News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ఏప్రిల్ 21 రాశిఫలాలు, ఆర్థికంగా ఓ అడుగు ముందుకుపడేందుకు ఈ రాశివారికి ఈ రోజు మంచిరోజు

Rasi Phalalu Today 21st April 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

ఏప్రిల్ 21 రాశిఫలాలు

మేష రాశి

ఈ రాశివారికి సోమరితనం వల్ల పనుల్లో వేగం తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి.శత్రువులు మీ పనికి ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగులు ఉన్నతాధికాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారులు త్వరలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు.ఇంట్లో విభేదాలు తగ్గాలంటే మీరు మౌనంగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కారణంగా మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు.

వృషభ రాశి 

ఈ రోజు మీ మనస్సు రకరకాల సమస్యలతో చుట్టుముట్టి ఉంటుంది. కంటికి సంబంధించిన ఇబ్బందులు రావొచ్చు. అత్యవసరం అయితేనే ప్రయాణం చేయడం మంచిది. కుటుంబంలో నిరసన వాతావరణం ఉండొచ్చు. మౌనంగా... వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఖర్చులు పెరుగుతాయి. ప్రారంభించిన పనులు అసంపూర్తిగా ఉండిపోవచ్చు. కష్టానికి తగిన ఫలితం అందుకోలేరు. వాహనం జాగ్రత్తగా నడపండి. ఉద్యోగం మారాలి అనే ఆలోచన ఉన్నవారు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు.

మిథున రాశి

ఈరోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థికంగా ఓ అడుగు ముందుకు పడేందుకు ఈ రోజు మంచిరోజు. స్నేహితులతో ఆహ్లాదకరమైన సమావేశం జరుగుతుంది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. ఓ శుభవార్త వినే అవకాశం ఉంది. ఏదైనా కొత్తపనిని ప్రారంభించేందుకు మంచిరోజు. ఆదాయం పెరుగుతుంది.స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆలోచించి ముందడుగు వేయండి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. 

Also Read: వంశపారపర్య ఆస్తులతో పాటూ పాపాలూ వెంటే వస్తాయి, వాటినుంచి విముక్తి పొందాలంటే!

కర్కాటక రాశి

ఈ రోజు మీ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా సులభంగా పూర్తవుతాయి. పనిలో అనుకూలత ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారులతో ముఖ్యమైన చర్చలు ఉంటాయి. నిరుద్యోగులు ఉద్యోగం సాధిస్తారు. వ్యాపారులు లాభపడతారు.కుటుంబ సభ్యులతో ఏదైనా విషయంపై చర్చించేటప్పుడు స్వచ్ఛంగా మాట్లాడతారు. యోగా, ధ్యానాన్ని మీ నిత్య వ్యవహారాల్లో భాగం చేసుకునేందుకు ప్రయత్నించండి. కొన్ని సమస్యలు ఎదురవుతాయి..తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారులకు కొన్ని ఇబ్బందులు తప్పవు.

సింహ రాశి

ఈ రోజు సింహరాశివారికి  మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. మీ ప్రవర్తన తటస్థంగా ఉంటుంది. మీ లక్ష్యంపై దృష్టి పెడతారు. మతపరమైన కార్యాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. స్నేహితులు లేదా బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. కోపం తగ్గించుకోవాలి. వ్యాపారంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది...నూతన పెట్టుబడులు పెట్టొద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త.

కన్యా రాశి 

ఈ రోజు మీరు మీ మాటతీరుని కాస్త అదుపుచేసుకోడం మంచిది. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. వైవాహిక జీవితంలో సాన్నిహిత్యం ఉంటుంది. ఎవరితోనైనా వైరం ఏర్పడవచ్చు. మీ శత్రువులు ఉత్సాహంగా ఉంటారు..మీరు అప్రమత్తంగా ఉండాలి. కొత్త పనులు ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉండదు. ఖర్చులు పెరగుతాయి.  ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి. ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం కాదు. 

తులా రాశి 

మీ ప్రియమైనవారికోసం డబ్బు ఖర్చుచేస్తారు. మీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు కొంత సమయం కేటాయించుకోండి. ఇంటా బయటా గౌరవం పొందుతారు. ఉద్యోగులు ఉన్నతాధికారులతో ప్రశంసలు పొందుతారు. వ్యాపారం బాగాసాగుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలొచ్చే సూచనలున్నాయి జాగ్రత్త. కాస్త ఓపికగా వ్యవహరించండి. 

Also Read: ఏప్రిల్ 17 - 23 వారఫలాలు, ఈ వారం ఈ రాశులవారికి ప్రమాదం పొంచిఉంది జాగ్రత్తపడాలి

వృశ్చిక రాశి

ఇంట్లో సంతోషం సంతోషం, ప్రశాంతత కారణంగా మానసకి ఆనందాన్ని పొందుతారు. అనుకున్న పనిలో విజయం సాధిస్తారు. అదృష్టం కలిసొస్తుంది. కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. మీ శత్రువులు ఎన్ని ఎత్తులువేసినా మీదే పైచేయి.  ఆర్థిక ప్రయోజనం పొందుతారు. ఈరోజు కొత్త ఆదాయ వనరులను కూడా కనుగొంటారు. అవసరమైన వాటి కోసం డబ్బు ఖర్చు చేస్తారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పులు చేయవద్దు.

ధనుస్సు రాశి 

ధనస్సు రాశివారు ఈ రోజు మీరు పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కడుపులో  ఏదో అసౌకర్యం ఉండవచ్చు. ఆహారం విషయంలో నియంత్రణ పాటించాలి. అనుకున్న పని పూర్తవకపోవడంతో నిరాశ చెందుతారు. కోపాన్ని తగ్గించుకోవాలి. కార్యాలయంలో పాత వివాదం తలెత్తవచ్చు.

మకర రాశి

ఈ రాశివారు ఈ రోజు వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావొచ్చు.  కుటుంబ సమస్యలు మీ మనసుపై ప్రభావం చూపిస్తాయి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం విషయంలో ఆందోళన ఉంటుంది. స్నేహితుల కారణంగా నష్టపోతారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో వివాదాలకు దూరంగా ఉండాలి. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టేవారు నష్టపోతారు. వృత్తిపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా పని చేయండి.

కుంభ రాశి

ఈ రోజు ఈ రాశివారి ఆరోగ్యం బావుంటుంది. మనసులో ఆందోళనలు తొలగిపోతాయి. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. తోబుట్టువులతో మీ సంబంధాలు బాగానే ఉంటాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. సన్నిహితులతో వివాదాలకు మాత్రం దూరంగా ఉండాలి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.

మీన రాశి

ఈ రోజు మీరు మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఎవరితోనైనా మాటపట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు లేదా లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో విభేదాలు బయటపడతాయి. ప్రతికూల ఆలోచనలు మనస్సును శాసిస్తాయి. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు. విద్యార్థులకు సమయం కాస్త కష్టమే అని చెప్పొచ్చు. ఏకాగ్రతలో ఇబ్బంది ఉంటుంది. మీ మాటతీరుతో ఎదుటివారిని బాధపెడతారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.

Published at : 21 Apr 2023 05:34 AM (IST) Tags: Astrology rasi phalalu Horoscope Today Aaj Ka Rashifal Today Rasiphalalu astrological prediction today 20th APril Horoscope Horoscope for 21st April 21st April Astrology

ఇవి కూడా చూడండి

Astrology: ఈ 5 రాశులవారు అపర చాణక్యులు, వ్యూహం రచిస్తే తిరుగుండదు!

Astrology: ఈ 5 రాశులవారు అపర చాణక్యులు, వ్యూహం రచిస్తే తిరుగుండదు!

Margashira Masam 2023 Starting Ending Dates: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో ముఖ్యమైన రోజులివే!

Margashira Masam 2023 Starting Ending Dates: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో  ముఖ్యమైన రోజులివే!

Christmas Celebrations 2023: ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు ఈ చర్చిల్లో జరుపుకునేందుకు ప్లాన్ చేసుకోండి!

Christmas Celebrations 2023: ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు ఈ చర్చిల్లో జరుపుకునేందుకు ప్లాన్ చేసుకోండి!

Horoscope Today December 2nd, 2023: ఈ రాశివారు ఒత్తికి దూరంగా ఉండాలి లేదంటే..

Horoscope Today  December 2nd, 2023: ఈ రాశివారు ఒత్తికి దూరంగా ఉండాలి లేదంటే..

Christmas 2023: క్రిస్మస్ వేడుకలు‌ డిసెంబరు 25నే ఎందుకు జరుపుకుంటారు!

Christmas 2023: క్రిస్మస్ వేడుకలు‌ డిసెంబరు 25నే ఎందుకు జరుపుకుంటారు!

టాప్ స్టోరీస్

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత