అన్వేషించండి

మే 21 రాశిఫలాలు, గుండెసంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి

Rasi Phalalu Today 21st May: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

మే 21 రాశిఫలాలు

మేష రాశి
ఈ రోజు మీరు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తవచ్చు. క్యాటరింగ్‌ పనులు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం జాగ్రత్త. కొన్ని అనవసర పనుల్లో ఖర్చులు తప్పవు. ఇంట్లో, కార్యాలయంలో మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. 

వృషభ రాశి
ఈ రోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం బావుంటుంది. మీలో కళాత్మకను సరైన దారిలో ఉపయోగించుకోవాలి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. వ్యాపారం బాగా సాగుతుంది. 

మిథున రాశి
ఈ రాశివారు మాట, ప్రవర్తనలో జాగ్రత్త అవసరం. మీ మాటతీరు వల్ల ఎవ్వరూ ఇబ్బందిపడకుండా జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం జాగ్రత్త. ముఖ్యంగా గుండెసంబధిత వ్యాధులతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఆందోళన అలాగే ఉంటుంది.  భగవంతుని పట్ల  భక్తి పెరుగుతుంది.

కర్కాటక రాశి
ఈ రోజు ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. స్నేహితుల నుంచి ప్రయోజనం ఉంటుంది. బంధువులను కలుస్తారు. వ్యాపార ప్రణాళికలు విజయవంతంగా పూర్తవుతాయి. అవివాహితులకు సంబంధం కుదిరే అవకాశం ఉంది. మానసికంగా సంతోషంగా ఉంటారు

Also Read: ఈ రాశులవారి మనసులో ఏమున్నా ఠక్కున బయపెట్టేస్తారు, మీరున్నారా ఇందులో!

సింహ రాశి
ఈ రోజు మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. వ్యాపార రంగంలో విజయం ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. పెద్దల ఆశీస్సులు మీ వెంటే ఉంటాయి. మీ ప్రభావం పెరుగుతుంది. ప్రభుత్వ పనుల వల్ల లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వైవాహిక జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు.

కన్యా రాశి
ఈ రోజు మీకు చాలా శుభప్రదమైనది. స్నేహితులు, ప్రియమైన వారితో ప్రయాణాన్ని ఆనందిస్తారు. తీర్థయాత్రలకు వెళతారు. విదేశాలలో నివసిస్తున్న స్నేహితుల లేదా ప్రియమైనవారి వార్తలను పొందడం ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు లాభపడతారు. డబ్బు కొరత తీరుతుంది.

తులా రాశి
ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రహస్య శత్రువులపై నిఘా ఉంచండి. సోమరితనం వీడండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆకస్మిక ధనం లాభం ఉండొచ్చు. ఆధ్యాత్మిక సాధన ఉంటుంది. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు.

వృశ్చిక రాశి 
ఈ రోజు మీ మనసు వేరే ఆలోచనల్లో ఉంటుంది. బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. పిల్లలతో మంచి సమయం గడుపుతారు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. వాహనసుఖం పెరుగుతుంది. ప్రియమైన వ్యక్తిని కలుస్తారు. వైవాహిక జీవితం బావుంటుంది. 

Also Read: జ్యేష్ఠమాసం మొదలైంది - ఈ నెలలో ఎన్ని విశిష్ఠమైన రోజులున్నాయో తెలుసా!

ధనుస్సు రాశి
ఈ రాశివారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధనలాభం పొందే సూచనలున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి. 

మకర రాశి
ఈ రోజు అనారోగ్యంగా అనిపిస్తుంది. వ్యాపారులకు అదృష్టం కలసిరాదు. నూతన పెట్టుబడులు పెట్టడం సరికాదు. అధికారులు మీ పని పట్ల సంతృప్తి చెందరు.ఉద్యోగులకు పని ప్రదేశంలో సహోద్యోగులకు మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది.  సందిగ్ధంలో ఉండి నిర్ణయాలు తీసుకోవద్దు. పిల్లల ఆరోగ్యం జాగ్రత్త. 

కుంభ రాశి
మీరు మొండి వైఖరిని విడనాడాలి. అస్వస్థతగా అనిపిస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కొత్తగా ప్రారంభించిన పనులు లాభిస్తాయి. ఆర్థికంగా అనుకూలమైన రోజు. ఆర్థిక వ్యవహారాల్లో ఓ అడుగు ముందుకు వేస్తారు. 

మీన రాశి
ఈ రోజు మీకు మంచి రోజు. ధన,ఆస్తి వృద్ధి ఉంటుంది. ఆలోచనలలో స్థిరత్వం మనస్సులో దృఢత్వం కలిగి ఉండటం ద్వారా మీరు మీ పనిని చాలా చక్కగా చేయగలుగుతారు. స్నేహితులతో కలిసి సంతోష సమయం గడుపుతారు. పాత మిత్రులను కలుస్తారు. వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన ముందుకు కదులుతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget