News
News
X

Horoscope Today 28th September 2022: నవరాత్రుల్లో మూడోరోజు ఈ రాశులవారిపై లక్ష్మీదేవి కరుణా కటాక్షాలుంటాయి,సెప్టెంబరు 28 రాశిఫలాలు

Horoscope Today 28 September :ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
 
Horoscope Today 28 September : కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రోజు మీరు పనిలో మరింత బిజీగా ఉంటారు. కుటుంబంలో ఆనందం ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఈ రోజు అనుకూలమైనది. ఇంట్లో శుభకార్యం నిర్వహించేందుకు బిజీబిజీగా ఉంటారు.

వృషభ రాశి
ఈరోజు ప్రేమ వ్యవహారాలు పెరుగుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. కుటుంబంతో సామరస్యంగా నడుచుకుంటారు.

మిథున రాశి
కార్యాలయంలో మీ ప్రభావం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో కొంత టెన్షన్ ఉండవచ్చు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అందరి మాటలను మనసులోకి తీసుకోవద్దు. చేస్తున్న పనిలో తప్పులుంటే సరిదిద్దుకోండి.

News Reels

Also Read: శివయ్య ప్రేమ గెలిచిన బ్రహ్మచారిణి, ఈ అవతారాన్ని పూజిస్తే సంతోషం, సౌభాగ్యం, సంపద

కర్కాటక రాశి
మీ జీవిత భాగస్వామితో కొనసాగుతున్న వైరం నుంచి విముక్తి లభిస్తుంది. సొంతంగా ఏదైనా వ్యాపారం లేదా ప్రాజెక్ట్ చేసేందుకు ఆలోచిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఇంట్లో పెద్దల పట్ల శ్రద్ధ వహించండి.

సింహ రాశి
ఈ రోజు ఆర్థిక పరంగా అనుకూలమైన రోజు. వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబ సంతోషం ఉంటుంది. మీ స్నేహితుడికి సహాయం చేయడానికి ముందుకు వస్తారు.కార్యాలయంలోని సీనియర్ అధికారులు మీపై ఏదో ఒక విషయంలో కోపంగా ఉండవచ్చు.

కన్యారాశి 
కన్యారాశి ప్రేమికులకు మంచి రోజు..పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే కుటుంబాలతో మాట్లాడేందుకు ఇదే మంచి సమయం. మానసిక ప్రశాంతత ఉంటుంది. పని పట్ల ఉత్సాహం పెరుగుతుంది. ఈ రోజు, మీరు కొన్ని పనుల్లో ఆకస్మిక విజయాన్ని పొందడం ఆనందంగా ఉంటుంది.

Also Read: ఈ వారం ఈ రాశులవారికి స్థిరాస్తి వ్వవహారాలు కలిసొస్తాయి

తులా రాశి
ఈ రోజు తులారాశి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అత్తమామల వైపు నుంచి ధనలాభం ఉండొచ్చు. చాలా రోజులుగా కార్యాలయంలో కొనసాగుతున్న పనికి బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

వృశ్చిక రాశి
తోబుట్టువులతో సంతోష సమయం గడుపుతారు. ఈ రోజు కొన్ని శుభవార్తలను పొందవచ్చు. ఆహారం పానీయాల పట్ల శ్రద్ధ వహించండి లేదంటే ఆరోగ్యం క్షీణించవచ్చు. స్నేహితుని సహాయంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వైవాహిక జీవితాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి.

ధనుస్సు రాశి
మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు.ప్రయాణాలు చేయాలనుకుంటారు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు అనుకూలమైనది. ప్రేమికుల జీవితంలో కొత్త మార్పులొస్తాయి.లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పిల్లల చదువుల గురించి ఆందోళన చెందుతారు.

మకర రాశి
మీ ఖర్చులను నియంత్రించుకోండి. ప్రేమ జీవితంలో కొత్త వసంతం వస్తుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు ఆ ప్రయత్నాన్ని కొనసాగించండి. మీ జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

కుంభ రాశి
ఈ రోజు మీరు మీ పనిలో ఆశించిన విజయాన్ని పొందుతారు. రచన, కళారంగంలో ఉన్నవారు పేరు సంపాదిస్తారు. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఇంట్లో ఏవైనా పెద్ద సమస్య వచ్చే అవకాశం ఉంది..జాగ్రత్తగా వ్యవహరించండి. 

మీన రాశి
ఈ రోజు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది, జీవితంలో సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. వ్యాపార విషయాలలో ఓపిక పట్టండి.

Published at : 28 Sep 2022 05:12 AM (IST) Tags: Weekly Horoscope Horoscope Today 28 Septembe today's horoscope 28 september 2022 28 september 2022 horoscope

సంబంధిత కథనాలు

Christmas Celebrations 2022: ఇంటి అలంకరణ మాత్రమే కాదు క్రిస్మస్ కి ఇలా కూడా చేయొచ్చు!

Christmas Celebrations 2022: ఇంటి అలంకరణ మాత్రమే కాదు క్రిస్మస్ కి ఇలా కూడా చేయొచ్చు!

2023 Cancer Yearly Horoscope: శని ఇబ్బంది పెడితే బృహస్పతి ఉపశమనం ఇస్తాడు, 2023 లో కర్కాటక రాశిఫలాలు

2023 Cancer Yearly Horoscope:  శని ఇబ్బంది పెడితే బృహస్పతి ఉపశమనం ఇస్తాడు, 2023 లో కర్కాటక రాశిఫలాలు

Love Horoscope Today 9th December 2022:ఈ రాశివారి ప్రేమ జీవితంలో సాన్నిహిత్యం, వివాహితుల జీవితంలో శాంతి

Love Horoscope Today 9th December 2022:ఈ రాశివారి ప్రేమ జీవితంలో సాన్నిహిత్యం, వివాహితుల జీవితంలో శాంతి

Horoscope Today 9th December 2022: ఈ రోజు ఈ రాశివారు ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకోవద్దు, డిసెంబరు 9 రాశిఫలాలు

Horoscope Today 9th  December 2022: ఈ రోజు ఈ రాశివారు ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకోవద్దు, డిసెంబరు 9 రాశిఫలాలు

Christmas 2022: క్రిస్మస్‌ అనాలా - ఎక్స్‌ మస్‌ అనాలా , డిసెంబరు 25నే ఎందుకు!

Christmas 2022:  క్రిస్మస్‌ అనాలా - ఎక్స్‌ మస్‌ అనాలా , డిసెంబరు 25నే ఎందుకు!

టాప్ స్టోరీస్

Rythu Bazar Employees: రైతు బజార్ల సిబ్బందికి సీఎం జగన్ గుడ్ న్యూస్!

Rythu Bazar Employees: రైతు బజార్ల సిబ్బందికి సీఎం జగన్ గుడ్ న్యూస్!

CM KCR Speech: పవర్ ఐల్యాండ్‌గా హైదరాబాద్‌, న్యూయార్క్‌లో కరెంటు పోవచ్చేమో! ఇక్కడ అస్సలు పోదు: కేసీఆర్

CM KCR Speech: పవర్ ఐల్యాండ్‌గా హైదరాబాద్‌, న్యూయార్క్‌లో కరెంటు పోవచ్చేమో! ఇక్కడ అస్సలు పోదు: కేసీఆర్

షర్మిల పాదయాత్రకు నో పర్మిషన్- తేల్చి చెప్పిన వరంగల్ పోలీసులు

షర్మిల పాదయాత్రకు నో పర్మిషన్- తేల్చి చెప్పిన వరంగల్ పోలీసులు

JD Waiting For Party : విశాఖ నుంచి పోటీ ఖాయం - సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఏ పార్టీలోకి ?

JD Waiting For Party :  విశాఖ నుంచి పోటీ ఖాయం - సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఏ పార్టీలోకి ?