అన్వేషించండి

Horoscope Today 22nd January 2024: ఈ రాశులవారి జీవితంలో ఊహించని మార్పులు వస్తాయ్, జనవరి 22 రాశిఫలాలు

Horoscope Today 22nd January 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Horoscope Today 22nd January  2024  - జనవరి 22 రాశిఫలాలు

మేష రాశి (Aries Horoscope Today) 

కొన్ని దూర సంబంధాలలో విభేదాలు పెరుగుతాయి. మీ ప్రేమ జీవితం బాగుంటుంది. ఉద్యోగ ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. వ్యాపారస్తులు కొత్త వ్యాపార ఆలోచనలు చేస్తారు.  ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. జీవనశైలి మెరుగుపడుతుంది. అయితే వ్యాపారవేత్తలు ఆర్థిక నిర్ణయాలు ఆలోచనాత్మకంగా తీసుకోవాలి లేదంటే డబ్బు నష్టపోతారు.

వృషభ రాశి (Taurus  Horoscope Today)

ఈ రోజు మీలో ఆత్మవిశ్వాసం నిండుగా ఉంటుంది. కెరీర్లో పురోగతికి కొత్త అవకాశాలు వస్తాయి. వృత్తి జీవితంలో ఎక్కువ ఒత్తిడి తీసుకోకండి. కార్యాలయంలోని సవాళ్లు అధిగమించాలంటే ముందు మిమ్మల్ని మీరు విశ్వశించండి. పరిస్థితికి తగ్గట్టుగా ఉండటం మీ ప్రత్యేక లక్షణం. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భవిష్యత్తులో ఆర్థికంగా బలపడేందుకు మంచి ప్రణాళికలు రూపొందించండి.

Also Read: అయోధ్యలో విగ్రహ ప్రతిష్ట సమయంలో శ్రీరామ భక్తులు ఈ శ్లోకాలను మననం చేసుకోండి!

మిథున రాశి (Gemini Horoscope Today) 

మీ జీవితంలోకి కొత్త వ్యక్తులకు స్వాగతం చెప్పేందుకు సిద్ధంగా ఉండండి. ఈ రోజు మీరు ఒకరిపై ప్రేమను అనుభవిస్తారు. వివాహితులకు శుభదినం. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి  ఇదే మంచి సమయం. వాహనం కొనుగోలు చేయాలన్న ఆలోచన ముందుకు సాగుతుంది..

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

మీ ప్రేమ జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. మీరు కార్యాలయంలో మార్పులను ఎదుర్కోవలసి ఉంటుంది కానీ ఈ మార్పులు పురోగతికి మార్గాలను నిర్ధారిస్తాయి. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. మిమ్మల్ని మానసికంగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే కార్యకలాపాలలో పాల్గొనండి. ఆదాయం పెరిగే మార్గాలు కనిపిస్తాయి..ఆ దిశగా అడుగేయండి. 

Also Read: ఆదర్శపురుషుడు అంటే ఎవరు - ఈ సుగుణాలుంటే మీరూ రాముడే!

సింహ రాశి (Leo Horoscope Today)

కుటుంబంలో ఉండే సమస్యలు సానుకూలతతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. అవివాహితుల నిరీక్షణ ఫలిస్తుంంది. నిరుద్యోగులు ఇంటర్యూలలో విజయం సాధిస్తారు. రోజంతా సంతోషంగా ఉంటారు. వ్యాపారులు, ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలున్నాయి. విద్యార్థులు చదువుపై మరింత దృష్టి సారించాలి

కన్యా రాశి  (Virgo Horoscope Today) 

బంధాలు మెరుగుపడాలంటే కాస్త ఓపికగా, సహనంగా వ్యవహరించడం చాలా అవసరం. కోపం కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఈ రాశి ఉద్యోగులు కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది.  మీ సహోద్యోగులతో ఆఫీసు గాసిప్‌ల గురించి చర్చించకండి.  వ్యాపారవేత్త తన వ్యాపార భాగస్వాముల మద్దతును పొందడం వలన సమస్యల నుంచి బయటపడతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

Also Read: 'రామ' ఈ రెండు అక్షరాలు ఎందుకంత పవర్ ఫుల్!

తులా రాశి (Libra Horoscope Today) 

ఈ రాశివారు ఈ రోజు ఆరోగ్యం ,డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ వృత్తి జీవితంలో చాలా పురోగతిని పొందుతారు. అత్యవసర పనులను జాగ్రత్తగా నిర్వహించండి. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయండి. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలకు ఖర్చు చేస్తారు. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేవిషయాన్ని వాయిదా వేయడం మంచిది.

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

ఈ రాశికి చెందిన ఒంటరి వ్యక్తులు జంటను వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు. మెరుగైన సంభాషణ ద్వారా మీ భాగస్వామితో మీ సంబంధం బలపడుతుంది. పరస్పర సమన్వయంతో నిర్ణయాలు తీసుకుంటే మీ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవచ్చు. కార్యాలయంలో చాలా ఉత్తేజకరమైన మార్పులు ఉంటాయి. సహోద్యోగులు, ఉన్నతాధికారులను ఆకట్టుకోవడానికి మీ మేధో నైపుణ్యాలు , వినూత్న ఆలోచనలను ఉపయోగించండి. పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకునేటప్పుడు మీపై నమ్మకం ఉంచండి.

Also Read: రావణ సంహారం అనంతరం రాముడు అయోధ్యలో అడుగుపెట్టిన రోజు ఏం జరిగిందంటే!

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

మీ ప్రతిభను ప్రదర్శించడానికి, కొత్త ఆవిష్కరణలు చేయడానికి మరియు మీ సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఇది సమయం. మీపై మీరు విశ్వాసం కలిగి ఉండండి. ఈ సమయం మిమ్మల్ని ఊహించని అవకాశాలవైపు నడిపిస్తుంది.  ఆర్థిక పురోగతి  ఉంటుంది. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించండి. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే కార్యకలాపాలలో పాల్గొనండి. 

మకర రాశి (Capricorn Horoscope Today) 

ఈ రాశి ఉద్యోగులు, వ్యాపారులు పనిలో సవాళ్లు ఎదుర్కోవచ్చు. శక్తివంచన లేకుండా కృషి చేసినప్పుడే సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారుల నూతన పెట్టుబడులకు ఈ రోజు మంచి రోజు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. తీసుకున్న అప్పులు చెల్లించే బాధ్యత తీసుకోండి

Also Read: అయోధ్యకు రావణుడుని రాజు చేస్తానన్న రాముడు - అదే జరిగి ఉంటే!

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

మార్కెటింగ్, సేల్స్ పర్సన్లు ఈరోజు ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయాల్సి రావొచ్చు. కొంతమంది ఆరోగ్య నిపుణులు విదేశాలకు వెళ్లవలసి ఉంటుంది. ఆఫీస్ రాజకీయాలు మిమ్మల్ని కూడా ప్రభావితం చేయగలవు, మీరు వాటికి దూరంగా ఉండేలా చూసుకోండి. బంగారం , వజ్రాల మీద పెట్టుబడి పెట్టేందుకు మంచి సమయం. వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నించాలి.

మీన రాశి (Pisces Horoscope Today) 

ఈ రాశివారి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారు. చేపట్టిన పనిని గడువుకన్నా ముందే పూర్తిచేస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆదాయవనరులు పెరుగుతాయి. ఈ వారం మొత్తం ఆనందంగా ఉంటారు. వ్యక్తిగత జీవితంలో సంతోషం నిండి ఉంటుంది. 

Also Read: కామాతురాణాం నభయం నలజ్జ - ఫలితమే రాముడి చేతిలో రావణ సంహారం!

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Embed widget