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. 
 
మిథున రాశి

ఈ రాశి ఉద్యోగులు పనివిషయంలో ప్రశంసలు అందుకుంటారు. నూతన వ్యాపారం ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారుతాయి. ఆరోగ్యం బావుంటుంది ..రోజంతా సంతోషంగా ఉంటారు. 

Also Read: అశ్వత్థామ శాపం , ఎగిరే గుర్రం ప్లేస్ లో కారు, చిలుక స్థానంలో బుజ్జి..మొత్తం సేమ్ టు సేమ్ దించేసిన నాగ్ అశ్విన్!

కర్కాటక రాశి

ఉన్నతాధికారుల సలహాలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. రోజంతా బిజీగా ఉంటారు కానీ చేయాల్సిన పని విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉంటారు. మీలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగండి. ఆరోగ్యం జాగ్రత్త. 

సింహ రాశి

ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ ప్రవర్తన మీ సన్నిహితులను కలవరపెడుతుంది. ఆవేశం, కోపం తగ్గించుకోవాలి. ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త చేయండి. ఇతరులపై ఎక్కువగా ఆధారపడొద్దు. 

కన్యా రాశి

ఈ రోజు మీరు వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఉద్యోగులు, విద్యార్థులకు శుభసమయం. నిరుద్యోగుల నిరీక్షణ ఫలించే సమయం వచ్చేసింది. కుటుంబంలో సంతోషం, ఐశ్వర్యం వృద్ధి చెందుతాయి.  మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.  

తులా రాశి

ఈ రోజు మీరు కొన్ని సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. ఇంటర్యూలకు హాజరయ్యేవారు విజయం సాధిస్తారు. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.

 Also Read: శంబలలో కల్కి .. శ్రీలంకలో పద్మావతి..కథను మలుపుతిప్పిన చిలుక..పురాణాల్లో ఉన్న కల్కి అసలు స్టోరీ ఇదే!
 
వృశ్చిక రాశి

ఆర్థిక సంబంధిత సమస్యలకు ఈ రోజు పరిష్కారం వెతుక్కోగలుగుతారు.  ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందాలనుకుంటే ఈ రోజు చాలా శుభప్రదమైనది. భవిష్యత్ కోసం ప్రణాళికలు వేసుకునేటప్పుడు స్నేహితులు, కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరించడం మంచిది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. 

ధనస్సు రాశి

ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలుంటాయి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన వాయిదా వేయడం మంచిది. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడేవారు జాగ్రత్త.   

మకర రాశి

ఈ రోజు మీకు మంచి రోజు, అయితే ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. చాలా పాత జ్ఞాపకాలు అకస్మాత్తుగా కళ్లముందు మెదులుతాయి. పరిశోధన పనులపట్ల ఆసక్తి ప్రదర్శిస్తారు. పిల్లల ప్రవర్తనతో సంతోషంగా ఉంటారు. 

Also Read: 'హనుమాన్' లో విభీషణుడు , 'కల్కి' లో అశ్వత్థామ.. సప్త చిరంజీవులపై ఫోకస్ చేస్తున్న మేకర్స్.. కల్కి ఎంట్రీ తర్వాత వీళ్ల పాత్రేంటి!

కుంభ రాశి

మీ సన్నిహితుల కారణంగా ఇబ్బంది పడాల్సిన సందర్భం ఎదురవుతుంది. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారులు లాభపడతారు. సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది. 

మీన రాశి

ఈ రోజు మీరు ఓ పెద్ద నిర్ణయం తీసుకుంటారు. కుటుంబం విషయంలో చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. అతిథుల రాకతో ఆనందంగా ఉంటారు. కెరీర్ గురించి ఓ శుభవార్త వింటారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి రోజు. 

Also Read: కలి మళ్లీ ఎప్పుడొస్తాడు.. కలియుగం అంతమయ్యాక సత్యయుగ పాలన అయోధ్య కేంద్రగా ఉండబోతోందా! 

గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

06-10-2026 మంగళవారం రాశి ఫలాలు: మకర, కుంభ, మీన రాశులకు అదృష్టం, లాభాలు, పురోగతి!
06-10-2026 మంగళవారం రాశి ఫలాలు: మకర, కుంభ, మీన రాశులకు అదృష్టం, లాభాలు, పురోగతి!
06-10-2026 మంగళవారం రాశిఫలాలు: తులా, వృశ్చిక, ధనుస్సు మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
06-10-2026 మంగళవారం రాశిఫలాలు: తులా, వృశ్చిక, ధనుస్సు మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
06-10-2026 మంగళవారం రాశిఫలాలు: కర్కాటకం, సింహం, కన్యా రాశుల వారికి మార్గదర్శనం!
06-10-2026 మంగళవారం రాశిఫలాలు: కర్కాటకం, సింహం, కన్యా రాశుల వారికి మార్గదర్శనం!
06-10-2026 మంగళవారం మేషం, వృషభం, మిథునం రాశిఫలాలు: వ్యాపారం, ఉద్యోగం, ఆర్థికంలో అదృష్టం మీ వెంటే!
06-10-2026 మంగళవారం మేషం, వృషభం, మిథునం రాశిఫలాలు: వ్యాపారం, ఉద్యోగం, ఆర్థికంలో అదృష్టం మీ వెంటే!

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
Sivakarthikeyan : నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
Embed widget