అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

జూన్ 26 రాశిఫలాలు, ఈ రోజు ఈ రాశులవారు కొత్త సంపాదన మార్గాలు పొందుతారు!

Rasi Phalalu Today June 26th : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

జూన్ 26 రాశిఫలాలు

మేష రాశి
ఈ రోజు ఈ రాశివారికి మంచి రోజు. మీ ప్రియమైన వారిని కలుస్తారు. రోజంతా సంతోషంగా ఉంటారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఈ రోజు ప్రత్యర్థులతో వాదోపవాదాలు జరగవచ్చు..మాట తూలకండి. ఉద్యోగులు అధికారులతో అనవసర చర్చలు పెట్టవద్దు. వీలైనంత మౌనంగా ఉండేందుకు ప్రయత్నించండి. 

వృషభ రాశి
ఈ రోజు ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది.  ఆస్తి వ్యవహారాలకు దూరంగా ఉండాలి. ప్రతికూల ఆలోచనలకు దరి చేరనివ్వకండి. మధ్యాహ్నం తర్వాత మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీ సృజనాత్మకత పెరుగుతుంది. ఈరోజు మీరు కొన్ని మతపరమైన పనులు చేస్తారు.

మిథున రాశి
ఈ రోజు మీరు ఊహించని  ప్రయోజనం పొందుతారు. స్నేహితులు, బంధువులను కలుస్తారు.  మధ్యాహ్నం తర్వాత, ప్రతికూల ఆలోచనలు మనసులో ఏదో ఆందోళన కలిగిస్తాయి. ఇంటి వాతావరణం గంభీరంగా ఉంటుంది. ఏ పనిలోనైనా అజాగ్రత్త వలన నష్టం కలిగే అవకాశం ఉంది. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు.

కర్కాటక రాశి
ఈరోజు ఈ రాశివారు తలపెట్టే పనులకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆకట్టుకునే మాటతీరుతో మీరు మీ పనులు సులభంగా పూర్తిచేయగలుగుతారు. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. మనసుకు సంతోషం ఉంటుంది. ఒకరిని కలవడం వల్ల మీ సంతోషం పెరుగుతుంది.

సింహ రాశి
ఈ రోజు మీరు ఇంటి పెద్దల నుంచి ప్రయోజనం పొందుతారు. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. మీ మాటతీరులో కోపాన్ని తగ్గించుకోవాలి. కుటుంబ వాతావరణంలో సామరస్యం ఉంటుంది. ఈరోజు ఖర్చులు మించకుండా చూసుకోండి. మీరు విదేశాలలో నివసిస్తున్న బంధువుల నుంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంది.  ప్రయాణం ఆనందదాయకంగా ప్రయోజనకరంగా ఉంటుంది.

కన్యా రాశి 
ఈ రోజు ఏదైనా విషయంలో గందరగోళం ఉంటే దాన్ని తొలగించుకునేందుకు ప్రయత్నించండి.  ఎవరితోనూ గొడవ పడకండి. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండకూడదని గుర్తుంచుకోండి. ఆదాయం కంటే ఖర్చులు పెరగవచ్చు. ఆందోళన భారం తగ్గుతుంది. సైద్ధాంతిక విభేదాలు ఎవరికైనా రావచ్చు. 

Also Read: బోనాలు ఆషాడమాసంలోనే ఎందుకు చేస్తారు

తులా రాశి
ఈ రోజు చాలా ఆలోచనాత్మకంగా మాట్లాడండి. మీ మనోబలం తగ్గుతుంది. స్నేహితుల నుంచి విశేష ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారంలో  లాభం ఉంటుంది. అనవసర భావోద్వేగానికి గురవుతారు. మనసు ఏదో ఆందోళన చెందుతుంది...ఆ ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది. మీ మాటలో సంయమనం పాటించండి. చికిత్సకు ఖర్చు ఉంటుంది.

వృశ్చిక రాశి 
ఈ రోజు మీరు ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న పని చాలా సులభంగా పూర్తవుతుంది. శాశ్వత ఆస్తి విషయాలకు సమయం మంచిది. ప్రభుత్వ పనులు లాభదాయకంగా ఉంటాయి. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది.  స్నేహితుల వల్ల ప్రయోజనం ఉంటుంది. అనిశ్చితి వాతావరణం ఉండొచ్చు. మధ్యాహ్నం తర్వాత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి.

ధనుస్సు రాశి
ఈ రోజు ఆరోగ్యం కూడా కొంత బలహీనంగా ఉంటుంది. మతపరమైన ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. వ్యాపారంలో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. పనిలో కొంత మెరుగుదల ఉంటుంది. కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. శాశ్వత ఆస్తి పత్రాల కోసం సరైన సమయం. స్నేహితుల వల్ల ప్రయోజనం ఉంటుంది. కార్యాలయంలో అభివృద్ధి ఉంటుంది.

మకర రాశి
ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు రాకుండా జాగ్రత్త వహించండి. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.   అర్ధంలేని చర్చకు దూరంగా ఉండండి. సంప్రదాయ పనిని పూర్తి చేస్తారు. బంధువులను కలుస్తారు. 

Also Read: ఈ వారం ఈ రాశుల ఉద్యోగులకు ప్రమోషన్ సమయం, జూన్ 26 నుంచి జూలై 2 వారఫలాలు

కుంభ రాశి
ఈ రోజు వ్యాపార భాగస్వాములతో ఒత్తిడికి లోనవుతారు. వైవాహిక జీవితంలో గందరగోళం ఉంటుంది. విద్యార్దుల చదువులో మంచి పనితీరు ఉంటుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. రోజువారీ పనుల్లో కొన్ని అడ్డంకులు ఏర్పడవచ్చు. ఉద్యోగస్తులు కార్యాలయంలో ఎవరితోనైనా వాగ్వాదానికి దిగవచ్చు. కష్టపడి పనిచేసినా తక్కువ ఫలితాలు వస్తాయి. వాహన సుఖం లభిస్తుంది. 

మీన రాశి 
ఈ రోజు రోజువారీ పనుల్లో జాప్యం ఉంటుంది. ఆఫీసులో సహోద్యోగుల నుంచి మద్దతు తక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడవచ్చు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. కొత్త సంపాదన సాధనాలు పొందుతారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
AR Rahman Legal Notice: వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
Weather Update: బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో చలికి గజగజ
బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో చలికి గజగజ
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Embed widget