Horoscope Today 25th October 2023: ఈ రాశులవారు ఈ రోజు గుడ్ న్యూస్ వింటారు, అక్టోబరు 25 రాశిఫలాలు
Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.
![Horoscope Today 25th October 2023: ఈ రాశులవారు ఈ రోజు గుడ్ న్యూస్ వింటారు, అక్టోబరు 25 రాశిఫలాలు Horoscope Today 25th October 2023 Astrology Rasi Phalalu Astrological Prediction for Aries, leo and all Zodiac signs in Telugu Horoscope Today 25th October 2023: ఈ రాశులవారు ఈ రోజు గుడ్ న్యూస్ వింటారు, అక్టోబరు 25 రాశిఫలాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/24/3ba78407e9b73a3949422eae86a266911698158177308217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
అక్టోబరు 25 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు మేష రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. స్నేహితునితో వాగ్వాదానికి దూరంగా ఉండాలి. కుటుంబ కార్యక్రమాలతో బిజీగా ఉంటారు. ఆస్తి వివాదాలు పెరగవచ్చు. శారీరకంగా బలహీనంగా భావిస్తారు. బంధువులను కలుస్తారు.
వృషభ రాశి
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ గురించిన సమాచారం అందుతుంది. మీరు కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీరు ఈరోజు వ్యాపారంలో లాభాలు పొందుతారు. కొత్త ప్రదేశాన్ని సందర్శించడానికి వెళతారు. ఇంక్రిమెంట్ పొందవచ్చు. వృద్ధులకు సేవ చేయండి. ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది.
మిథున రాశి
మిధున రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. మీరు కార్యాలయంలో శుభవార్త అందుకుంటారు. మీ కెరీర్ విషయంలో మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. తెలియని వ్యక్తుల నుంచి దూరం పాటించండి. కుటుంబ కలహాలు వచ్చే అవకాశం ఉంది. మీరు కొన్ని పనుల నిమిత్తం ప్రయాణం చేయవచ్చు.
కర్కాటక రాశి
ఈ రోజు మీరు గుడ్ న్యూస్ వింటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. వ్యాపార పరిస్థితి బాగుంటుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందం ఉంటుంది. దంపతులు విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు మంచి సమాచారం లభించే అవకాశం ఉంది.
సింహ రాశి
రోజు మీకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. కొత్త సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. పెద్దల ఆశీస్సులు మీపై ఉంటాయి. బలహీనంగా అనిపిస్తారు. ఓ బ్యాడ్ న్యూస్ వినాల్సి రావొచ్చు. అనవసర చర్చలు తగ్గిస్తే మీకే మంచిది.
కన్యా రాశి
ఈ రోజు మీరు కొన్ని పనుల్లో నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో వాగ్వాదం ఉండొచ్చు.స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. సమస్యలు పరిష్కారమవుతాయి. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయండి. కారణం లేకుండా ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోకండి. సంపదలో పెరుగుదల ఉంటుంది.
తులా రాశి
తులా రాశి వారికి ఈరోజు బావుంటుంది. తలపెట్టిన పనుల్లో విజయం అందుకుంటారు. అదృష్టం కలిసొస్తుంది. కొత్త వనరుల నుంచి ఆదాయం పొందుతారు. పాత వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు లాభపడతారు.ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. అనుకున్న పనులు పూర్తవుతాయి. వైవాహిక జీవితం బావుంటుంది.
వృశ్చిక రాశి
ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. శత్రు పక్షం నుంచి ఇబ్బందులు రావచ్చు. భూ వివాదాలు తలెత్తే ప్రమాదం ఉంది. భారీ యంత్రాలతో పనిచేసే వారు జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది. మీ ఆలోచనలతో ఇతరులను ప్రభావితం చేస్తారు. పాత వస్తువులను కొనుగోలు చేయకపోవడమే మంచిది. పారదర్శకతతతో పనిచేయాలి.
ధనుస్సు రాశి
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం బలహీనంగా అనిపిస్తుంది. పెద్దల సలహాలు ఉపయోగపడతాయి. నీ బలహీనతను ఎవరికీ చెప్పొద్దు. మిమ్మల్ని ఉపయోగించుకునేవారి సంఖ్య పెరుగుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ఎవరితోనైనా వివాదం జరిగే అవకాశం ఉంది. చికిత్స కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు.
మకర రాశి
ఈ రోజు మకర రాశి వారికి సంతోషకరమైన రోజు అవుతుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్‌లో లాభాలు వచ్చే అవకాశం ఉంది. నూతన పెట్టుబడులకు ఇదే సరైన సమయం. ఆధ్యాత్మిక ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం అందుకుంటారు. పాత పరిచయస్తులను కలుస్తారు.
కుంభ రాశి
ఈ రోజు మీపై మీకున్న విశ్వాసం మరింత పెరుగుతుంది. మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు. తెలియని వ్యక్తుల నుంచి దూరం పాటించండి. మీరు మీ ప్రవర్తనలో మార్పులను గమనిస్తారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న మొత్తాన్ని తిరిగి పొందుతారు. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పూర్తవుతాయి.
మీన రాశి
ఈ రాశివారు మిత్రుల నుంచి శుభవార్త అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. వ్యాపారులు, ఉద్యోగులకు శుభసమయం. ఎవ్వరితోనూ వాదనలు పెట్టుకోవద్దు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)